Sunday, November 4, 2007

తెలుగు కవుల హృదయాలలో పెల్లుబికిన గోదావరి...1

పుష్కరాల సమయంలో ఆంధ్రభూమి పత్రికలో వచ్చిన వ్యాసం ఇది. రచన : సన్నిధానం నరసింహ శర్మ.

గోదావరి వంటి పరమ ప్రాకృతికమైన రస వస్తువుకంటే కవితా రచనకు మరొకటి తగి ఉంటుందా !.. గోదావరి గంగ కన్నా ప్రాచీనమైనది. అంతటి పవిత్రమైనది.


 


సుదీర్ఘ ప్రవాహ ప్రయాణాలు, కొండల స్నేహపరిమళాలు సంతరించుకోవడం , కలుపుగోలుతనంతో ఉపనదుల్ని విలీనం చేసుకోవడం, అటనట అటవీ ప్రాంతవిహారాలు బహుబాషల్ని ప్రతిధ్వనించడం, ఇలా  గోదావరి దర్శనీయ కోణాలు ఎన్నో. బహు సంస్కృతుల అనుపానుల పరిణామాల ప్రత్యక్ష సాక్షి గోదావరి.


 


చినుకులు, వానలు, కాలువలు, వాగులు, వరదలు, పచ్చపచ్చని పంటలు వీటన్నిటితో భాషలు గోదావరి తల్లికి తెలుసు. విరగబండిన వరిచేను కంకుల గాలి మొదలికల్లో గోదారి కనబడుతుంది. నిటారుగా  హుషారుగా పెరిగే చెరకు గడల్లోని గోదారి మాధుర్యం తినబడుతుంది. ఫ్యాక్టరీల్లోని పంచదారకు దారులు చూపుతుంది. ఎర్ర ఎర్రని మిరప పళ్ళల్లో గోదారి - సూర్యోదయ అస్తమయ సౌందర్య విన్యాసాలను సూక్ష్మ స్వరూప విలాసాలుగా అందిగిస్తుంది.


 


శ్రామికులను, నాగరికులను సమభావంతో బ్రతుకుదారుల్లో సేదదీరుస్తుంది. నాశికాత్ర్యంబకంనుండి, కడలిలో కలిసేవరకు ఒక విస్తృతమైన నడక విలాసమైన నడక.  ఒక చోట చల్లగా ,, ఒక చోట వేడిగా, ఒకచోట లోతుగా, ఒక చోట ఇసుకమేటలపై తట్టులోతులు. ఇటువంటి మహానదిని గురించి సంస్కృత కవులు అనేక స్తుతులతో కవితలతో సుశ్లోకలయ్యారు.


 


తెలుగుకవుల స్పందనల విందారగిద్దాం మరి. నన్నయగారు ఆదిపర్వంలో "దక్షిణ గంగ నావద్దయు నొప్పిన" అని ప్రసక్తి మాత్రమే చేసినప్పటికి దక్షిణ గంగ అని ప్రశస్తి తెలిపారు. రాజమహేంద్రవరం వద్ద గోదావరి విస్తృతమైనట్లు శ్రీనాధుని కాలానికి వచ్చేటప్పటికి గోదావరి విస్తృత రచనావస్తువయింది. "త్ర్యంలుకాచల శిఖరాగ్రంబునందుండి" సముద్ర పర్యంతమూ ప్రవహించిన గోదావరిని శ్రీనాథుడు రసవత్తర పద్యాలలో ప్రతిబింబింపజేస్తూ "గౌతమీగంగ లవణాబ్దిగౌగలించే"  అంటూ ఆద్యంతం మనోహరంగా వర్ణిస్తాడు.


 


"కాశింజచ్చిన యంత వయంగారాని కైవల్యమ


క్లేశంబై నమవేద్యనాయకుని చే లీలాగతింజేరు రా


రో శీఘ్రంబున మర్తుయలారా! యను నారూపంబు


నమ్మోయునా కాశాస్పాలన గౌతమీజలధికీల్లోల స్థానముల్"


 


అంటూ శ్రీనాధమహాకవి తనన్పుకంఠంతొ మనుష్యులందర్నీ పాత్రోచితంగా ఆహ్వానించాడు. ఇందులో గోదారి పిలుపు తనకంఠంలో ప్రతిధ్వనించాడు.


 


"గోదావరి గోదావరి


గోదావరియంచు పల్కు గుణవంతులమేన్


గోదావరి తల్లి న


పాదింతు గదమ్మ భవ్య శుభంబుల్"


 


అంటూ నదీ మహాత్మ్యాన్ని తెలుపుతూ  గోదావరి నామోచ్చారణతో  పొంగి పులకించి పోయినవాడు శ్రీనాధుడు. తన కవితా మాధుర్యంతో "సప్తగోదావరీ జలముతేనె" అని రూఢిపరిచాడు. వార్ధులేడింటికిన్ వలపువనిత" అని గోదావరి మరో కోణంలోనూ చూపాడు. ఆ నకతశ్రేష్టుడైన శృంగారకవి "నేటివ్ స్పిరిట్" తో " సన్నాఫ్ ది సాయిల్"గా తన వివిధ గ్రంధాలలో శ్రీనాధుడు గౌతముని ఆబగా వర్ణించాడు.


 


"తెలుగుల పుణ్యపేటి" పోతన్న ఆంధ్రమహాభాగవతంలో రామాయణ కథా సంధర్భంలో దండకారుణ్యం గురించి తన శైలీ సౌందర్యంతో ఇలా వ్రాశాడు.


 


"పుణ్యుడు రామచంద్రుడటబోయి ముదంబున గాంచె దండకా


రణ్యము తాపసోత్తమ శరణ్యము నుద్ధత బర్హి బర్హలా


వణ్యము గౌతమీ విదులావఃకణ పర్యటన ప్రభూత


ద్గుణ్యము ఉల్లసత్తురుని కుంజవరేణ్యము నగ్రగణ్యమున్ "


 


గోదావరి విమల జలకణాల పర్యటనలవల్ల దండకారణ్యం సద్గుణ గణ్యమైందనడం ఒక పవిత్ర కథా సందర్భ రస స్పందన!


 


15 వ శతాబ్దికే చెందిన ప్రగ్గడపల్లి పోతయ్య "గోదావరి" మకుటంతో ఒక శతకమే వ్రాసినట్ట్లు కవి చరిత్రకారుల వలన తెలుస్తున్నా ఆ శతక పద్యం ఒకటే ప్రసిద్ధికి వచ్చింది.. ప్రగ్గడపల్లి " .. సురుచిరక్షోణీ పురంధ్రీ యశోధర ధమ్మిల్ల లతాంత మాలికో,  భతన్వీకుచశ్రీ, హరసువ్యాసమొనాగునీదగు ప్రవాహంబొప్పు గోదావరీ ! " అనే తన పద్యంలో భూమికి గోదావరి ఒక దండగాను, ఆ భూమికి కునంపదకు విస్తృతమైన సొగసుగాను ఉగ్గడించాడు. "హంసనింశతి" లో అయ్యలరాజు నారాయణామాత్యుడు నదులు జలపాతాలపై ఏకంగా ఇరవై నాలుగు పాదాల సీసమాలికను వ్రాశాడు. అందులో "గౌతమి" ని పేర్కొన్నాడు. టేకుమళ్ళ రంగశాయి కవి  తన "వాణీ విలాస వనమాలిక " గ్రంధంలో గౌతముడు, గోవుల కథను ప్రస్తావిస్తూ నాశిహిత్ర్యంబకునుండీ అంతర్వేది వరకూ ఉండే గోదావరిని దేవతలు, మునులు ప్రస్తుతిస్తూంటారన్నాడు.


 


ఒకానొక కాలంలో తెలుగులో నోబెల్ బహుమానం వస్తుందని ఆశించబడిన గ్రంధం భక్త చింతామణి. ఒకానొక కాలం నాటి సాహిత్యవేదికలు భక్త చింతామణి పద్యాలతో పులకరించిపోయాయి.  ఆ గ్రంధకర్త, వేణీసంహార ఆ నాటక ఆంధ్రీకరణకర్త వడ్డాది సుబ్బారాయుడు భక్త చింతామణి మకుటంతోనే 1932 లో ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికలో అంగీరస గౌతమీ పుష్కరం శీర్శికతో వ్రాసిన పద్యాల్లో చరిత్ర నిక్షిప్తం చేశారు.


