Friday, September 14, 2007

HAPPY BIRTHDAY JYOTHI

                            7.jpg

రోజుకి నేను బ్లాగు మొదలుపెట్టి సరిగ్గా సంవత్సరమవుతుంది. నా బ్లాగ్ప్రయాణంలో అన్నీ శుభాలు, విజయాలే దక్కాయి నాకు. అది జరగడానికి నాకు సహకరించి, ప్రోత్సహించిన అందరు బ్లాగర్లకు హృదయపూర్వక ధన్యవాదములు.


 


ఊరికే టైంపాసుకు నెట్‌కొచ్చిన నాకు దొరికిన అమూల్యమైన వరం తెలుగు బ్లాగు గ్రూపు. మొదట్లో సరదాగా గడిచిపోయింది గుంపులో కాని అందరు కలిసి నన్ను బ్లాగు మొదలెట్టించారు. బ్లాగు మొదలెట్టిన సమయంలో అంతా అయోమయంగా ఉండేది. అస్సలేమీ తెలీదు. ఎలా చేయాలో తెలీదు. ఊరికే టైప్ చెయ్యడం మాత్రం వచ్చేది. కాని నేనడిగిన సందేహలన్నింటికి  గుంపులో ఓపిగ్గా సమాధానమిచ్చేవారు ఎవరో ఒకరు.


 


గత సంవత్సరం అందరి ఆడాళ్ళలాగే  ఇంటిపని కాగానే నిద్రపోవడం, టీవీలో వచ్చే చెత్త సీరియళ్ళన్నీ చూడడం( అప్పుడవి మహాద్భుతాలు) వాటిగురించే చర్చించడం, మరునాటి కోసం ఎదురుచూడ్డం చేసేదాన్ని. వేరే వినోదం అంటూ లేదు మరి. ఐనా నాలో ఎదో అసంతృప్తి. నాకు నచ్చిన పాటలు, వంటలు, జోకులు, కథలు,పురాణగాథలు. వీటన్నింటి గురించి మాట్లాడుకోటానికి స్నేహితులు లేరు.నాలో నేనే అనుకోవడం. మొదటినుండి తెలుగు అంటే ప్రాణం. పుస్తకాలంటే మరీను. మరి ఏదైనా విషయం గురించి చర్చించాలి, సందేహం తీర్చుకోవాలి అంటే ఎవరూ లేరు. అందుకే గూగుల్‌లో కనపడ్డ తెలుగు గుంపులన్నీ చేరిపోయా. అప్పటికి గ్రూపులంటే తెలీదు. తర్వాత ఒక్కటొక్కటిగా తెలుసుకుని బ్లాగు గుంపులో స్థిరపడిపోయా. సమయంలో నన్ను అడుగడుగునా ప్రోత్సహించిన వీవెన్, చావాకిరణ్, సుధాకర్, శిరీష్‌గారు, సిబిరావుగారు, రమణ, త్రివిక్రం, ప్రసాద్, రవి వైజాసత్య అందరికీ ఎంతోణపడి ఉన్నాను. బ్లాగుల మూలంగానే నాకే తెలియకుండా నాలో దాగి ఉన్న అభిరుచులన్నీ బయటపడ్డాయి. నాకు ఇష్టమైనవన్నీ బ్లాగుల రూపంలో భద్రపరుచుకుంటున్నాను. ఇప్పుడు ఎంతో తృప్తిగా ఉంది. ఎలాంటి అశాంతి అసహనం లేదు.నాకిష్టమైన వంటలు, సరదా కథలు,జోకులు,పాటలు అన్నీ తెలుగులో రాయగలుగుతున్నాను, నాలా ఆలోచించే, అర్ధం చేసుకోగలిగే మిత్రులతో పంచుకోగలుగుతున్నాను అని. బ్లాగుల వల్ల నా ఆలోచన, అవగాహనా శక్తి పెరిగింది.నిజం. ఎప్పుడైనా  ఏ విషయమైనా నచ్చిందైనా , నచ్చనిదైనా, నా స్వంత విషయమైనా వెంటనే బ్లాగులో రాసుకుని అందరితో పంచుకోవడం అలవాటైపోయింది. అందరూ కుటుంబ సభ్యులు, పాత మిత్రులలా అనిపిస్తుంది. ఈ ప్రయాణంలో నేను ఎవ్వరితోను పోటీ అనుకోలేదు. నాకు నేనే పోటీ పెట్టుకుని రాసుకుంటూ పోయా. మొదటినుండి నాదో అలవాటు మంచిదో కాదో తెలీదు. నాకు తెలిసింది పదిమందికి చెప్పడం, తెలీంది పదిమందిని అడగడం. అదే పాటిస్తూ వస్తున్నా ..


