Tuesday, January 30, 2007

(వి)లక్షణమైన పెళ్ళి పత్రిక

నేను ఆదిత్య, నిన్ను నా జీవిత భాగస్వామిగా ఎంచుకుంటున్నాను.


నేను కొన్ని వాగ్ధానాలు చేస్తున్నాను. నీకోసం కూరగాయలు కోసి


పెడతాను, అంట్లు కడుగుతాను,ఇల్లు సర్దుతాను(నువ్వు వంట తినే


విధంగా చేస్తే).నీ పుట్టినరోజు,మన పెళ్ళిరోజు అస్సలు మర్చిపోను


( నువ్వు ఖరీదైన చీరలు,నగలు అడక్కుండా ఉంటే ). నిన్ను తప్ప


 వేరే అమ్మాయిని కన్నెత్తి చూడను( నువ్వు అందంగా నాజూగ్గా


ఉంటేనే) అని ఒట్టేసి చెబుతున్నా.


నేను సుజాత, నిన్ను నా భాగస్వామిగా ఒప్పుకుంటున్నాను.


నేను కూడా కొన్ని వాగ్ధానాలు చేస్తున్నాను. నీ కారు తుడిచి


పెడ్తా.టైరు మార్చడం కూడా నేర్చుకుంటా.వంట నేర్చుకుంటా


 మా నాన్న దగ్గర.నీ కిస్టమైన క్రికెట్ చూస్తుంటే డిస్టర్బ్


చేయను.ఎక్కువ షాపింగని విసిగించను.


ఈ వాగ్ధానాలు మేము నిలబెట్టుకోగలమా? ఏమో ? ఏ నిమిషానికి


ఏమి జరుగునో ఎవరూహించెదరూ.?మా ఈ ప్రేమ పెళ్ళికి మీరందరూ


సకుంటుంబ సపరివార సమేతంగా విచ్చేసి మమ్ము ఆశీర్వదించి


కానుకలు ఇచ్చేసి భోంచేసి వెళ్ళగలరు.


No comments:

Post a Comment

test

Loading...