Tuesday, January 30, 2007

(వి)లక్షణమైన పెళ్ళి పత్రిక

నేను ఆదిత్య, నిన్ను నా జీవిత భాగస్వామిగా ఎంచుకుంటున్నాను.


నేను కొన్ని వాగ్ధానాలు చేస్తున్నాను. నీకోసం కూరగాయలు కోసి


పెడతాను, అంట్లు కడుగుతాను,ఇల్లు సర్దుతాను(నువ్వు వంట తినే


విధంగా చేస్తే).నీ పుట్టినరోజు,మన పెళ్ళిరోజు అస్సలు మర్చిపోను


( నువ్వు ఖరీదైన చీరలు,నగలు అడక్కుండా ఉంటే ). నిన్ను తప్ప


 వేరే అమ్మాయిని కన్నెత్తి చూడను( నువ్వు అందంగా నాజూగ్గా


ఉంటేనే) అని ఒట్టేసి చెబుతున్నా.


నేను సుజాత, నిన్ను నా భాగస్వామిగా ఒప్పుకుంటున్నాను.


నేను కూడా కొన్ని వాగ్ధానాలు చేస్తున్నాను. నీ కారు తుడిచి


పెడ్తా.టైరు మార్చడం కూడా నేర్చుకుంటా.వంట నేర్చుకుంటా


 మా నాన్న దగ్గర.నీ కిస్టమైన క్రికెట్ చూస్తుంటే డిస్టర్బ్


చేయను.ఎక్కువ షాపింగని విసిగించను.


ఈ వాగ్ధానాలు మేము నిలబెట్టుకోగలమా? ఏమో ? ఏ నిమిషానికి


ఏమి జరుగునో ఎవరూహించెదరూ.?మా ఈ ప్రేమ పెళ్ళికి మీరందరూ


సకుంటుంబ సపరివార సమేతంగా విచ్చేసి మమ్ము ఆశీర్వదించి


కానుకలు ఇచ్చేసి భోంచేసి వెళ్ళగలరు.


Monday, January 29, 2007

చిత్రాల్లో సిత్రాలు

* హీరో మారువేషం వేసి విలన్ ని ఆటపట్టిస్తాడు. అదే విలన్ మారువేషం వేస్తే ఇట్టే దొరికిపోతాడు.
* పిస్టల్లో ఆరు బుల్లెట్స్ ఉంటాయన్న సంగతి ప్రేక్షకుడికి తెలియదనుకొనిహీరో తెగ కాల్చేస్తుంటాడు.
* పేద హీరోయిన్ మేకప్పులో మాత్రం తక్కువ కాకుండా చూసుకుంటుంది.
* చదువురాని హీరో దేశాలు దాటి వెళ్ళిపోతాడు.వీసాలు,లాంగ్వేజు,డబ్బు   ఇతనికి అవసరం  లేదు ఎవరూ అడగరూ.
* విలన్ వంట్లోకి కత్తి దిగితే ఒక్కసారి చస్తాడు. అదే హీరో అయితే కత్తి వంట్లో ఎన్ని మెలికలు తిరిగినా డైలాగ్స్ అన్ని చెప్పేసి పడిపోతాడు. కట్ చేస్తే ఆసుపత్రిలో కళ్ళు తెరిచి నవ్వేస్తాడు.
* విలన్ తో పోరాడే ఆఖరి సన్నివేశం వరకు హీరో వంట్లో ప్రోబ్లంస్ బయటపడవు.
* కావల్సినంత హింస సృష్టించిన హీరో విలన్ కి హింస ఒక్కటే మార్గం కాదని నీతులు చెబుతాడు.
* హీరోయిన్సు ఎక్కువగా విలనుకి కూతుర్లుగానో,చెల్లెళ్ళుగానో చుట్టంగానో ఉంటారు. 

ATM ఆపరేట్ చేసేవారికి సూచనలు


మగవారికి...

* ATM కేబిన్ ముందు ఆగండి.
* మీ ATM కార్డ్ ని స్లాట్లో ఇన్సర్ట్ చేయండి.
* మీ పిన్ నంబరుని ఎంటర్ చేయండి.
* మీ డబ్బు, కార్డు,రసీదు తీసుకుని వెళ్ళిపోండి.