 


ఇన్నేళ్ళుగా మావారు, పిల్లలకిష్టమైనవి చేయడమే నా బాధ్యత, కర్తవ్యం అంటూ బ్రతికేసాను. నాకంటూ ఇష్టాలు ఏమున్నాయి అని ఆలోచించలేదు. ఫలానా ఆయన భార్య, ఫలానా ఆయన కూతురు అని మాత్రమే నాకు గుర్తింపు ఉండేది. నాకంటు ఒక గుర్తింపు ఉంటుంది, ఉండాలని ఎప్పుడు ఆలోచించలేదు. కాని బ్లాగులలో రాసుకుంటూ పోతుంటే మీ అందరి ప్రోత్సాహం, అభినందనలు,గౌరవం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది.నేను కూడా ఎదో చేయగలను, సాధించగలను అనుకుంటూ మరింత ఉత్సాహంతో సాగిపోయాను. ప్రయాణంలో ఎక్కడా అపశృతులు కలుగలేదు.ఇప్పుడు నేను మా ఇంట్లోవాళ్ళకి , మా పుట్టింట్లో గర్వంగా చెప్పుకుంటాను ఇంటర్‌నెట్‌లో దేశవిదేశాల్లో నాకెంత పేరుందో తెలుసా అని.. ఇది నేను ఇంట్లోనే ఉండి చేయగలిగాను అని. అందరూ ఊరికే అనేవారు మరి ఎప్పుడూ  కంప్యూటర్లో ఏం చేస్తుంటావు అని.  నేను ఎన్ని బ్లాగులు రాసినా అది నా కుటుంబ బాధ్యతల తర్వాతే తీరిక సమయాలలో చేస్తున్నాను.  టీవీ అంటే చిరాగ్గా ఉందిప్పుడు. బయటికెళ్ళిగాని, ఫోన్లోగానీ సొల్లు కబుర్లు బంద్. తెలిసినవాళ్ళందరు అడుగుతుంటారు ఏంటిది అస్సలు కనపడటంలేదు, మాట్లాడటంలేదు. ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు అని.నవ్వి ఊరుకుంటాను. నేను చేసే పని చెప్పినా వేస్ట్ కాబట్టి. వాళ్ళకి అర్ధం కాదు.


 


ఏడాది ప్రయాణంలో నాకు ఎప్పుడు అలసటకాని, కష్టం కాని అనిపించలేదు. ఎందుకంటే నాకిష్టమైన తెలుగులో పని కదా.ఇష్టమైతే ఎదీ కష్టం కాదు. ఏడాది కాలంలో తెలిసి ఎవ్వరినీ నొప్పించలేదు. తెలియక నొప్పించితే క్షమించండి.మీకు తెలుసుగా నేను ఎప్పుడు సరదాగానే ఉంటాను అని.


 


ఇవి నా ప్రయాణంలో అంచెలంచలుగా నా ఎదుగుదల.


 


మొదటి నెలలో రెండో బ్లాగు - షడ్రుచులు


మూడు నెలలలో - షడ్రుచులలో 100 టపాలు, మూడో  బ్లాగు గీతలహరి


ఆరునెలలో - 500 టపాలు , 4  బ్లాగులు


తొమ్మిది నెలలలో -1000 టపాలు , 5 బ్లాగులు


సంవత్సరానికి - తెలుగు వెలుగులు వ్యాసం. 


 


ఇంకా ఏమన్నా ఉందా నేను చేయగలిగేది. లేదనుకుంటా. కాని ఇంకా ఎంతో సాధించాల్సింది ముందుంది అనిపిస్తుంది. ఆపై దేవుడి దయ.  నాకు ఒక్కటే లోటుగా ఉంది. తెవికీలో రాయడానికి సమయం చిక్కడంలేదు.


 


ఒక కొత్త శీర్షిక : నా స్నేహితురాలు స్వరూప చెప్పే ముచ్చట్లు అప్పుడప్పుడు రాస్తుంటాను. అది తెలంగాణ శకుంతల టైపు. పాతబస్తీలో ఉంటుంది.


 


సంవత్సరంగా నాకు నచ్చిన నా ఆలోచనలు, భావాలు, చర్చలు .... 