 


"భువన క్షేమ విధాయి పుష్కర జనంబుల్ వేనవేల్ గౌతమీ.


సవనంబాదిగ రాణ్మహేంద్రనగరిన్ సర్వాశలందుండి తీ


ర్తవిధుల్ సల్పి కొనంగ మూగెదరు : చోరవ్యాధి బాధాది వి


ప్లవ మాంగీరస నొందనీకు ప్రజ దేవా భక్త చింతామణీ "


 


అనడంలో  యాత్రికులకు దొంగలబాధలు వంటివి లేకుండా చూడవలసిందిగా భగవంతుణ్ణి ప్రార్ధించారు. పుష్కర దినాల్లో విమానాల్లో విహరించే జనం దేవతల్లా ఉన్నారని అందులోని వేరే పద్యాల్లో అంటారు. అంగీరస పుష్కరంలో బండ్లకు నిండ్లకు బాడుగ తగ్గెనని వ్రాశారు. అది విశేషమే. గోదావరి ప్రాంతాంలో నూతులలో నీళ్ళు, గోదావరి బాగా వచ్చేటప్పటికి పైకి వస్తుండడం వుంది. వసురాయకవి అందుకే దానిని ఎలా పోల్చాడో!


"తల్లియొఱదాక నూతులు


కల్లోలవతీమ తల్లి గౌతమి రాకన్ "


గోదావరిలో లాంచీ ప్రయాణాన్ని"గౌతమీ ధూమ నౌక విహారం" అని వ్రాసిన రోజులు చిత్రమైనవి!  వసురాయకవి గోదావరి సంబంధంకంగా జలమాహత్మ్యంపైన వేరుగానూ ఎన్నో వ్రాసారు. స్థానిక ముద్ర రచనలపై ఎక్కువగా ఉంటుంది.


 


 


 


 

Thursday, November 1, 2007

టైమ్ మెషిన్....

time_machine.jpg

ఈ కథ మొత్తం చదివి చివరలో అడిగిన ప్రశ్నకు జవాబివ్వగలరేమో ప్రయత్నించండి….

1975 జనవరి 1

ఉదయం ఐదు గంటలైంది. ఇంకా సూర్యుడు నిద్ర లేవలేదు. చీకటిగానే ఉంది.అది బాపూ అనాథాశ్రమం. దాని నిర్వాహకుడు ప్రకాశం అప్పుడే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆ అనాథాశ్రమాన్ని ప్రారంభించి చాలా ఏళ్ళయింది. దానికి ప్రకాశమే వ్యవస్థాపక నిర్వాహకుడు. ఇంతలో బయటనుండి కలకలం వినిపించింది. ప్రకాశం ఏంటా అని బయటకెళ్ళి చూసాడు.

అనాథాశ్రమం మెట్లపైన చీరలో చుట్టిన ఒక పసిపాప. ఆడపిల్ల. అంతటి చలిలో రోజుల పాపను అలా వదిలేసి వెళ్ళిన వాళ్ళపై ప్రకాశంకు చాలా కోపం వచ్చింది. ముద్దులొలికే ఆ పసిపాపను తానే పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు.

17 ఏళ్ళ తరవాత..

ఆ పసిపాప (పద్మ) పెరిగి పెద్దదై ఇప్పుడు హాస్టల్లో ఉండి చదువుకుంటోంది. పద్మ వాళ్ళ క్లాస్‍మేట్ ఒకతనిని ప్రేమించింది. ఇద్దరొకటై గర్భవతైంది. అది తెలిసి హాస్టల్ నుండి గెంటేసారు. ప్రకాశం అది తెలుసుకుని వచ్చి పద్మను తిరిగి అనాథాశ్రమానికి తీసికెళ్తాడు. ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది, కాని ఆ పాపను ఎవరో ఎత్తుకెళ్తారు. అది విని తట్టుకోలేక ప్రకాశం ఆత్మహత్య చేసుకుంటాడు.

ప్రసవ సమయంలో కలిగిన కొన్ని ఆరోగ్య సమస్యలవల్ల పద్మ డాక్టరును కలిసింది. అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఆ డాక్టరు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు: ఆమెకు Adrenalo Sytosis అని, ఇది ఒక సీరియస్ జబ్బు .. దీనివల్ల శరీరంలో హార్మోనుల అవకతవకలు జరుగుతాయి. ఆపరేషన్ చేయాలి అని. కొద్ది రోజుల తర్వాత పద్మకు ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్ ఫలితంగా ఆమె మగవాడిగా (ప్రభు) మారిపోయింది.

ప్రభు చాలా బాధపడుతూ ఉండేవాడు, తన కన్నబిడ్డను పోగొట్టుకున్నందుకు, తనను పెంచిన ప్రకాశంగారు చనిపోయినందుకు, తన ప్రేమికుడు మోసగించినందుకు, మగవాడిగా మారవలసి వచ్చినందుకు… ఇది తలుచుకుంటూ తాగుడుకు అలవాటు పడ్డాడు.

ఒకరోజు ప్రభు తమ కాలనీలో ఒక కొత్త బార్ తెరవడం చూసాడు. దాని పేరు “అమృతా బార్”. లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద మనిషి కనపడ్డాడు. ఆ వ్యక్తి ప్రభును పిలిచి తాను కనుగొన్న “టైం మెషీన్” చూపించాడు. ప్రభు ఆ వ్యక్తిని బ్రతిమిలాడి అది ఇంటికి తెచ్చుకుని తాను గతం లోకి వెళ్ళాడు. 1992 సంవత్సరంలోకి….

1992 సంవత్సరం…

ప్రభు తన టైం మెషీన్తో పాటు 1992 సంవత్సరంలోకి అడుగెడతాడు. అక్కడ ఒక అందమైన అమ్మాయిని చూస్తాడు( అదే మగవాడిగా మారక ముందు ఉన్న అమ్మాయి). ఆమెని ప్రేమించి, కలిసి తిరిగి, ఒకానొక గడియలో ఒకటవుతారు. ఆ అమ్మాయి గర్భవతైంది. ప్రభు ఆమెను పెళ్ళాడటానికి నిరాకరించి, ఆ ఊరినే వదిలి వెళ్ళి పోతాడు. అలా ఇంకో ఊరికెళ్ళి కొంత డబ్బు సంపాదించి తిరిగి తను ప్రేమించిన అమ్మాయి ఉన్న ఊరికొస్తాడు.

కాని తనను గుర్తుపట్టకుండా ఉండాలని బారెడు గడ్డం పెంచుకుంటాడు.ఒక బార్ మొదలెడతాడు. “అమృతా బార్ “అని. ఒక రోజు అతను బార్లో కూర్చుని ఉండగా ఒక వ్యక్తి వస్తాడు( అదే వ్యక్తి ఇంతకు ముందు అమ్మాయిగా ఉన్నవాడు). గడ్డపు వ్యక్తి తన దగ్గరున్న టైమ్ మెషిన్ను ఆ వ్యక్తికి ఇస్తాడు. ఆ వ్యక్తి దాని సాయంతో గతంలోకి వెళ్ళిపోతాడు. ఇంతలో ఒక ముసుగు దొంగ వచ్చి కత్తి చూపించి ఆ టైమ్ మెషిన్ తన దగ్గర్నుంచి లాక్కుని ఆ గడ్డపు వ్యక్తిని తీసుకుని గతంలోకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళాక ఆ ముసుగు దొంగ ఆ మెషిన్ తిరిగిచ్చేసి గడ్డపు వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోతాడు.

