* జైలులో దొంగని జైలర్ గారు ఏం అన్నా ఫర్వాలేదుగానీ "గెటవుట్"
అంటే మాత్రం...
* ఒక్కగానొక్క కూతురు, ఒక్కగానొక్క కొడుకు అంటే ఫర్వాలేదుగాని
ఒక్కగానొక్క తండ్రి అంటే మాత్రం...
* ఇంటికొచ్చిన అతిథి దేవుళ్ళు తిరిగి వెళ్ళీపోతున్నపుడు " చాలా థాంక్స్
అండి" అంటే మాత్రం ....
* " దయచేసి మళ్ళీ రండి " అన్న బోర్డు ఎక్కడ పెట్టినా ఫర్వాలేదుగానీ
స్మశానం గేట్ దగ్గర మాత్రం...
* పెళ్ళి చూపుల్లో అమ్మాయిని ఏం అడిగినా ఫర్వాలేదుగానీ "అనుభవం
ఉందా " అనడిగితే మాత్రం ...
* జ్వరమొచ్చి హాస్పిటల్లో చేరిన బాస్ని పలకరించడానికెళ్ళి " ఏం సార్!
ఒళ్ళెలా ఉంది " అని అనడం మాత్రం...
* ఉరిశిక్ష పడ్ద ఖైదీని ఇంటర్వ్యూ చేయడానికెళ్ళి " మీ ఫ్యూచర్ ప్లాన్స్
ఏంటండీ" అని అడగడం మాత్రం...
* సినిమా హాల్లో కనపడ్డ ఫ్రెండుని ఎలా పలకరించినా ఫర్వాలేదుకాని
"సినిమా కొచ్చావా " అని పలకరించడం మాత్రం ...
* కొత్తగా పెళ్ళయిన స్నేహితుడు మర్యాద కోసం తన భార్యని పరిచయం
చేసినప్పుడు " వావ్! సూపర్ గురూ! నీ సెలక్షనే సెలక్షన్ గురూ !"
అంటూ రెచ్చిపోయి పొగిడెయ్యడం మాత్రం...
* రూలు ప్రకారం "సిస్టర్" అన్నాడు కదా అని రాఖీ పండుగ నాడు
నర్సులందరూ రాఖీలు కట్టమని కుర్ర డాక్టరు వెంటపడటం మాత్రం...
* తిరుమల కొండమీద దువ్వెనలమ్మే షాప్ పెట్టి, సేల్స్ లేవని బాధపడటం
మాత్రం...
No comments:
Post a Comment