తండ్రుల దినోత్సవం సంధర్భంగా చిన్న సమర్పణ…..
పిల్లల పెంపకంపై Spenser Johnson రాసిన బెస్ట్ సెల్లర్ The One Minute Father లోని కొన్ని విషయాలివి.
తండ్రిగా మారిన , మారబోయే ప్రతి వ్యక్తి తెలుసుకోవలసినవి.
1. తండ్రిగా మీ పిల్లల్ని నిరంతరం సంరక్షించదలచుకున్నారా? పిల్లలు తమని తాము
సంరక్షించుకునేలా పెంచదలచుకున్నారా?
2. పిల్లవాడు తమకు అనుగుణంగా ప్రవర్తించడమే క్రమశిక్షణ అని చాలామంది తల్లితండ్రులు
అనుకుంటారు. కాని ఇది తప్పు. మీరు క్రమశిక్షణ అని దేన్ని భావిస్తారో అది తమకు శిక్ష
అని పిల్లవాడు భావిస్తాడు.
3. తమ ప్రవర్తనలో మంచి చెడులను గుర్తించేలా పిల్లల్ని తయారుచేస్తే క్రమశిక్షణ దానంతటదే
అలవడుతుంది.
4. పిల్లల్ని మీరు సంపూర్ణంగా ప్రేమించండి. అప్పుడు మీ నిజమైన కోపాన్ని కూడా వాళ్ళు
అర్ధం చేసుకోగలరు.
5. చాలామంది పిల్లవాళ్ళు తమలా ప్రవర్తించడానికి ఇష్టపడతారు తప్ప తండ్రికి అనుకూలంగా
ఉండేలా కాదు.
6. పిల్లలకు తమకంటూ సొంత లక్ష్యాలుంటాయి. వాటి గురించి ఇతరులతో చెప్పరు. పిల్లల
ఏకాంతాన్ని ఏకాంత ఆలోచనల్ని తండ్రి గౌరవించాలి.
7. ప్రవర్తనే లక్ష్యాలను నిర్దేశిస్తుంది. పరిస్థితులే ప్రవర్తనను తీర్చిదిద్దుతాయి.
8. పిల్లలు మీకు నచ్చేలా ప్రవర్తించినపుడు ప్రశంసించండి.
9. పిల్లల్ని తరచూ దగ్గరకు తీసుకోవటంవల్ల మీ స్పర్శలోని ఆనందాన్ని వాళ్ళు పొందగలుగుతారు.
10. పిల్లల లక్ష్యం విజయం వైపు మళ్ళడానికి తండ్రిగా కృషి చేయండి. విజయమంటే ఏంటో
అర్ధమైతే వాళ్ళే లక్ష్యాలవైపు పరిగెత్తడం నేర్చుకుంటారు.
No comments:
Post a Comment