గడ్డపు వ్యక్తి అలా అలా తిరుగుతూ బాపూ అనాథాశ్రమానికి వస్తాడు. లోపలికెళ్ళి చూస్తే అక్కడొక అమ్మాయి (తర్వాత అబ్బాయిగా మారిన అమ్మాయే), పక్కన అప్పుడే పుట్టిన ఆడపిల్లను చూస్తాడు. ఆ పసిగుడ్డును తీసుకుని టైమ్ మెషిన్ మొదలెట్టి ఆ పాపతో సహా గతం (1975) లోకి వెళతాడు.

1975 జనవరి 1

ఉదయం సుమారు నాలుగున్నర అయింది. గడ్డపు వ్యక్తి ఆడపిల్లతో బాపూ అనాథాశ్రమానికి వస్తాడు. ఆ పాపను ఆశ్రమ గుమ్మంలో వదిలి వెళ్ళిపోతాడు. కాలేజీలో చేరి బాగా కష్టపడి చదివి డాక్టరవుతాడు. ఒక రోజు ఒక స్త్రీ అతని ఆసుపత్రికి వస్తుంది. ఆమెను పరీక్షించి, ఆమెకు Adrenalo Sytosis అనే ప్రమాదకరమైన జబ్బు ఉన్నట్టు కనుగొని ఆపరేషన్ చేసి ఆ స్త్రీని మగవాడుగా మారుస్తాడు. ఆ తర్వాత టైమ్ మెషిన్ సహాయంతో గతంలోకి వెళతాడు. ఆప్పుడు అతను జనాలు పడుతున్న కష్టాలు చూసి మనసు ద్రవించి ఒక అనాథాశ్రమాన్ని ప్రారంభిస్తాడు. దానికి బాపూ అనాథాశ్రమం అనే పేరు పెట్టి అనాథ పిల్లలకు ఆసరా ఇస్తాడు.

ఒక రోజు అతని ఆశ్రమం ముందు ఎవరో ఒక పసికందును వదిలి వెళతారు. అతను ఆ బిడ్డను తన కన్న బిడ్డలా పెంచి పెద్ద చేస్తాడు. ఆ పాప పెరిగి పెద్దదై చదువుకుంటూ ఒక హాస్టల్లో ఉంటుంది. ఒకరోజు అతనికి ఒక విషయం తెలుస్తుంది: ఆ ఆడపిల్ల ఒక వ్యక్తి వల్ల మోసపోయి గర్భవతైందని, హాస్టల్ వాళ్ళు గెంటేసారని. జాలితో ఆ అమ్మాయిని తమ ఆశ్రమానికి తీసుకొస్తాడు. ఆ అమ్మాయి ఒక ఆడపిల్లని కంటుంది.

ఆ వ్యక్తి…అదే ప్రకాశం భవిష్యత్తులోకి వెళ్ళాలని అనుకుంటాడు. ముసుగు ధరించి, ఒక తుపాకి తీసుకుని టైమ్ మెషిన్ తీసుకుని అమృతా బార్ కి వెళతాడు. బార్ లోపలికి వెళ్ళి ఆ గడ్డపు వ్యక్తిని బెదిరించి తనతో పాటూ గతంలోకి తీసికెళ్తాడు. కాని గతంలోకి వెళ్ళాక పశ్చాత్తాప పడి ఆ గడ్డపు వ్యక్తికి టైమ్ మెషిన్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అలా తిరిగి మళ్ళీ తన ఆశ్రమానికి వచ్చాక తెలిసిందేమంటే పుట్టిన పసిబిడ్డను ఎవరో ఎత్తుకెళ్ళారని. అది విని తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకుంటాడు.

ఇంతకూ ఆ పసిబిడ్డను ఎత్తుకెళ్ళింది ఎవరూ????

తొలి ప్రచురణ పొద్దులో..

Sunday, October 28, 2007

వామ్మో!! ఏం దోపిడి!!!

నాకు రెండు నెలల క్రిందట హిందూ పేపర్లో వంటలపోటీలో  బహుమతి వచ్చిందిగా వెయ్యి రూపాయలది. అది తెచ్చుకుందామని 24 Letter Mantra ఆర్గానిక్ షాపుకి వెళ్ళాను మా అమ్మాయితో కలిసి. పెద్ద సూపర్ మార్కెట్. అందులో పనిచేసేవాళ్ళు తప్ప ఎవరూ లేరు. సరే ఎమేమున్నాయో చూసుకుంటూ వెళితే. నా గుండె లయ పెరిగిపోయింది. అలా ఉన్నాయి ధరలు. మనం వాడే ప్రతి సరుకు అర్గానిక్ అని పేరు పెట్టి నాలుగింతల ధర.అమ్మబాబోయ్!! ఇదేం దోపిడిరా అని ఇప్పటికీ అనుకుంటూనే ఉన్నాను. ఎలాగూ మనది ఉచిత కొనుగోలు కదా అని ధైర్యం చేసాం. వెయ్యి రూపాయలు చాలా సరుకులు తీసుకోవాలని కొన్ని తీసుకుంటే అవే 1500 అయ్యాయి. మొత్తం కలిపి పదిహేను ఐటమ్స్ లేవు. సరే అని కొన్ని తీసేసి బిల్లు వెయ్యికి దించేసి చిన్న క్యారీ బాగులో తెచ్చుకున్నాం ఆ సరుకులు. పట్టుమని పది వస్తువులు లేవు.

ఇలా ఎక్కువ ధరలు పెట్టడమెందుకో, అలా ఖాళీగా కూర్చోడమెందుకో. కనీసం అద్దె, జీతాలైనా మిగులుతాయో లేదో నా అనుమానం. ఈ ఆర్గానిక్ ఆహారం ఏమిటో అని ఇంటికొచ్చి పుస్తకాలు వెతికితే తెలిసింది. ఎరువులు, రసాయనాలు లేకుండా స్వచ్చంగా పండీంచినవి అని. అసలు వాతావరణం కాలుష్యం, మనుష్యుల  మనసులే కాలుష్యం ఆవరించి ఉంటే ఈ స్వచ్చమైన ఆహారాన్ని నాలుగింతల ధరలు పెట్టి తమని తాము రక్షించుకుందామనుకుంటున్నారా ఇవి తినే పెద్దమనుషులు.

కొన్ని ధరలు చూడండి. మనం ఇంటి దగ్గర దుకాణంలోగాని, సూపర్ మార్కెట్‌లో గాని దీని ధరలు ఎలా ఉన్నాయి,తేడా చూడండీ.  

దాల్చిన కప్ కేకులు - 5  -    65 - 00
హెర్బల్ సబ్బు         75 gm  - 55 - 00
నల్ల కారం పొడి        100gm   - 30 - 00
బాదాం                  100gm  - 84 - 00
మిక్స్‌డ్ ఫ్రూట్ జాం     200gm  - 119 - 00
జీడిపప్పు                100gm  - 110 - 00 
అల్లం వెల్లుల్లి            200gm  - 44 - 00
పిస్తా                      100gm  - 89 - 00                  

Saturday, October 27, 2007

తెలుగులో కామిక్స్



 ఇది కిడ్స్ ఖుషి వారి అనుమతితో నా బ్లాగులో పెడుతున్న. ఇది వారి

మొదటి ప్రయత్నం కాబట్టి తప్పులున్నాయి. చెప్పాను వారికి. సరైన

అనువాదకుడు లేక ఇలా జరిగింది అన్నారు. కాని వారి ప్రయత్నాన్ని

అభినందించాలి. వారి వెబ్‌సైట్‌నుండి డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు.

khushi-bear012.gifkhushi-bear023.gif

khushi-bear031.gif

khushi-bear051.gif 

khushi-bear041.gif

61.gif

Tuesday, October 16, 2007

పేద్ద తప్పు!!!!!!!!!

ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్ లోని బ్రౌజర్లో airtel అని టైప్ చేసి  Ctrl+Enter నొక్కండి. చూడండి తమాషా..

పేద్ద తప్పు!!!!!!!!!

ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్ లోని బ్రౌజర్లో airtel అని టైప్ చేసి  Ctrl+Enter నొక్కండి. చూడండి తమాషా..

Monday, October 15, 2007

వివాహ మహోత్సవ శుభాకాంక్షలు....

anniversary-cake.jpg                                       

కందర్ప కృష్ణమోహన్ దంపతులకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు..