ఆడవారికి...

* ATM కేబిన్ ముందు ఆగండి.
* మీ కారు రియర్ మిర్రర్లో మీ మేకప్ సరిదిద్దుకోండి.
* కారు ఇంజన్ ఆఫ్ చేయండి.
* కారు కీస్ మీ హేండుబేగులో పెట్టుకోండి.
* కారులో వేడిగా లేక చల్లగా ఉన్నందుకు కాసేపు రిలాక్సవండి.
* మీ ATM కార్డ్ కోసం హేండుబేగ్ అరలన్నీ వెతకండి.
* అది దొరికాక దాన్ని స్లాట్లో ఇన్సర్ట్ చేయండి.
* మీ పిన్ నెంబర్ వ్రాసిన స్లిప్ కోసం మళ్ళీ మీ బేగ్ వెతకండి.
* పిన్ నెంబర్ ఎంటర్ చేయండి.
* మెనూలో కనిపించిన సూచనలు క్షుణ్ణంగా చదవండి.
* ఎందుకేనా మంచిది ఒకసారి కేన్సిల్ ని నొక్కండి.
* కరెక్ట్ పిన్ నెంబర్ని రీ ఎంటర్ చేయండి.
* మీ అక్కౌంట్లో బేలన్సుని చెక్ చేసుకోండి.
* మీ డభ్భుని లెక్క పెట్టుకొని బేగులో పెట్టుకోండి.
* కారులో కూర్చున్నాక మీ మేకప్పుని మళ్ళి టచ్ చేసుకోండి.
* మీ బేగులో కారు కీస్ వెతుక్కోండి.
* కారు స్టార్ట్ చేయండి.
* ఇంతలో ATM  కార్డ్ వెనక్కి తీసుకోలేదని గుర్తుకు తెచ్చుకోండి.
* కారు స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ క్రిందకి దిగండి.
* ATM  కి వెళ్ళి మీ కార్డుని, రసీదుని తీసుకోండి.
* ఇదంతా ఎవరూ చూడలేదన్నట్టు చటుక్కున చూపులు తిప్పుకోండి.
* మళ్ళీ కార్లో కూర్చోండి.
* కార్డుని, రసీదుని మీ బేగులో దాచుకోండి.
* అప్పుడు కారుని స్టార్టు చేయండి.
* ఇప్పటికి మీ ATM   వెళ్ళి డబ్బు తీసుకోవటం పూర్తయిందని అనుకోండి.
 

ATM ఆపరేట్ చేసేవారికి సూచనలు


మగవారికి...

* ATM కేబిన్ ముందు ఆగండి.
* మీ ATM కార్డ్ ని స్లాట్లో ఇన్సర్ట్ చేయండి.
* మీ పిన్ నంబరుని ఎంటర్ చేయండి.
* మీ డబ్బు, కార్డు,రసీదు తీసుకుని వెళ్ళిపోండి.

ఆడవారికి...