అదేంటో గాని.


వారెవ్వా క్యా సినిమా హై


అనుబంధం


ఆడపిల్ల


అదే మరి మండుద్ది


500


ఒక భార్య మనోవేదన


ఆడవాళ్ళలో జీనియస్సులు ఎందుకు లేరు


పెళ్ళిచూపుల ప్రహసనం


పడ్డానండి ప్రేమలో మరి


నమస్తే అన్నా


శతమానం  భవతి


మృదులాంత్ర నిపుణుడి మనోభావాలు


 


ఏడాది క్రితం నేను ఏమి తెలీదు అంటూ గుంపులో కొచ్చా. కాని ఇప్పుడు అందరికంటే నేనే గొప్ప. నాకున్న బిరుదు, గౌరవం ఎవరికన్నా ఉందాఅదేంటాజ్యోతక్క.. అనే పేరు.  మరి అన్నా అని ఎవరన్నా పిలిపించుకున్నారా? విహారి ఏమంటావ్? నువ్వేనా మరి.


 


 


ఇప్పటికే కోతలు ఎక్కువయ్యాయి గాని….ఉంటా మరి..





Monday, September 3, 2007

జన్మదిన శుభాకాంక్షలు చేతన్...

   chetan.jpg                 8.jpg

HAPPY BIRTHDAY TO KRISHNACHAITANYA..

ఈరోజు మా అబ్బాయి కృష్ణచైతన్య పుట్టినరోజు. నీ బ్లాగులో అందరికీ

విషెస్ చెప్తావ్. నాకు చెప్పవా అంటే ఇలా చెప్తున్నా. మీ అందరి

ఆశీర్వాదాలు ఇవ్వండి.నెల క్రిందే విప్రోలో ఉద్యోగంలో చేరాడు వాడు.

ఆ కృష్ణుడిలాగే  మావాడు అల్లరి ఎక్కువే చిన్నప్పటి నుండి...

Sunday, September 2, 2007

యధార్ధ గాధ...

ఒక యధార్ధ గాధ. చెప్పనా..

నాకు తెలిసిన ఒక మంచి వ్యక్తి జీవితంలోని యధార్ధ గాధను మీకు

చెప్పాలనుకుంటున్నాను. అతను ఎదుర్కొన్న సమస్యలలో కొన్ని

మనకూ ఎదురై ఉండవచ్చు. కాని మృతువు అంచుల దాకా వెళ్ళి

తిరిగి వచ్చి తన ధృడ సంకల్పముతో అనారోగ్యముతో పోరాడుతూనే

అతి పిన్న వయసులోనే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని,

ఆంధ్రదేశంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొంది

గౌరవింపబడుతున్న వ్యక్తి జీవిత సత్యమిది.

ముందుగా అతను తన కథను చెప్పలేదు. కాని మాటల సంధర్భములో బలవంతం పెడితే నాకు చెప్పిన కథను నా బ్లాగులో రాయలనుకుంటున్నాను.ఏమంటారు. ఇది అతనికి సానుభూతి నివ్వాలని కాదు. అతని కథను చదివితే ఒక స్పూర్థి, ప్రేరణ  కలుగుతుందని.

ఏమంటారు???

Saturday, September 1, 2007

అందరికీ ధన్యవాదములు...

                  namaste1.jpg

నేను మొదటి సారి రాసిన వ్యాసం అందరికీ నచ్చినందుకు , నన్ను అభినందించినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు.

నేను వెయ్యి టపాలు పూర్తి చేసి విక్షనరీ, తెవికీ పనులు చేసుకుందాము హాయిగా అనుకుని బ్రేక్ తీసుకున్నా. కాని అనుకోకుండా నల్లమోతు శ్రీధర్ గారు మన బ్లాగు గుంపులోకి రావడం,ఆయనని బ్లాగు మొదలెట్టమనడం జరిగింది. మామూలుగా నేను వికీ పని చేసుకుంటూ ఉండగా, ఒక రోజు శ్రీధర్ గారు ఏమనుకున్నారో ఏమో తను రాయాలనుకున్న బ్లాగుల గురించి వ్యాసం నన్ను రాయండి అని అడిగారు. ముందు నేను షాక్ అయ్యా. వీవెన్,త్రివిక్రం,నాగరాజుగారు, ప్రసాద్‌ని అడిగా ఇది సంగతి ఏం చేయను అని. వాళ్ళకు నామీద నాకంటే ఎక్కువ నమ్మకముంది. మీరు చేయగలరు ..మొదలెట్టండి అన్నారు. సరే. కంప్యూటర్ ఎరా పత్రిక చదివేది అందరూ కంప్యూటర్ ఉన్నవాళ్ళే, తెలుగు వచ్చినవాళ్ళే. మన బ్లాగులు, వికీ గురించి తెలియాలంటే, రాయలంటే తప్పనిసరిగా కంప్యూటర్ ఉండాల్సిందే. ఇది మంచి అవకాశం వదలకూడదు అని నిర్ణయించుకుని కొందరు బ్లాగర్లు ఇచ్చిన లింకులను సేకరించడం మొదలెట్టా.