Sunday, October 14, 2007

తద్దినం - అవసరమా???

 

అందరికీ తెలిసిన విషయమే. చనిపోయిన పెద్దలకు మర్చిపోకుండా తద్దినం పెట్టాలి అని పెడుతున్నాం కూడా. కాని ఈ విషయంలో నాకు ఎన్నో సందేహాలు. చనిపోయినవారి స్మ్త్యత్యర్ధం అలా చేయడం మంచిదే. కాని మనం అది సక్రమంగా నిర్వహిస్తున్నామా. ప్రతి సంవత్సరం తద్దినం పెట్టకుంటే ఏమవుతుంది. ఎంతమంది మనస్పూర్తిగా చేస్తున్నారు. నిజంగా మన పెద్దలు సంతోషిస్తున్నారా? మేము చనిపోయాక కూడా మా పిల్లలు మమ్మల్ని గుర్తుంచుకున్నారు అని.


 


తద్దినం అంటే ఏమిటి? ఎందుకు చేయాలి?చేయకపోతే ఏమవుతుంది??


 


నేను గమనించినదేమంటే పెద్దవాళ్ళ తద్దినం రోజు చనిపోయినవారి ఫోటో తుడిచి(అదీ ఏడాదికొక్కసారే) పూలదండ వేసి బొట్టు పెట్టి, నైవేద్యం పెట్టి, మిగతావాళ్ళూ  తినడం, తాగడం. ఇదేనా వారి ఆత్మశాంతి. చనిపోయినవారి పేరు చెప్పుకుని మనం సుష్టిగా తినడం, తాగడం. రోజు వండుకోకపోయినా ఆ రోజు మాత్రం మాంసాహారం(తినేవాళ్ళు) , పూరీలు, గారెలు, చేయాల్సిందే. లేకుంటే చుట్టాలు విసుక్కుంటారు. ఏం తిండి పెట్టారు అని. మందు కూడా తప్పనిసరి. అసలు అది ఒక పార్టీలా చేసుకుంటారు. .ఇక ఒకరికంటే ఎక్కువ కొడుకులుంటే సంవత్సరానికొక్కడు ఈ తద్దినం తనింట్లో పెడతానని వంతులు వేసుకుంటారు. ఇంట్లో కోడళ్ళు ఉంటే మీ అత్తమామకి మీరు చేసుకోండి మేమెందుకు చేయాలి పని అంటారు. మరి వాళ్ళ మొగుళ్ళు ఎక్కడినుండి ఊడిపడ్డారో (తాత, బామ్మలు లేకుండా).. ఇది ఒక బలవంతపు తంతులా చేసుకుంటారు.. ఆర్ధిక ఇబ్బంది ఉన్నా చేయక తప్పదు అన్ని రకాల వంటకాలు. ఇదంతా ఎవరి కోసం.ఎవరి పేరు చెప్పి ఎవరు తింటున్నారు. ఇది సమంజసమేనా??


 


ఐనా ఆ పెద్దలు కాని, ఏ దేవుడు కాని చెప్పాడా నాయనల్లారా! నేను పోయాక ఇలా చేయండి అని. అలా చేస్తే నేను సంతోషిస్తాను అని (బ్రతికున్నపుడు ఏం చూసుకున్నారో ఆ తల్లితండ్రులని ఈ పుత్ర రత్నాలు). చనిపోయాక చచ్చినరోజని తద్దినం పెడతారుగా మరి బ్రతికున్నపుడు ఆ మనిషి పుట్టినరోజు చేసారా. కనీసం వారికి పాదాభివందనం చేసి అభినందనలు చెప్పారా ఎవరైనా?? మరి మనిషి బ్రతికున్నాడన్న నిదర్శనానికి పుట్టినరోజు చేయనివాళ్ళు, ఆ మనిషి చనిపోయాక చచ్చినరోజు అని తద్దినం పెట్టి ఈ తినడాలు, తాగడాలు ఏంటో???

Friday, September 14, 2007

HAPPY BIRTHDAY JYOTHI

                            7.jpg

రోజుకి నేను బ్లాగు మొదలుపెట్టి సరిగ్గా సంవత్సరమవుతుంది. నా బ్లాగ్ప్రయాణంలో అన్నీ శుభాలు, విజయాలే దక్కాయి నాకు. అది జరగడానికి నాకు సహకరించి, ప్రోత్సహించిన అందరు బ్లాగర్లకు హృదయపూర్వక ధన్యవాదములు.


 


ఊరికే టైంపాసుకు నెట్‌కొచ్చిన నాకు దొరికిన అమూల్యమైన వరం తెలుగు బ్లాగు గ్రూపు. మొదట్లో సరదాగా గడిచిపోయింది గుంపులో కాని అందరు కలిసి నన్ను బ్లాగు మొదలెట్టించారు. బ్లాగు మొదలెట్టిన సమయంలో అంతా అయోమయంగా ఉండేది. అస్సలేమీ తెలీదు. ఎలా చేయాలో తెలీదు. ఊరికే టైప్ చెయ్యడం మాత్రం వచ్చేది. కాని నేనడిగిన సందేహలన్నింటికి  గుంపులో ఓపిగ్గా సమాధానమిచ్చేవారు ఎవరో ఒకరు.


 


గత సంవత్సరం అందరి ఆడాళ్ళలాగే  ఇంటిపని కాగానే నిద్రపోవడం, టీవీలో వచ్చే చెత్త సీరియళ్ళన్నీ చూడడం( అప్పుడవి మహాద్భుతాలు) వాటిగురించే చర్చించడం, మరునాటి కోసం ఎదురుచూడ్డం చేసేదాన్ని. వేరే వినోదం అంటూ లేదు మరి. ఐనా నాలో ఎదో అసంతృప్తి. నాకు నచ్చిన పాటలు, వంటలు, జోకులు, కథలు,పురాణగాథలు. వీటన్నింటి గురించి మాట్లాడుకోటానికి స్నేహితులు లేరు.నాలో నేనే అనుకోవడం. మొదటినుండి తెలుగు అంటే ప్రాణం. పుస్తకాలంటే మరీను. మరి ఏదైనా విషయం గురించి చర్చించాలి, సందేహం తీర్చుకోవాలి అంటే ఎవరూ లేరు. అందుకే గూగుల్‌లో కనపడ్డ తెలుగు గుంపులన్నీ చేరిపోయా. అప్పటికి గ్రూపులంటే తెలీదు. తర్వాత ఒక్కటొక్కటిగా తెలుసుకుని బ్లాగు గుంపులో స్థిరపడిపోయా. సమయంలో నన్ను అడుగడుగునా ప్రోత్సహించిన వీవెన్, చావాకిరణ్, సుధాకర్, శిరీష్‌గారు, సిబిరావుగారు, రమణ, త్రివిక్రం, ప్రసాద్, రవి వైజాసత్య అందరికీ ఎంతోణపడి ఉన్నాను. బ్లాగుల మూలంగానే నాకే తెలియకుండా నాలో దాగి ఉన్న అభిరుచులన్నీ బయటపడ్డాయి. నాకు ఇష్టమైనవన్నీ బ్లాగుల రూపంలో భద్రపరుచుకుంటున్నాను. ఇప్పుడు ఎంతో తృప్తిగా ఉంది. ఎలాంటి అశాంతి అసహనం లేదు.నాకిష్టమైన వంటలు, సరదా కథలు,జోకులు,పాటలు అన్నీ తెలుగులో రాయగలుగుతున్నాను, నాలా ఆలోచించే, అర్ధం చేసుకోగలిగే మిత్రులతో పంచుకోగలుగుతున్నాను అని. బ్లాగుల వల్ల నా ఆలోచన, అవగాహనా శక్తి పెరిగింది.నిజం. ఎప్పుడైనా  ఏ విషయమైనా నచ్చిందైనా , నచ్చనిదైనా, నా స్వంత విషయమైనా వెంటనే బ్లాగులో రాసుకుని అందరితో పంచుకోవడం అలవాటైపోయింది. అందరూ కుటుంబ సభ్యులు, పాత మిత్రులలా అనిపిస్తుంది. ఈ ప్రయాణంలో నేను ఎవ్వరితోను పోటీ అనుకోలేదు. నాకు నేనే పోటీ పెట్టుకుని రాసుకుంటూ పోయా. మొదటినుండి నాదో అలవాటు మంచిదో కాదో తెలీదు. నాకు తెలిసింది పదిమందికి చెప్పడం, తెలీంది పదిమందిని అడగడం. అదే పాటిస్తూ వస్తున్నా ..


