* షుగర్ పేషెంటు అదిరిపడేదెప్పుడు?
రాత్రి పడుకోబోయేముందు ఎవరైన తనకు స్వీట్ డ్రీమ్స్ అని చెప్పినపుడు.
* డాక్టర్ తెల్లబోయేదెప్పుడు?
మీ ప్రాబ్లం ఏమిటో చెప్పండి అనడిగితే ఈ మధ్య ఆయనేం తెచ్చినా ఆనందపడిపోతున్నాను అని లేడీ పేషంట్ చెప్పినప్పుడు.
* డాక్టర్ విస్తుపోయేదెప్పుడు?
మీరు దేవుడిలాంటివారు. ఈ కొబ్బరికాయ, చిల్లర తీసుకుని మావాడికి ఆపరేషన్ చెయ్యండి డాక్టర్ అని పేషెంట్ బంధువు అన్నప్పుడు.
* ఒబేసిటీ పేషెంట్ షాకయ్యేదెప్పుడు?
పూటకి ఒక్క ముగ్గు చొప్పున ఉదయం-1, మద్యహ్నం-2, రాత్రి-3. ఇలా నెల రోజులపాటు రెగ్యులర్ గా ముగ్గులు పెట్టావంటే తీగలా సన్నబడతావు అని డాక్టర్ చెప్పినప్పుడు.
* పేషంట్ విస్తుపోయేదెప్పుడు?
నర్స్ పేషెంట్ వివరాలు రాసుకుంటూ ‘జన్మ నక్షత్రం చెబితే గుళ్ళో అతడిపేరు మీద అర్చన చేయిస్తా’మని చెప్పినపుడు.
* చమత్కారి డాక్టర్.
నాకు రాత్రుళ్ళు పీడకలలు వస్తున్నాయి అని పేషంట్ అంటే భార్యకి దూరంగా పడుకోమనేవాడు.
* నేటి పేషంట్?
ఇంటి దగ్గర వుంటే రోగం గురించి, హాస్పిటల్ కొచ్చాక బిల్లు గురించి బాధ పడేవాడు.
*అమాయకుడైన పేషంట్?
డాక్టరుగారిచ్చిన ఐరన్ టాబ్లెట్స్ అయస్కాంతానికి అతుక్కోవడం లేదేంటబ్బా? అని తెగ ఆలోచించేవాడు.
* సిసలైన చాదస్తపు డాక్టరు?
సంతానం కోసం సలహా అడిగిన పేషెంట తో పుత్ర కామేష్ఠి యాగం చేయమనేవాడు.
* నిజాయితీ గల క్రొత్త డాక్టరు?
నూతనంగా అద్దె ఇంట్లో ప్రాక్టీస్ ప్రారంభించిన హాస్పిటల్ గోడపై నేటి మీ ఫీజులే రేపటి నా శాశ్వత నర్సింగ్ హోమ్ కి పునాదులు అని క్యాప్షన్ వ్రాయించేవాడు.
తొలి ప్రచురణ పొద్దులో.....
No comments:
Post a Comment