Wednesday, July 18, 2007

రండి రండి దయచేయండి....

tewiki3.png                               

రండి రండి రండి దయచేయండి
తమరి రాక అందరికీ సంతోషం సుమండీ

బ్లాగులు రాసేవారికి, రాయనివారికి, చదివేవారికీ అందరికీ ఇదే ఆహ్వానం. 

ఏంటండి సినిమా పాట పాడుతున్నా అనుకుంటున్నారా? బ్లాగులోకొచ్చాక కూడా ఇంకా రండి అంటున్నానంటారా.. నేను రమ్మని అన్నది తెలుగు వికీపీడీయాలోకి. అందరూ టపటపా బోలేడు టపాలు రాసేస్తున్నారు. సంతోషం. అదే చేత్తో తెవికీలోకి కూడా అడుగెట్టి అక్కడ కూడా రాయండి.ఏం రాయాలి అంటారా? పదిమందికి ఉపయోగపడుతుంది అనే విషయం ఏదైనా రాయొచ్చు.వికీలో రాసింది అందరికీ ఉచితంగా మరియు స్వేచ్ఛగా అందుబాటులో ఉండాలి.

అందుకని కాపీహక్కులున్న సమాచారాన్ని వికీలో చేర్చకూడదు


సినిమా
వంటలు
కూరగాయలు,పండ్లు
చందస్సు
సామెతలు
జాతీయాలు
పురాణగాధలు
జానపద కళలు
మీ ఊరి గురించి

ఇలా కాదేది కవితకనర్హం అన్నట్టు తెవికీలో  పనికొచ్చేది  రాయొచ్చు. కాని రాయడానికి పుస్తకాలు కొనాలేమో అనుకోకండి. మీ దగ్గర ఉంటే సరి లేదా మీ పిల్లల స్కూలు పుస్తకాలు తీసుకుని చదివి మీకు అర్ధమైంది ఇంకాస్త వివరంగా రాసేయండి. తెలుగు చందస్సు,ఉపవాచకములోని కథలు, వేరే ఏ విషయమైనా తెలుగులో రాసేయండి. బ్లాగు రాయడానికే సమయం సరిపోవడం లేదు ఇక వికీలో ఎలా రాసేది అంటారా.వారానికి ఓ గంట తెవికీ కి కేటాయించండి. లేదా రోజు కొంచం కొంచం రాయండి మీ తీరిక సమయంలో. మీ కుటుంబ సభ్యులకు చెప్పండి , పిలలకు కూడా వాళ్ళ క్లాసు పుస్తకాల నుండి ఎదో విషయం కాని, లేదా పుస్తకం కొనిచ్చి రాయమనండి. కాస్త అలవాటైతే వదలరు. అలా వాళ్ళు తెలుగు మరిచిపోకుండా ఉంటుంది. సేకరణల బ్లాగుల వాళ్ళు తమ బ్లాగులలో ఉన్న విషయాలు  పదిమందికి పనికొస్తాయి అని అనుకుంటే వికిసోర్సులో రాయండి. కీర్తనలు లాంటివి.తెవికీలో రాయడం చాలా సులువు. దానికి ఎటువంటి సాధనాలు కానీ, మృదులాంత్రాలు కాని అవసరం లేదు. మీరు మామూలుగా చిన్న చిన్న మార్పులతో ఇంగ్లీషులో టైప్ చేసుంటే అక్కడ తెలుగులో వచ్చేస్తుంది. చాలా ఈజీ.మీకు ఏ సందేహమైనా సహాయమైనా ఇవ్వడానికి వికీ సభ్యులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. .

http://groups.google.com/group/teluguwiki?hl=te 

 మరి తొందరగా వచ్చేయండి.

No comments:

Post a Comment

test

Loading...