Monday, January 22, 2007

తెలుగు సినిమా వజ్రోత్సవాలు

 

 గుండమ్మ కథ

1962 లో విడుదలైంది.
కథ : చక్రపాణి
మాటలు: డి.వి.నరసరాజు
దర్శకత్వం: కమలాకర కామేశ్వర రావు 

సంగీతం: ఘంటసాల
గానం : ఘంటసాల, సుశీల, జానకి , లీల.

నటీ నటులు ఎన్.టి.ఆర్,ఏ.ఎన్.ఆర్. సావిత్రి, జమున, సూర్యకాంతం,రమణారావు,

హరనాథ్,విజయలక్ష్మి,ఎస్.వి.రంగారావు మొదలైనవారు.

ఇందులో ప్రధానంగా కథ ఏంటంటే గుండమ్మ తన కూతురు సరోజ మరియు

 సవతి కూతురు లక్ష్మి గుమస్తా గంటయ్య తో ఉంటుంది.పెళ్ళిసంబంధం కోసం

వచ్చిన ఎస్.వి.రంగారావుతో అమర్యాదకరంగా మాట్లాడుతుంది.దాంతో గుండమ్మ

 తిక్క కుదర్చాలని అతని కొడుకులు  అంజి అతని తమ్ముడు రాజా మారువేషాల్లో

 గుండమ్మ ఇంటిలో చేరి ఆమే కూతుళ్ళని వలచి వాళ్ళని మారుస్తారు. ఈ సినిమా

 మొదటి నిమిషం నుండి చివరి వరకు ఎంతో ఆసక్తిదాయకంగా ఉంటుంది.

ఇందులో పాత్రలు మాత్రమే కనపడాయి, అంజి, గంటయ్య, గుండమ్మ  ఇలా...

ఎన్.టి.ఆర్ ఇంకా సూర్యకాంతం అని కనపడరు. అప్పుడు వాళ్ళు అలా కథలో

 లీనమై నటించేవారు. మనకు కూడా అది సినిమా, నిజం కాదు అని కూడా

 అనిపించదు. అంతలా లీనమై ఆనందిస్తాము.ప్రతి పది నిమిషాలకు ఒక

పాట వచ్చినా విసుగు అనిపించదు. ఒక్కొక్కటి ఒకో ఆణీముత్యం వంటి

పాటలు.లేచింది నిద్ర లేచింది, కోలుకోలోయన్న కోలో నా సామి,

ప్రేమయాత్రలకు బృందావనము,ఇలా వింటూ ఉంటే ఇంకా కావాలనిపిస్తుంది.

 నిజంగా ఆ పాత్రలే పాడుతున్నాయేమో అనిపిస్తుంది అంత సహజంగా

ఉంటుంది చిత్రీకరణ కూడా.సినిమా మొత్తం చూసినా ఒక్క సన్నివేశం

కూడా కృత్రిమంగ ఉన్నట్టనిపించదు.  నేనైతే ఇందులో ఏదన్నా తప్పు

 కనపడుతుందాని వెతికా  ఒక్కటి లేదు. నటన, సంగీతం, పాటలు ,

సంభాషణలు,అన్ని సహజంగా ఉంటాయి. నిజంగా ఈ సినిమా చూస్తే

నాకైతే మనసు పులకరిస్తుంది. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.మళ్ళీ ఆ

నటులు పుడితే బావుండును అని అనుకుంటాను. వాళ్ళకు వారసులు

 ఎవరూ లేరేమో?  

No comments:

Post a Comment

test

Loading...