 


ఇన్నేళ్ళుగా మావారు, పిల్లలకిష్టమైనవి చేయడమే నా బాధ్యత, కర్తవ్యం అంటూ బ్రతికేసాను. నాకంటూ ఇష్టాలు ఏమున్నాయి అని ఆలోచించలేదు. ఫలానా ఆయన భార్య, ఫలానా ఆయన కూతురు అని మాత్రమే నాకు గుర్తింపు ఉండేది. నాకంటు ఒక గుర్తింపు ఉంటుంది, ఉండాలని ఎప్పుడు ఆలోచించలేదు. కాని బ్లాగులలో రాసుకుంటూ పోతుంటే మీ అందరి ప్రోత్సాహం, అభినందనలు,గౌరవం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది.నేను కూడా ఎదో చేయగలను, సాధించగలను అనుకుంటూ మరింత ఉత్సాహంతో సాగిపోయాను. ప్రయాణంలో ఎక్కడా అపశృతులు కలుగలేదు.ఇప్పుడు నేను మా ఇంట్లోవాళ్ళకి , మా పుట్టింట్లో గర్వంగా చెప్పుకుంటాను ఇంటర్‌నెట్‌లో దేశవిదేశాల్లో నాకెంత పేరుందో తెలుసా అని.. ఇది నేను ఇంట్లోనే ఉండి చేయగలిగాను అని. అందరూ ఊరికే అనేవారు మరి ఎప్పుడూ  కంప్యూటర్లో ఏం చేస్తుంటావు అని.  నేను ఎన్ని బ్లాగులు రాసినా అది నా కుటుంబ బాధ్యతల తర్వాతే తీరిక సమయాలలో చేస్తున్నాను.  టీవీ అంటే చిరాగ్గా ఉందిప్పుడు. బయటికెళ్ళిగాని, ఫోన్లోగానీ సొల్లు కబుర్లు బంద్. తెలిసినవాళ్ళందరు అడుగుతుంటారు ఏంటిది అస్సలు కనపడటంలేదు, మాట్లాడటంలేదు. ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు అని.నవ్వి ఊరుకుంటాను. నేను చేసే పని చెప్పినా వేస్ట్ కాబట్టి. వాళ్ళకి అర్ధం కాదు.


 


ఏడాది ప్రయాణంలో నాకు ఎప్పుడు అలసటకాని, కష్టం కాని అనిపించలేదు. ఎందుకంటే నాకిష్టమైన తెలుగులో పని కదా.ఇష్టమైతే ఎదీ కష్టం కాదు. ఏడాది కాలంలో తెలిసి ఎవ్వరినీ నొప్పించలేదు. తెలియక నొప్పించితే క్షమించండి.మీకు తెలుసుగా నేను ఎప్పుడు సరదాగానే ఉంటాను అని.


 


ఇవి నా ప్రయాణంలో అంచెలంచలుగా నా ఎదుగుదల.


 


మొదటి నెలలో రెండో బ్లాగు - షడ్రుచులు


మూడు నెలలలో - షడ్రుచులలో 100 టపాలు, మూడో  బ్లాగు గీతలహరి


ఆరునెలలో - 500 టపాలు , 4  బ్లాగులు


తొమ్మిది నెలలలో -1000 టపాలు , 5 బ్లాగులు


సంవత్సరానికి - తెలుగు వెలుగులు వ్యాసం. 


 


ఇంకా ఏమన్నా ఉందా నేను చేయగలిగేది. లేదనుకుంటా. కాని ఇంకా ఎంతో సాధించాల్సింది ముందుంది అనిపిస్తుంది. ఆపై దేవుడి దయ.  నాకు ఒక్కటే లోటుగా ఉంది. తెవికీలో రాయడానికి సమయం చిక్కడంలేదు.


 


ఒక కొత్త శీర్షిక : నా స్నేహితురాలు స్వరూప చెప్పే ముచ్చట్లు అప్పుడప్పుడు రాస్తుంటాను. అది తెలంగాణ శకుంతల టైపు. పాతబస్తీలో ఉంటుంది.


 


సంవత్సరంగా నాకు నచ్చిన నా ఆలోచనలు, భావాలు, చర్చలు .... 




అదేంటో గాని.


వారెవ్వా క్యా సినిమా హై


అనుబంధం


ఆడపిల్ల


అదే మరి మండుద్ది


500


ఒక భార్య మనోవేదన


ఆడవాళ్ళలో జీనియస్సులు ఎందుకు లేరు


పెళ్ళిచూపుల ప్రహసనం


పడ్డానండి ప్రేమలో మరి


నమస్తే అన్నా


శతమానం  భవతి


మృదులాంత్ర నిపుణుడి మనోభావాలు


 


ఏడాది క్రితం నేను ఏమి తెలీదు అంటూ గుంపులో కొచ్చా. కాని ఇప్పుడు అందరికంటే నేనే గొప్ప. నాకున్న బిరుదు, గౌరవం ఎవరికన్నా ఉందాఅదేంటాజ్యోతక్క.. అనే పేరు.  మరి అన్నా అని ఎవరన్నా పిలిపించుకున్నారా? విహారి ఏమంటావ్? నువ్వేనా మరి.


 


 


ఇప్పటికే కోతలు ఎక్కువయ్యాయి గాని….ఉంటా మరి..





Monday, September 3, 2007

జన్మదిన శుభాకాంక్షలు చేతన్...

   chetan.jpg                 8.jpg

HAPPY BIRTHDAY TO KRISHNACHAITANYA..

ఈరోజు మా అబ్బాయి కృష్ణచైతన్య పుట్టినరోజు. నీ బ్లాగులో అందరికీ

విషెస్ చెప్తావ్. నాకు చెప్పవా అంటే ఇలా చెప్తున్నా. మీ అందరి

ఆశీర్వాదాలు ఇవ్వండి.నెల క్రిందే విప్రోలో ఉద్యోగంలో చేరాడు వాడు.

ఆ కృష్ణుడిలాగే  మావాడు అల్లరి ఎక్కువే చిన్నప్పటి నుండి...

Sunday, September 2, 2007

యధార్ధ గాధ...

ఒక యధార్ధ గాధ. చెప్పనా..

నాకు తెలిసిన ఒక మంచి వ్యక్తి జీవితంలోని యధార్ధ గాధను మీకు

చెప్పాలనుకుంటున్నాను. అతను ఎదుర్కొన్న సమస్యలలో కొన్ని

మనకూ ఎదురై ఉండవచ్చు. కాని మృతువు అంచుల దాకా వెళ్ళి

తిరిగి వచ్చి తన ధృడ సంకల్పముతో అనారోగ్యముతో పోరాడుతూనే

అతి పిన్న వయసులోనే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని,

ఆంధ్రదేశంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొంది

గౌరవింపబడుతున్న వ్యక్తి జీవిత సత్యమిది.

ముందుగా అతను తన కథను చెప్పలేదు. కాని మాటల సంధర్భములో బలవంతం పెడితే నాకు చెప్పిన కథను నా బ్లాగులో రాయలనుకుంటున్నాను.ఏమంటారు. ఇది అతనికి సానుభూతి నివ్వాలని కాదు. అతని కథను చదివితే ఒక స్పూర్థి, ప్రేరణ  కలుగుతుందని.

ఏమంటారు???

Saturday, September 1, 2007

అందరికీ ధన్యవాదములు...

                  namaste1.jpg

నేను మొదటి సారి రాసిన వ్యాసం అందరికీ నచ్చినందుకు , నన్ను అభినందించినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు.