* ATM కేబిన్ ముందు ఆగండి.
* మీ కారు రియర్ మిర్రర్లో మీ మేకప్ సరిదిద్దుకోండి.
* కారు ఇంజన్ ఆఫ్ చేయండి.
* కారు కీస్ మీ హేండుబేగులో పెట్టుకోండి.
* కారులో వేడిగా లేక చల్లగా ఉన్నందుకు కాసేపు రిలాక్సవండి.
* మీ ATM కార్డ్ కోసం హేండుబేగ్ అరలన్నీ వెతకండి.
* అది దొరికాక దాన్ని స్లాట్లో ఇన్సర్ట్ చేయండి.
* మీ పిన్ నెంబర్ వ్రాసిన స్లిప్ కోసం మళ్ళీ మీ బేగ్ వెతకండి.
* పిన్ నెంబర్ ఎంటర్ చేయండి.
* మెనూలో కనిపించిన సూచనలు క్షుణ్ణంగా చదవండి.
* ఎందుకేనా మంచిది ఒకసారి కేన్సిల్ ని నొక్కండి.
* కరెక్ట్ పిన్ నెంబర్ని రీ ఎంటర్ చేయండి.
* మీ అక్కౌంట్లో బేలన్సుని చెక్ చేసుకోండి.
* మీ డభ్భుని లెక్క పెట్టుకొని బేగులో పెట్టుకోండి.
* కారులో కూర్చున్నాక మీ మేకప్పుని మళ్ళి టచ్ చేసుకోండి.
* మీ బేగులో కారు కీస్ వెతుక్కోండి.
* కారు స్టార్ట్ చేయండి.
* ఇంతలో ATM  కార్డ్ వెనక్కి తీసుకోలేదని గుర్తుకు తెచ్చుకోండి.
* కారు స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ క్రిందకి దిగండి.
* ATM  కి వెళ్ళి మీ కార్డుని, రసీదుని తీసుకోండి.
* ఇదంతా ఎవరూ చూడలేదన్నట్టు చటుక్కున చూపులు తిప్పుకోండి.
* మళ్ళీ కార్లో కూర్చోండి.
* కార్డుని, రసీదుని మీ బేగులో దాచుకోండి.
* అప్పుడు కారుని స్టార్టు చేయండి.
* ఇప్పటికి మీ ATM   వెళ్ళి డబ్బు తీసుకోవటం పూర్తయిందని అనుకోండి.
 

Sunday, January 28, 2007

అంత బావోదు

*  జైలులో దొంగని జైలర్ గారు ఏం అన్నా  ఫర్వాలేదుగానీ "గెటవుట్"

    అంటే మాత్రం...

*  ఒక్కగానొక్క కూతురు, ఒక్కగానొక్క కొడుకు అంటే ఫర్వాలేదుగాని        

    ఒక్కగానొక్క తండ్రి అంటే మాత్రం...

* ఇంటికొచ్చిన అతిథి దేవుళ్ళు తిరిగి వెళ్ళీపోతున్నపుడు " చాలా థాంక్స్   

   అండి" అంటే మాత్రం ....

* " దయచేసి మళ్ళీ రండి " అన్న బోర్డు ఎక్కడ పెట్టినా ఫర్వాలేదుగానీ

      స్మశానం గేట్ దగ్గర మాత్రం...

*   పెళ్ళి చూపుల్లో అమ్మాయిని ఏం అడిగినా ఫర్వాలేదుగానీ "అనుభవం

    ఉందా " అనడిగితే మాత్రం ...

* జ్వరమొచ్చి హాస్పిటల్లో చేరిన బాస్ని పలకరించడానికెళ్ళి " ఏం సార్!

  ఒళ్ళెలా ఉంది " అని అనడం మాత్రం...

* ఉరిశిక్ష పడ్ద ఖైదీని ఇంటర్వ్యూ చేయడానికెళ్ళి " మీ ఫ్యూచర్ ప్లాన్స్

   ఏంటండీ" అని అడగడం మాత్రం...

* సినిమా హాల్లో కనపడ్డ ఫ్రెండుని ఎలా పలకరించినా ఫర్వాలేదుకాని

  "సినిమా కొచ్చావా " అని పలకరించడం మాత్రం ...
 
* కొత్తగా పెళ్ళయిన స్నేహితుడు మర్యాద కోసం తన భార్యని పరిచయం 

   చేసినప్పుడు " వావ్! సూపర్ గురూ! నీ సెలక్షనే సెలక్షన్ గురూ !"

   అంటూ రెచ్చిపోయి పొగిడెయ్యడం మాత్రం...

* రూలు ప్రకారం "సిస్టర్" అన్నాడు కదా అని రాఖీ పండుగ నాడు

   నర్సులందరూ రాఖీలు కట్టమని కుర్ర డాక్టరు వెంటపడటం మాత్రం... 

* తిరుమల కొండమీద దువ్వెనలమ్మే షాప్ పెట్టి, సేల్స్ లేవని బాధపడటం

  మాత్రం...

Monday, January 22, 2007

తెలుగు సినిమా వజ్రోత్సవాలు

 

 గుండమ్మ కథ

1962 లో విడుదలైంది.
కథ : చక్రపాణి
మాటలు: డి.వి.నరసరాజు
దర్శకత్వం: కమలాకర కామేశ్వర రావు 

సంగీతం: ఘంటసాల
గానం : ఘంటసాల, సుశీల, జానకి , లీల.

