ఒక రోజు సాయంత్రం లింగం మావ తన స్నేహితుడితో కలిసి టీ.వీలో వార్తలు చూస్తున్నాడు. అప్పుడు వార్తలలో ఒక వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి చస్తానని బెదిరించే సీను చూపెట్టసాగారు. అప్పుడు స్నేహితుడు " ఆ వ్యక్తి తప్పకుండా దూకేస్తాడు చూడు!" …లింగం మావ మాత్రం " ఏం కాదు. ప్రాణమంటే ఎవడికి మాత్రం ప్రీతి కాదు. అతడు అస్సలు దూకడు ఊరికే బెదిరిస్తున్నాడు. కావాలంటే రెండొందలు పందెం" అన్నాడు. ఒప్పందం కుదిరింది. ఆ వ్యక్తి దూకేసాడు. ఉన్నాడో లేదో హాస్పిటల్‍కి తీసికెళ్ళారు. అప్పుడు లింగం మావ రెండొందలు తీసిచ్చాడు.కాని ఆ స్నేహితుడు తీసుకోలేదు. "వద్దురా అతడు దూకేస్తాడని నాకు తెలుసు. ఉదయం వార్తలలోనే చూసాను. కాని నీతో చెప్పలేదు. సారీ" అన్నాడు. ఆప్పుడు లింగం మావ "నేను కూడా ఆ వార్తను మద్యహ్నమే చూసాను కాని ఆ వ్యక్తి ముందు చేసిన తప్పే మళ్ళీ చేస్తాడా? ఈసారైనా దూకకుండా ఉంటాడేమో అనుకున్నా" అన్నాడు...
No comments:
Post a Comment