నేను వెయ్యి టపాలు పూర్తి చేసి విక్షనరీ, తెవికీ పనులు చేసుకుందాము హాయిగా అనుకుని బ్రేక్ తీసుకున్నా. కాని అనుకోకుండా నల్లమోతు శ్రీధర్ గారు మన బ్లాగు గుంపులోకి రావడం,ఆయనని బ్లాగు మొదలెట్టమనడం జరిగింది. మామూలుగా నేను వికీ పని చేసుకుంటూ ఉండగా, ఒక రోజు శ్రీధర్ గారు ఏమనుకున్నారో ఏమో తను రాయాలనుకున్న బ్లాగుల గురించి వ్యాసం నన్ను రాయండి అని అడిగారు. ముందు నేను షాక్ అయ్యా. వీవెన్,త్రివిక్రం,నాగరాజుగారు, ప్రసాద్‌ని అడిగా ఇది సంగతి ఏం చేయను అని. వాళ్ళకు నామీద నాకంటే ఎక్కువ నమ్మకముంది. మీరు చేయగలరు ..మొదలెట్టండి అన్నారు. సరే. కంప్యూటర్ ఎరా పత్రిక చదివేది అందరూ కంప్యూటర్ ఉన్నవాళ్ళే, తెలుగు వచ్చినవాళ్ళే. మన బ్లాగులు, వికీ గురించి తెలియాలంటే, రాయలంటే తప్పనిసరిగా కంప్యూటర్ ఉండాల్సిందే. ఇది మంచి అవకాశం వదలకూడదు అని నిర్ణయించుకుని కొందరు బ్లాగర్లు ఇచ్చిన లింకులను సేకరించడం మొదలెట్టా.

అన్ని లింకులనుండి సమాచారాన్ని ముందుగా ప్రింట్ చేసి పెట్టుకున్నా. అస్తమానం కంప్యూటర్ ముందు కూర్చోడం కుదరదుగా. ఇంట్లో మావారికి కూడా చెప్పలేదు. ప్రింట్ చేసిన పేపర్లు చూసి మావారు అడిగారు ఏంటిది నా పేపర్లన్నీ ఖాళీ చేస్తున్నావ్,ప్రింటర్ ఇంక్ అంత తొందరగా ఐపోతుంది ఎన్ని సార్లు నింపనూ అని. ఒక ఆర్టికల్ రాస్తున్నా అని చెప్పాగాని కంప్యూటర్ ఎరా అని చెప్పలా. ఎందుకంటే గత మూడు సంవత్సరాలుగా మావారు ఆ పత్రిక కొంటున్నారు. సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా. ఎలాగైతేనేమి అనుకున్న సమయానికి వ్యాసం రాసి శ్రీధర్ గారికి అందివ్వగలిగాను. ఆయన చిత్రాలు పెట్టి కష్టపడి కవర్ పేజీ తయారు చేసారు.

నిజంగానే ఇది ఒక యజ్ఞం లా అనుకుని చేసాను. ఎందుకంటే బ్లాగుల గురించి, వికీ గురించి ఇంత వివరంగా చెప్పే అవకాశం వచ్చినందుకు, నా శాయశక్తులా ప్రయత్నించి అన్ని వివరాలు ఇవ్వగలిగా. దీనికి  వీవెన్,కిరణ్ , త్రివిక్రమ్,శిరీష్ గారు,రమణ,నవీన్ ఎంతో సాయపడ్డారు. వారి సాయం లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు.నేను అనుకున్నది, వీళ్ళందరికి చెప్పింది ఇది నా అర్టికల్ కాదు మనందరిది అని.

ఈ వ్యాసం రాసేటప్పుడు నేను రోజూ దేవుడిని ఇదే కోరుకున్నా. ఇది పూర్తి అయ్యేవరకు నాకు మానసికంగా కాని, శారీరకంగా కాని ఎటువంటి సమస్యలు రావద్దని, ఎలాంటి అడ్డంకులు రాకుండా పూర్తి చేయాలని. అది జరిగింది చాలు ఎంతో సంతృప్తిగా ఉంది. నేను ఇదంతా చెప్పింది నా గొప్పలు చెప్పాలని కాదు.నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకున్నానిలా అని అంతే.

ఈ వ్యాస రచనలో  నాకు అనుక్షణం సహకరించిన గురువుగారు వీవెన్ కు శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. చాలా సతాయించాలెండి. థాంక్యూ వీవెన్. 

నా ఈ విజయాన్ని మావారికి, పిల్లలకు మా వివాహ రజతోత్సవ కానుకగా ఇచ్చా. పత్రికాఫీసునుండి కాంప్లిమెంటరు కాపీ వచ్చేవరకు మావారికి తెలీదు. పత్రిక చూసి ఏంటిది ,ఎందుకొచ్చింది అని అడిగారు. చదివాకా నవ్వుతూ గుడ్ బావుంది అన్నారు.మనసులో కాస్త గర్వంగా ఫీల్ అయ్యారు . కాని  బయటపడలేదు. నాకు తెలీదేంటి.పిల్లలేమో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకుంటున్నారు. 

ముచ్చట్లు ఎక్కువయ్యాయి కాని ఇక మామూలుగా నా బ్లాగులు రాసుకుంటాను. త్వరలో ఒక చురకలాంటి టపా రాయబోతున్నా మరి.

Monday, August 27, 2007

శ్రావణ పూర్ణిమ శుభాకాంక్షలు...

jyo1.jpg

 బ్లాగ్సోదరులందరికీ జ్యోతక్క రాఖీ శుభాకాంక్షలు.........

jyoth.jpg

Tuesday, August 21, 2007

యమదొంగ

                        yama.jpg

కొత్త సీసాలో పాత మందులా అలనాటి ఎన్.టి.ఆర్ సూపర్ డూపర్ హిట్ "యమగోల" సినిమా ఆధారంగా వచ్చిన జూ.ఎన్.టి.ఆర్ "యమదొంగ" హిట్ అంటున్నారు. చిక్కినా చక్కదనమే అన్నట్టు ఎన్.టి.ఆర్ ఇంకా గ్లామరస్‌గా కనిపిస్తున్నాడు. పాత కొత్త సుందరాంగులతో సయ్యాటలాడి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కొత్త సినిమా టాక్ అంటే కాలేజీ పిల్లలే చెప్పాలి. అందుకే మా పిల్లలను అడుగుతా ఎలా ఉంది అని. వాళ్ళు అన్నీ చూడకున్నా వాళ్ళ స్నేహితులనుండి తెలుస్తుంది సినిమా వచ్చిన రోజో మరునాడో. నీట్ కామెడీ, స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్, యమలోకం సెట్టింగ్స్, ముఖ్యంగా మోహన్‌బాబు డైలాగ్స్ అదుర్స్. యముడు, హీరో తగూలాటలు, మాటల యుద్ధాలు, యమలోకంలో హీరో చేసే అల్లరి అందరిని ఆకట్టుకుంటున్నాయి. మ్యూజిక్ కూడా ఓకే.హిట్ అంటున్నారు. సినిమా రాకముందే మా పిల్లలు నన్నడుగుతారు. ఇది హిట్టా ఫట్టా అని. సినిమా స్టోరీ, మ్యూజిక్ వినగానే చెప్పేస్తా. అది కరెక్ట్ అవుతుంది  కూడా. అలాగే యమదొంగ విషయంలో కూడా స్టోరి  బానే ఉంటుంది. కామెడి బాగుంటేనే హిట్ అవుతుందని చెప్పా. పాత హీరోయిన్ రంభ ఒక హిట్ పాటలో ఎన్.టి.ఆర్ తో పోటీ పడి నాట్యం చేసింది. తన వయసు ఎక్కువని అస్సలు తెలీలేదు. అందరూ హీరోయిన్లు ముద్దుగా ఉన్నారు.

ఇక సినిమా విషయానికొస్తే...