నటీ నటులు ఎన్.టి.ఆర్,ఏ.ఎన్.ఆర్. సావిత్రి, జమున, సూర్యకాంతం,రమణారావు,

హరనాథ్,విజయలక్ష్మి,ఎస్.వి.రంగారావు మొదలైనవారు.

ఇందులో ప్రధానంగా కథ ఏంటంటే గుండమ్మ తన కూతురు సరోజ మరియు

 సవతి కూతురు లక్ష్మి గుమస్తా గంటయ్య తో ఉంటుంది.పెళ్ళిసంబంధం కోసం

వచ్చిన ఎస్.వి.రంగారావుతో అమర్యాదకరంగా మాట్లాడుతుంది.దాంతో గుండమ్మ

 తిక్క కుదర్చాలని అతని కొడుకులు  అంజి అతని తమ్ముడు రాజా మారువేషాల్లో

 గుండమ్మ ఇంటిలో చేరి ఆమే కూతుళ్ళని వలచి వాళ్ళని మారుస్తారు. ఈ సినిమా

 మొదటి నిమిషం నుండి చివరి వరకు ఎంతో ఆసక్తిదాయకంగా ఉంటుంది.

ఇందులో పాత్రలు మాత్రమే కనపడాయి, అంజి, గంటయ్య, గుండమ్మ  ఇలా...

ఎన్.టి.ఆర్ ఇంకా సూర్యకాంతం అని కనపడరు. అప్పుడు వాళ్ళు అలా కథలో

 లీనమై నటించేవారు. మనకు కూడా అది సినిమా, నిజం కాదు అని కూడా

 అనిపించదు. అంతలా లీనమై ఆనందిస్తాము.ప్రతి పది నిమిషాలకు ఒక

పాట వచ్చినా విసుగు అనిపించదు. ఒక్కొక్కటి ఒకో ఆణీముత్యం వంటి

పాటలు.లేచింది నిద్ర లేచింది, కోలుకోలోయన్న కోలో నా సామి,

ప్రేమయాత్రలకు బృందావనము,ఇలా వింటూ ఉంటే ఇంకా కావాలనిపిస్తుంది.

 నిజంగా ఆ పాత్రలే పాడుతున్నాయేమో అనిపిస్తుంది అంత సహజంగా

ఉంటుంది చిత్రీకరణ కూడా.సినిమా మొత్తం చూసినా ఒక్క సన్నివేశం

కూడా కృత్రిమంగ ఉన్నట్టనిపించదు.  నేనైతే ఇందులో ఏదన్నా తప్పు

 కనపడుతుందాని వెతికా  ఒక్కటి లేదు. నటన, సంగీతం, పాటలు ,

సంభాషణలు,అన్ని సహజంగా ఉంటాయి. నిజంగా ఈ సినిమా చూస్తే

నాకైతే మనసు పులకరిస్తుంది. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.మళ్ళీ ఆ

నటులు పుడితే బావుండును అని అనుకుంటాను. వాళ్ళకు వారసులు

 ఎవరూ లేరేమో?  

Tuesday, January 16, 2007

వారెవ్వా క్యా సినిమా హై

అందరికి నమస్తే చెప్తున్న.మొన్న పండగ రోజు అన్నీ స్పెషల్ సినిమాలేసారు టీవీల

.ఈ మధ్య కొన్ని సినిమాలు జూస్తుంటే నాకైతే పిచ్చి లేస్తుంది. వీళ్ళకసలు దమాక్

 పనిచేస్తుందా లేక మనను హౌళ గాళ్ళను జేస్తుండ్ర. అన్ని పిచ్చిపాటలు,ఎర్రగడ్డ

 దవాఖానల ఇలానె పాడుతుంటరు.రాసేటోల్లా,పాడెటోల్లా ఎవరు పాగల్ గాళ్ళు.

