Tuesday, August 21, 2007

యమదొంగ

                        yama.jpg

కొత్త సీసాలో పాత మందులా అలనాటి ఎన్.టి.ఆర్ సూపర్ డూపర్ హిట్ "యమగోల" సినిమా ఆధారంగా వచ్చిన జూ.ఎన్.టి.ఆర్ "యమదొంగ" హిట్ అంటున్నారు. చిక్కినా చక్కదనమే అన్నట్టు ఎన్.టి.ఆర్ ఇంకా గ్లామరస్‌గా కనిపిస్తున్నాడు. పాత కొత్త సుందరాంగులతో సయ్యాటలాడి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కొత్త సినిమా టాక్ అంటే కాలేజీ పిల్లలే చెప్పాలి. అందుకే మా పిల్లలను అడుగుతా ఎలా ఉంది అని. వాళ్ళు అన్నీ చూడకున్నా వాళ్ళ స్నేహితులనుండి తెలుస్తుంది సినిమా వచ్చిన రోజో మరునాడో. నీట్ కామెడీ, స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్, యమలోకం సెట్టింగ్స్, ముఖ్యంగా మోహన్‌బాబు డైలాగ్స్ అదుర్స్. యముడు, హీరో తగూలాటలు, మాటల యుద్ధాలు, యమలోకంలో హీరో చేసే అల్లరి అందరిని ఆకట్టుకుంటున్నాయి. మ్యూజిక్ కూడా ఓకే.హిట్ అంటున్నారు. సినిమా రాకముందే మా పిల్లలు నన్నడుగుతారు. ఇది హిట్టా ఫట్టా అని. సినిమా స్టోరీ, మ్యూజిక్ వినగానే చెప్పేస్తా. అది కరెక్ట్ అవుతుంది  కూడా. అలాగే యమదొంగ విషయంలో కూడా స్టోరి  బానే ఉంటుంది. కామెడి బాగుంటేనే హిట్ అవుతుందని చెప్పా. పాత హీరోయిన్ రంభ ఒక హిట్ పాటలో ఎన్.టి.ఆర్ తో పోటీ పడి నాట్యం చేసింది. తన వయసు ఎక్కువని అస్సలు తెలీలేదు. అందరూ హీరోయిన్లు ముద్దుగా ఉన్నారు.

ఇక సినిమా విషయానికొస్తే...

నటీనటులు:
జూ.ఎన్.టి.ఆర్, మోహన్‌బాబు, బ్రహ్మానందం, ప్రియమణి,మమతా మోహన్‌దాస్, ఆలీ,మొదలగువారు.
దర్శకుడు.. రాజమౌళి

హీరో ఒక ఆరితేరిన దొంగ. కోట్లకు వారసురాలైనా హీరోయిన్ (ప్రియమణి)ని ఆమె ఆస్థి కోసం ప్రేమిస్తాడు. కాని ఆమె  బంధువుల వల్ల జరిగిన ఘర్షణలో చనిపోతాడు. అక్కడినుండి యమలోకానికి వెళ్ళి నానా అల్లరి చేస్తాడు. అప్సరసలతో ఆటలు,పాటలు. ఇలా యముడు, హీరో దాగుడుమూతలు.. వెరసి సినిమా మంచి కామెడి ...
చూడడంలో ప్రమాదం ఎమీ లేదు. 

No comments:

Post a Comment

test

Loading...