నటీనటులు:
జూ.ఎన్.టి.ఆర్, మోహన్‌బాబు, బ్రహ్మానందం, ప్రియమణి,మమతా మోహన్‌దాస్, ఆలీ,మొదలగువారు.
దర్శకుడు.. రాజమౌళి

హీరో ఒక ఆరితేరిన దొంగ. కోట్లకు వారసురాలైనా హీరోయిన్ (ప్రియమణి)ని ఆమె ఆస్థి కోసం ప్రేమిస్తాడు. కాని ఆమె  బంధువుల వల్ల జరిగిన ఘర్షణలో చనిపోతాడు. అక్కడినుండి యమలోకానికి వెళ్ళి నానా అల్లరి చేస్తాడు. అప్సరసలతో ఆటలు,పాటలు. ఇలా యముడు, హీరో దాగుడుమూతలు.. వెరసి సినిమా మంచి కామెడి ...
చూడడంలో ప్రమాదం ఎమీ లేదు. 

Wednesday, August 15, 2007

JANA GANA MANA

[youtube=http://www.youtube.com/watch?v=ftD3gDA-5S0]



The Jana Gana Mana - Indian National Anthem was a historic video released January 26, 2000 to mark the 50th year of the Indian Republic. It has the distinction of being released by the then President of India, in the Central Hall of the Indian Parliament. It was produced by Bharat Bala and Kanika Myer and published by Ministry of Culture, Youth Affairs and Sports, Government of India.

Bharat Bala and A. R. Rahman came together to create a historic album called 'Jana Gana Mana'. This was a project in which over 35 top artistes of the nation came together to sing or play the Indian National Anthem, "Jana Gana Mana". The project had started as "Desh Ka Salaam" which was telecast in Indian TV channels and on the web on August 15, 1999, in which several great Indian musicians, from the classical to the contemporary, came together to give a soulful and modern rendition of the National Anthem. The video was released on January 26, 2000.

The Making of the Video
Bharat Bala and Kanika had been working together on various projects such as Vande Mataram (1996, 1998) and Desh Ka Salaam (1999) when they realised that there was not a single popular rendering of the Indian National Anthem. They thus decided to re-create the National Anthem in a year 2000 version, something that should be 'inspiring for young people to listen to.'

Bharat Bala Productions roped in A R Rahman to produce the music and 60 artistes were taken to Ladakh in North India to film the video for the instrumental version of the video. The final instrumental was a 40-piece string section along with Pandit Shiv Kumar Sharma, Vikku Vinayakram and other instrumental maestros of Indian classical music. Most of the performances included two generations of maestros - fathers and sons. In Kanika's words, "It was a huge musical unification... this anthem has so much of soul."

It is also notable that during the filming of the anthem with the Ladakh Scouts, there were about 500 jawans who fought during the Kargil war. The producers hoisted a huge flag about 40 feet long for the video in their honour.

Thota Tharini, an artist based out of Madras painted what is now the Vande Mataram logo for the video.

Music
The music was produced and arranged by A R Rahman. The video was produced by Bharat Bala Productions.

Vocalists
    * D. K. Pattammal
    * Pandit Bhimsen Joshi
    * Lata Mangeshkar
    * Pandit Jasraj
    * Mangalampalli Balamurali Krishna
    * Jagjit Singh
    * Pandit Ajoy Chakrabarty
    * Shobha Gurtu
    * Begum Parveena Sultana
    * Bhupen Hazarika
    * Ustad Rashid Khan
    * Ustad Ghulam Mustafa Khan
    * Smt. Shruti Sadolikar
    * Dr S P Balasubramaniam
    * Sudha Raghunathan
    * Asha Bhosle
    * Hariharan
    * Kavita Krishnamurthy
    * P Unnikrishnan
    * Nityashree
    * Saddiq Khan Langa
    * Ghulam Murtaza Khan
    * Ghulam Qadir Khan
    * Kaushiki Chakrabarty

Instrumentalists
    * Flute: Pandit Hari Prasad Chaurasia
    * Sarod: Ustad Amjad Ali Khan, Amaan Ali Bangash, Ayaan Ali Bangash
    * Santoor: Pandit Shiv Kumar Sharma, Rahul Sharma
    * Ghattam: Vikku Vinayakram, Uma Shankar
    * Mohan Veena: Pandit Vishwa Mohan Bhatt
    * Saxophone: Kadri Gopalnath
    * Chitraveena: Ravikiran
    * Veena: E Gayathri
    * Sarangi: Ustad Sultan Khan
    * Sitar: Pandit Kartick Kumar, Niladri Kumar
    * Violin: Kumaresh, Ganesh

Orchestra
    * Conductor: K. Srinivas Murthy
    * Cello: Ramsekar, R K Vijayandran, Bidyur Khayal
    * Tympany: Kumar, Karthikeyan
    * Violin: M Kalyanasundaram, Jerry Fernandes, Cyril Fernandes, R Joseph, K Murali, B J Chandru, B Balu, Murali, Dinakar,
                Rex Isaac, Debu Ashish, PJ Sebastian, P S Ramachandran
    * Mridangam: D A Srinivas
    * Harp: R Visweswaran

The Video
http://video.google.com/videoplay?docid=7399792002477900458



Forgiving or punishing the terrorists is left to God. But, fixing their appointment with God is our responsibility
- Indian Army

Monday, August 13, 2007

అమీ -తుమీ..

ఆమీ తుమీ తేల్చుకుందాం రా....

ఈ జాతీయంలో అమీ తుమీ అనేది ఏ భాషా పదం. అది తెలుగులా లేదే!!. మరి ఎక్కడినుండి వచ్చింది. దాన్ని అలాగే ఎందుకు వాడుతున్నారు.??

 అమీ అంటే  నేను

తుమీ అంటే నువ్వు

అసలు పదం సంస్కృతంలోనిది

అహం - నేను

త్వం _ నువ్వు

అది వెళ్ళి బంగ్లా భాషలో అమీ తుమీ అయ్యింది.

అలాగే వచ్చి తెలుగులో కూడా అమీ తుమీ తేల్చుకుందాం అయింది. అంటే నువ్వా నేనా తేల్చుకుందాం అని.

 ఇది ఈటీవీ౨ లో వచ్చిన తెలుగువెలుగులో వచ్చింది.

Monday, August 6, 2007

శంకర్ దాదా !!!!>>>

* ఆడదాని వయసు, మగవాని జీతం అడగొద్దంటా.. asking not women age and men salary.

* ఆడది సాధించలేని ఏదీ లేదు ముఖ్యంగా మొగుడిని .. not achieving women anything specially husband

* ఆకాశానికి హాద్దు లేదు...no reach for sky.

* ఆలూ లేదూ చూలు లేదూ కొదుకు పేరు సోమలింగం అంట.. no wife, no mother in law, son name somalingam.

* ఆరే దీపానికి వెలుగు ఎక్కువ ..  more bright when light going off.
 
* ఆవలింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట.yawning brother having sneezing brother no.

* ఆవలిస్తే పేగులు లెక్కపెట్టాడంట.. yawning doing intestines counting.

*ఆయనే ఉంటే మంగలి ఎందుకంట. husband there why barber?

*అక్కపెల్లి కుక్క చావుకి వచ్చింది. sister marraige dog death got.

* అమ్మ కడుపు చూస్తుంది. పెళ్ళాం జేబు చూస్తుంది..mother stomach seeing, wife pocket seeing.

* అందం అన్నం పెట్టదు..beauty food no keep!.

* అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని ఉందంటా. all there son in law mouth bad luck there.

* అత్త సొమ్ము అల్లుడు దానం చేసాడంట.. mother in law money son in law donating.

* అయితే ఆదివారం కాకుంటే సోమవారం.if sunday otherwise monday.

*చాప క్రింద నీరు..mat down water.
* అయ్యకు లేక అడుక్కుంటుంటే కొడుకు వచ్చి కోడి పలావ్ అడిగాడంట. father begging son coming chicken biryani asking.
 
*అయ్యవారిని చెయ్యబోతే కోతి అయ్యిందంట.man making monkey becoming.

* ఆశపోతు బ్రాహ్మడు లేచిపోతు పప్పు అడిగాడంట..brahmin getting up dal asking. 

