
(విశాఖ 4, అనూరాధ, జ్యేష్టా)
ఆదాయం-11 వ్యయం-14 రాజపూజ్యం-3 అవమానం-1
ఈ రాశివారికి గురువు నవంబరు 21 వరకు జన్మమందు, తదుపరి సంవత్సరమంతా రెండింట
రజితమూర్తి. శని జులై 15 వరకు తొమ్మిదింట తదుపరి సంవత్సరమంతా పదింట రజితమూర్తి.
రాహువు నాలుగింట, కేతువు పదింట లోహమూర్తులు. ఈ రాశివారు వ్యవహారదక్షులు.
స్వలాభం, సంఘసేవాతత్పరత రెండూ వీరిలో కనిపిస్తాయి. నిదానంగా, నిగూఢంగా
వ్యవహరిస్తారు. వీరికి నవంబరు వరకూ గురుడు జన్మరాశిలో ఉన్నాడు. చతుర్ధ మందు
రాహువు, పదింట కేతువు మిశ్రమ యోగకారకులు కాబట్టి తరచు ప్రయాణం, ఇబ్బందులు,
అనారోగ్యం, వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశాం ఉంది. పిక్కలు, నడుము,
కంఠానికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది జులై నుంచి సంవత్సరాంతం
వరకు కుజదోషం వల రుణబాధ అధికంగా ఉంటుంది. కోరికలు అదుపులో ఉంచుకోవాలి.
కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఊహించని సమస్యలు
ఎదురయ్యే సూచనలున్నాయి. చేపట్టిన ప్రతిపనిలో ఆటంకాలు తలెత్తడం వల్ల కార్యభారం
పెరుగుతుంది. శ్రమాధిక్యం స్వల్పలాభం కారణంగా నిరుత్సాహంగా ఉంటుంది. వ్యాపార
భాగస్వామ్యుల మధ్య కలతలు తలెత్తే సూచనలున్నాయి. అయినప్పటికీ నూతన
వ్యాపారాభివృద్ధికి అవకాశం ఉంది దీర్ఘకాలిక ప్రణాళికలు భవిష్యత్తులో సత్ఫలితానిచ్చేందుకు
తోడ్పడుతాయి. భూగృహాదులలో మార్పులు చేర్పులు చేస్తారు. అక్రమ వ్యాపారంలో
కష్టాలు తప్పవు. స్టాకిస్టులు, షేర్ల వ్యాపారులకు విశేషంగా కలిసి వస్తుంది. సినిమా, చిరు
వ్యాపార రంగంలోని వారికి కష్టం మీద పురోభివృద్ధి కనిపిస్తుంది.
రసాయనాలు,కలప, అపరాలు, వస్త్రములు, రసాయనాల వ్యాపారులకు 1,2,4,6,11
మాసములు విశేషలాభములు తెచ్చిపెడతాయి. వ్యవసాయం, కాంట్రాక్టులు, కలప, అపరాలు
ఫ్యాన్సీ రంగాలవారికి మిశ్రమ ఫలితాలుంటాయి. రాజకీయ రంగాల వారికి అంత అనుకూల
సమయం కాదు. కుజదోషం అధికంగా ఉన్నా, గురుసంచార ప్రభావంతో ప్రమాదాలు కొంత
వరకు నివృత్తి అవుతాయి. విద్యార్థులు సత్ఫలితాల కోసం అధికంగా శ్రమించాలి. సినీ
కళాకారులు, వృత్తి విద్యా నిపుణులకు ఊహించని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, షేర్ల వ్యాపారులకు ఆర్ధిక ఒడిదుడుకులు తప్పకపోవచ్చు.
విశాఖవారు పగడం, పుష్యరాగం, అనూరాధవారు కనక పుష్యరాగం, కెంపు ధరించుట
అదృష్టప్రదం. నవగ్రజపశాంతులు, దుర్గా, చండీ పారాయణం, రుద్రాభిషేకం, శివదర్శనం చేస్తే
విశేష శాంతి, మంగళ, గురువార నియమాలు యోగదాయకం. ఈ రాశివారికి అదృష్ట
సంఖ్యలు 1,2,3,9 ఆది, సోమ, గురువారాలు యోగప్రదం.
No comments:
Post a Comment