అన్ని లింకులనుండి సమాచారాన్ని ముందుగా ప్రింట్ చేసి పెట్టుకున్నా. అస్తమానం కంప్యూటర్ ముందు కూర్చోడం కుదరదుగా. ఇంట్లో మావారికి కూడా చెప్పలేదు. ప్రింట్ చేసిన పేపర్లు చూసి మావారు అడిగారు ఏంటిది నా పేపర్లన్నీ ఖాళీ చేస్తున్నావ్,ప్రింటర్ ఇంక్ అంత తొందరగా ఐపోతుంది ఎన్ని సార్లు నింపనూ అని. ఒక ఆర్టికల్ రాస్తున్నా అని చెప్పాగాని కంప్యూటర్ ఎరా అని చెప్పలా. ఎందుకంటే గత మూడు సంవత్సరాలుగా మావారు ఆ పత్రిక కొంటున్నారు. సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా. ఎలాగైతేనేమి అనుకున్న సమయానికి వ్యాసం రాసి శ్రీధర్ గారికి అందివ్వగలిగాను. ఆయన చిత్రాలు పెట్టి కష్టపడి కవర్ పేజీ తయారు చేసారు.

నిజంగానే ఇది ఒక యజ్ఞం లా అనుకుని చేసాను. ఎందుకంటే బ్లాగుల గురించి, వికీ గురించి ఇంత వివరంగా చెప్పే అవకాశం వచ్చినందుకు, నా శాయశక్తులా ప్రయత్నించి అన్ని వివరాలు ఇవ్వగలిగా. దీనికి  వీవెన్,కిరణ్ , త్రివిక్రమ్,శిరీష్ గారు,రమణ,నవీన్ ఎంతో సాయపడ్డారు. వారి సాయం లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు.నేను అనుకున్నది, వీళ్ళందరికి చెప్పింది ఇది నా అర్టికల్ కాదు మనందరిది అని.

ఈ వ్యాసం రాసేటప్పుడు నేను రోజూ దేవుడిని ఇదే కోరుకున్నా. ఇది పూర్తి అయ్యేవరకు నాకు మానసికంగా కాని, శారీరకంగా కాని ఎటువంటి సమస్యలు రావద్దని, ఎలాంటి అడ్డంకులు రాకుండా పూర్తి చేయాలని. అది జరిగింది చాలు ఎంతో సంతృప్తిగా ఉంది. నేను ఇదంతా చెప్పింది నా గొప్పలు చెప్పాలని కాదు.నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకున్నానిలా అని అంతే.

ఈ వ్యాస రచనలో  నాకు అనుక్షణం సహకరించిన గురువుగారు వీవెన్ కు శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. చాలా సతాయించాలెండి. థాంక్యూ వీవెన్. 

నా ఈ విజయాన్ని మావారికి, పిల్లలకు మా వివాహ రజతోత్సవ కానుకగా ఇచ్చా. పత్రికాఫీసునుండి కాంప్లిమెంటరు కాపీ వచ్చేవరకు మావారికి తెలీదు. పత్రిక చూసి ఏంటిది ,ఎందుకొచ్చింది అని అడిగారు. చదివాకా నవ్వుతూ గుడ్ బావుంది అన్నారు.మనసులో కాస్త గర్వంగా ఫీల్ అయ్యారు . కాని  బయటపడలేదు. నాకు తెలీదేంటి.పిల్లలేమో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకుంటున్నారు. 

ముచ్చట్లు ఎక్కువయ్యాయి కాని ఇక మామూలుగా నా బ్లాగులు రాసుకుంటాను. త్వరలో ఒక చురకలాంటి టపా రాయబోతున్నా మరి.

test

Loading...