Friday, June 15, 2007

అన్నా. ఓ! చికెన్ గున్యా!!!!

మళ్ళీ పొంచి ఉన్న చికెన్ గున్యా

ఈ రోజు ఈనాడులో ఈ వార్త చదవగానే గత సంవత్సరం ఈ వ్యాధితో నేను, మా ఇంట్లో వారు, తెలిసినవారు అందరూ పడిన కష్టాలు మళ్ళీ గుర్తొచ్చాయి...పోయినేడాది ఆ వ్యాధి బారిన పడినప్పుడు రాసుకున్న కవిత...మీరైనా జాగ్రత్త పడండి.

 

 


దోమతో వచ్చావు గున్నలా పెరిగావు


గున్యాలా మారావు


మనుష్యుల్ని నుజ్జు నుజ్జు చేసావు


ఎముకల గుజ్జంతా తిన్నావు.


 


 


కాళ్ళు తిన్నావు కీళ్ళు తిన్నావు


మొకాళ్ళు కూడా తిన్నావు


కోడిపేరు పెట్టుకున్నావు


వాటికే మచ్చ తెచ్చావ్ .


 


జ్వరమంటూ మొదలెట్టి


దవాఖానా కీడుస్తావ్


పిల్లల్ని తల్లుల్ని పెద్దల్ని


నల్లిలా తొలిచేస్తావ్.


 


వద్దన్నా రావద్దన్నా


మా ఊరికీ, మా వీధికీ, మా ఇంటికీ


గున్నన్నా, ఓ గన్యన్నా


నీవంటే భయమన్నా


వదిలేయన్నా మమ్మల్ని మా కాళ్ళనీ,కీళ్ళన్నీ

No comments:

Post a Comment

test

Loading...