* హీరో మారువేషం వేసి విలన్ ని ఆటపట్టిస్తాడు. అదే విలన్ మారువేషం వేస్తే ఇట్టే దొరికిపోతాడు.
* పిస్టల్లో ఆరు బుల్లెట్స్ ఉంటాయన్న సంగతి ప్రేక్షకుడికి తెలియదనుకొనిహీరో తెగ కాల్చేస్తుంటాడు.
* పేద హీరోయిన్ మేకప్పులో మాత్రం తక్కువ కాకుండా చూసుకుంటుంది.
* చదువురాని హీరో దేశాలు దాటి వెళ్ళిపోతాడు.వీసాలు,లాంగ్వేజు,డబ్బు ఇతనికి అవసరం లేదు ఎవరూ అడగరూ.
* విలన్ వంట్లోకి కత్తి దిగితే ఒక్కసారి చస్తాడు. అదే హీరో అయితే కత్తి వంట్లో ఎన్ని మెలికలు తిరిగినా డైలాగ్స్ అన్ని చెప్పేసి పడిపోతాడు. కట్ చేస్తే ఆసుపత్రిలో కళ్ళు తెరిచి నవ్వేస్తాడు.
* విలన్ తో పోరాడే ఆఖరి సన్నివేశం వరకు హీరో వంట్లో ప్రోబ్లంస్ బయటపడవు.
* కావల్సినంత హింస సృష్టించిన హీరో విలన్ కి హింస ఒక్కటే మార్గం కాదని నీతులు చెబుతాడు.
* హీరోయిన్సు ఎక్కువగా విలనుకి కూతుర్లుగానో,చెల్లెళ్ళుగానో చుట్టంగానో ఉంటారు.
No comments:
Post a Comment