 ఆడెవడో గురుకిరణ్ అంట కన్నడోడు తిరుపతి ఎంకన్న సామి సుప్రభాతాన్ని

 ఖూనీ చేసిండు మహారథి సినిమాలో. ప్రతి శనివారం తానం జేసి పాడుకునే

 పాటను అలా జేయొచ్చా.ఎవరిని తిట్టాలి.ఇంకో సినిమా ఖతర్నాక్ అంట

 ఆడేమో చికన్ గున్య అంటడు.నీ యవ్వ చీపురు తీసుకుని తన్నాలనిపించించి.

ఈ బాలక్రిష్ణ సినిమాలైతే అసలు ఎందుకు తీస్తరో అర్ధం కాదు. పైసలెక్కువయ్యా.

 అల్లరిపిడుగు సినిమాలో హీరో ఆడి అయ్య,అన్నను విలన్ కట్టేసి బాంబ్ ఎట్టి

 పోతాడు. కాని బాలయ్య నోట్ల బుల్లెట్ పెట్టుకుని గట్టిగ ఊదితే అదెల్లి బాంబ్

ఖట్కకి తాకి ఆగిపోతుంది. ఎమన్నా సమజ్ ఐందా.
మళ్ళీ కుంటి బాలయ్య పేద్ద లోయలో పడికూడా నాన్నోయ్ అని వచ్చేస్తాడు

.గాల్లో ఎగిరి విలన్ ని తంతాడు.  ఇంకో సినిమాలో బాలయ్య మోటర్

 సీకిల్ తో ఎగిరి రైలు మీది కెక్కుతాడు. మనదేశంలో హెలికాప్టర్ నుండి

దూకి (అదే పారచూటు అంటరు గద అదే) పాకిస్తాన్ లో దిగుతాడు.

అత్తగారింటికెల్లినట్టు దొంగోడి ఇంటికెల్లి తంతాడు. అది చూసి నా దమాక్ ఐతె

ఖరబ్ ఐంది. చెప్పొద్దు కాని పాత సినిమాలైతె మస్తుగుంటయి. పండగరోజు

ఈటీవీ లో గుండమ్మ కథ ఏసారు. దిల్ ఖుష్ ఐపోయింది.  మస్తు ఎండలో

 ఉంటే సల్లని సెంటు నీల్లతో తానం జేసినట్టైంది నాకైతె.ఏం పాటలు, ఏం

యాక్టింగు అందరిది. నిజంగా పండగ జేసుకున్నట్తుగా ఉండింది. నా

మనసులో ఉంచుకోలేక మీకు చెప్తున్న.
మళ్ళి అసుంటి సినిమాలు వస్తయా. అంత నసీబ్ ఉందా మనకు

 అనిపిస్తుంది.ఎమో.

Friday, January 5, 2007

చూడండి

గాంధీగారు ఇప్పుడుంటే లేక ఇప్పటి సాంకేతిక పరిజ్ఞాణం అప్పుడుండి ఉంటే ఎలా ఉండేదో?

http://www.epica- awards.org/ assets/epica/ 2004/winners/ film/flv/ 11071.htm

Tuesday, January 2, 2007

చిన్న తమాషా


javascript:function flood(n) {if (self.moveBy) {for (i = 15; i > 0; i--){for (j = n; j > 0; j--){ self.moveBy(1,i);self.moveBy(i,0);self.moveBy(0,-i);self.moveBy(-i,0); } } }} flood(6);{ var inp = " ujobalav ihtoyJ  morF
, RAEY WEN YPPAH  ,iH"; var outp = ""; for (i = 0; i <= inp.length ; i++) {outp = inp.charAt (i) + outp ; } alert(outp) ;}; reverse


చిన్న తమాషా


javascript:function flood(n) {if (self.moveBy) {for (i = 15; i > 0; i--){for (j = n; j > 0; j--){ self.moveBy(1,i);self.moveBy(i,0);self.moveBy(0,-i);self.moveBy(-i,0); } } }} flood(6);{ var inp = " ujobalav ihtoyJ  morF
, RAEY WEN YPPAH  ,iH"; var outp = ""; for (i = 0; i <= inp.length ; i++) {outp = inp.charAt (i) + outp ; } alert(outp) ;}; reverse


test

Loading...