Friday, August 3, 2007

అక్షయపాత్ర

                                         11.jpg 

వాహనం వస్తున్న శబ్దం వినిపించగానే గణగణమంటూ గంట మోగుతుంది. విద్యార్థులంతా చేతిలో పళ్ళెం పట్టుకుని వరుసలో నిలబడతారు. టీచర్లు వేడి వేడి అన్నం, నోరూరించే కూర, ఘుమఘుమలాడే సాంబారు, చిక్కటి పెరుగు పళ్ళెంలో వడ్డిస్తారు. పిల్లలు కబుర్లు చెప్పుకుంటూ కడుపునిండా తింటారు. మద్యాహ్న భోజనం ఐదులక్షల మంది బడి పిల్లల జీవితాల్ని మార్చింది. పేదరికంతో వచ్చిన పోషక విలువల లోపాల్ని పారదోలింది. ఆకలితో పుట్టిన నిర్లిప్తతను దూరం చేసింది.వారిప్పుడు  చదువుల్లో ముందు. ఆటల్లోనూ ముందే! "చదువుకోవడానికి ఆకలి అవరోధం కాకూడదు" అన్న లక్ష్యంతో ఇస్కాన్ ప్రారంభించిన పధకం "అక్షయపాత్ర" 


                                         51.jpg

ఎంతో మంది పేద విద్యార్థులను అందునా చిన్నారులను వేధిస్తున్న సమస్య ఆకలే! రాక్షసిలాంటి ఆకలి.. దయ్యంలా వెంటాడి వేధించే ఆకలి. స్కూల్లో శ్రద్ధగా పాఠాలు విందామంటే కడుపులోని పేగులు అరుపులతో ఇబ్బంది పెట్టేవి. బోర్డు మీదున్న జవాబుల్ని పుస్తకంలో రాసుకుందామంటే బైర్లు గమ్మేవి..కళ్ళు సహకరించేవి కావు. పాఠం విన్నా ఆకలే ముందు గుర్తొచ్చేది పిల్లలకు. బడిగంట కొట్టాక ఇంటికెళ్ళినా పేగులు నోరు మూసుకునేవి కావు. కడుపునిండా అన్నం పెట్టకపోతే అవి మాత్రం ఏం చేస్తాయి. రాత్రికి అమ్మ ఇచ్చిన గంజినీళ్ళు తాగి బలవంతాన నిద్రపోవడమే. మేల్కొని ఉంటే ఆకలేస్తుంది. నిద్రలో అయితే సంగతే గుర్తుండదు. 


 


ఆకలే తమ శత్రువని పిల్లలకు అర్ధమైపోయింది. అంత పెద్ద శత్రువును జయించగల శక్తి వారికెక్కడుంది. అసలే పసివారు.ఆపై అర్భకులు. దేవుడు ప్రత్యక్షమైతే ఎంత వడ్డించినా అన్నం పుట్టుకొచ్చే అక్షయపాత్ర అడగాలని పిల్లలంతా ఏకగ్రీవంగా తీర్మానించారు. దేవుడు ప్రత్యక్షం కాలేదు గాని ఇస్కాన్ (అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థ) అద్వర్యంలోని అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధి వచ్చి పిల్లలకు రోజూ మద్యాహ్నం కడుపునిండా అన్నం పెడతామని చెప్పారు. పథకం పేరు "అక్షయపాత్ర"


                                         31.jpg 

ప్రస్తుతం ఐదు రాష్ట్రాలలోని రెండు వేల పాఠశాలల్లో చదివే ఐదు లక్షలమంది చిన్నారులు "అక్షయపాత్ర" లోని అన్నం తింటున్నారు. ఆకలి వారితో రాజీకొచ్చింది. మీ జోలికిరాను బుద్ధిగా చదువుకోండి.అని చెప్పి తన దారిన తాను వెళ్ళింది.వాళ్ళకిప్పుడు క్లాసులో రోజూ ప్రశంసలే. ప్రతి పరీక్షలో మంచి మార్కులే. పళ్ళెంనిండా   అన్నం ఉన్నప్పుడు ఆకలనిపించదు. తినడానికి ఉందన్న ధైర్యంతోనే సగం కడుపు నిండిపోతుంది. "అక్షయపాత్ర" భరోసా ఇచ్చింది.


 


ఒకసారి ఇస్కాన్ వ్యవస్థాపకులు ప్రభుపాదస్వామి ఎదో గ్రామానికి వెళ్ళినప్పుడు  ఎంగిలి విస్తరాకులలో అన్నం మెతుకుల కోసం కుక్కలతో పోటీపడి తింటున్న చిన్న పిల్లలను చూసి హృదయం ద్రవించి  పథకానికి ఆలోచన చేసారు. అక్షయపాత్ర ద్వారా ఒక్కో విద్యార్థి భోజనం ఖర్చు ఆరు రూపాయలు దాకా అవుతుంది. దీని ప్రకారం రోజువారీ వ్యయం ముప్పైలక్షల పైమాటే. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు  పథకానికి కొన్ని నిధులు ఇచ్చాయి.కాని అవి మూలకు సరిపోతాయి. అయినా పనిని సంతోషంగా స్వీకరించింది ఇస్కాన్. "మన దేశంలో పసివాడు ఆకలితో మాడిపోకూడదు. ఆకలి చదువులకు అడ్డంకి కాకూడదు" అన్నదే సంస్థ ఆశయం.


                                          61.jpg

దాన్ని సాధించడానికి ఎన్నో కార్పోరేట్ సంస్థలు సాయమందిస్తున్నాయి. తొలి స్పందన ఇంఫోసిస్ ఫౌండేషన్ అద్యక్షురాలు సుధామూర్తి. ఉత్తరప్రదేష్‌లోని మధురలో భారతీ టెలివెంచర్స్ 'అక్షయపాత్ర 'కు అండగా నిలుస్తుంది. సత్కార్యంలో భాగస్వాములు: ఎన్ జెడ్ తెక్నాలజీ, అశోక్ లేలాండ్, ఓఏన్‌జిసి, ఫిలిప్స్, యూబీ గ్రూప్, యాక్సెంచర్ మొదలగునవెన్నో కార్పోరేట్ సంస్థలు  అన్నదానానికి తోడు నిలుస్తున్నాయి.


                                         41.jpg

మద్యాహ్నాలు కడుపారా భోంచేస్తున్న పిల్లల సంఖ్య ఇంకో మూడేళ్ళ తర్వాత పది లక్షలకు చేరుతుంది. అలా మెల్లమెల్లగా పేదరికం కారణంగా బడికి దూరంగా ఉన్న దాదాపు నాలుగున్నర కోట్ల మంది పిల్లలకు చేరుతుంది. ఇది ఇస్కాన్ విజన్.  కల  నెరవేరాలంటే మరింత మంది ముందుకు రావాలి. చాలా నిధులు కావాలి. ఒక వ్యక్తి అందరికి సాయం చేయలేకపోవచ్చు. కానీ అందరూ కలిసి మంచిపనికి సాయపడవచ్చు. కలాం సలహా కూడా అదే. కనీసం నెలకు పదివేలు సంపాదిస్తున్నవారు ఒక విద్యార్థి ఏడాది భోజనం ఖర్చులను భరించడం కష్టమేమీ కాదు.కాస్తో కూస్తో స్థోమత ఉన్నవారికి ఏడాదికి పన్నెండు వందలు లెక్కలోకి రావు. తమ బిడ్డల పుట్టినరోజు వేడుకల ఖర్చు, ఇతర విందులూ వినోదాలతో పోలిస్తే అదో పెద్ద మొత్తమే కాదు కానీ సొమ్ము నిరుపేద విద్యార్థికి ప్రాణం నిలిపే అన్నం... పరబ్రహ్మ స్వరూపం.


                                          21.jpg

పథకానికి అభయహస్తం అందించాలనుకునేవారు బెంగుళూరులోని అక్షయపాత్ర ఫౌండేషన్ కార్యాలయానికి ఫోన్ చేయవచ్చు.  080-23578622, 23471956



 


ఇది ఈనాడు పత్రిక, టీవీలో వచ్చిన కార్యక్రమమునుండి సేకరించిన సమాచారం.

test

Loading...