
అదో కూడలి..అక్కడ ఓ ఇంటి గోడపై కూర్చుని నాలుగు రౌడీ చీమలు వచ్చేపోయే వారిని అల్లరి పెడుతున్నాయి. అంతలో ఒక ఏనుగు అలా రోడ్డుపై వెళుతుంది.
అప్పుడు ఒక చీమ…" నిలువవే వాలు కనుల దానా! వయ్యారి హంస నడక దానా!" అని పాట పాడసాగింది.
ఇంకో చీమ…"మామా! పిల్ల పిట పిట లాడుతుందిరా! ఏం ఫిగర్ రా! 360..240..360.."
రెండు చీమలు బాగా తాగి రోడ్డుపై తూలుకుంటూ వెళుతున్నాయి. ఎదురుగా ఒక ఏనుగు వస్తుంది.
అప్పుడొక చీమ "రారా ! చూసుకుందాం" అంది.
రెండో చీమ "పోనీలే మామా! అది ఒక్కటి. మనమిద్దరం. బావుండదు"..
ఒక చీమ , దోమ ప్రేమించి పెళ్ళి చేసుకున్నాయి. పెద్దలను ఎదిరించాయీ. చివరకు వాళ్ళను ఒప్పించి ఘనంగా పెళ్ళి చేసుకున్నాయి. ఆరోజు వారిద్దరికి మొదటి రాత్రి..
దోమ దిగాలుగా గది బయట కుర్చీలో కూర్చుంది.
అలా వెళ్తున్న దోమ స్నేహితుడు ఈగ "ఏంట్రా! మొదటిరాత్రి అలా దిగాలుగా గది బయట కూర్చున్నావు?"
దోమ " ఆ దొంగ మొహంది. గుడ్‍నైట్ పెట్టుకుని పడుకుంది"….అంది.
No comments:
Post a Comment