Monday, March 19, 2007

త్రిదోషహరమైన ఉగాది పచ్చడి

  
                                           


ఆయుర్వేద వైద్య శాస్త్రం ప్రకారం వాతం , పిత్తం, కఫం అనే త్రిదోషాలు సమస్తితిలో ఉన్నప్పుడే


మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఈ మూడు దోషాలు ప్రకోపించకుండా తెలుగువారి నూతన


సంవత్సర ఉగాది పచ్చడి కాపాడుతుంది. శరీరంలోని ప్రతి జీవకణాన్ని ఉత్తేజపరుస్తుంది.


ఈ పండగలోని గమనించదగిన విశేషం ఏమిటంటే ఉగాది పచ్చడి తయారీకి హానికర కృత్రిమ


రసాయనిక పదార్థాలు సరుకులు అవసరం లేదు.


 


 


చింతపండు


 


చింతపండులో కాల్షియం, భాస్వరం, ఇనుము, కెరోటిన్, రిబోఫ్లెవిన్, నియాసిన్, విటమిన్ సి


పుష్కలంగా ఉన్నాయి. దీనిలో ' ఇన్‍వర్ట్అనే పంచదార, పెక్టిన్ అనే రసాయనం, టార్టారిక్


 ఆమ్లం వున్నాయి.


చింతపండు పచ్చిపులుసు జీర్ణశక్తిని పెంచుతుంది. కడుపుబ్బరం తగ్గిస్తుంది. చల్ల


దనాన్నిస్తుంది. యాంటిసెప్టిక్‍గా పని చేస్తుంది.


ఒక కప్పు నీళ్ళలో కొద్దిగా చింతపండు వేసి , బాగా మరగనిచ్చి,  కొద్దిగా నెయ్యి, అర


చెంచాడు మిరియాలపొడి వేసి తాగితే జలుబు త్వరగా  తగ్గిపోతుంది.


 


 


వేపాకులు


 


 


వేపచెట్టుని ఎయిర్ ప్యూరిఫయ్యర్గా శాస్త్రవేత్తలు చెబుతారు. వేపాకులలో ఉండే


నింబిడిన్‍లో ప్రధానంగా సల్ఫర్ (గంధకం) ఉంటుంది. శ్వాస కోశాలలో పేరుకు


పోయిన కఫాన్ని తొలగిస్తుంది


వేపాకు మూత్రం సాఫిఇగా జారీ అయేట్టు చేస్తుంది. క్రిమికీటక సంహారక గుణం ఉంది.


ఒక గుప్పెడు వేపాకులు రెండు కప్పుల నీళ్ళలో వేసి మరిగించి ఆ డికాక్షన్ (కషాయం)


 తాగితే మలేరియా జ్వరం తగ్గుతుంది.


 వేపాకులు మెత్తగా నూరి ఆ ముద్దను శరీరానికి పూసుకుంటే చర్మవ్యాధులు,


పొక్కులు, దద్దుర్లు తగ్గుతాయి. గాయాలు త్వరగా మానుతాయి. అమ్మవారు వచ్చిన


వారి పక్కలమీద వేపాకులు వేయటంలో గల అంతరార్థం ఇదే!


వేపాకు కషాయం తలకు తాస్తే పేలు చచ్చిపోతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది.


 


వేపపూలు


 


వేపపువ్వుల రుచి చేదుగా ఉంటుంది. వీటిల్లో ఉండే నూనె పదార్థానికి నాలికకు


కాస్తంత దురద పుట్టించే గుణం వుంటుంది. వేపపువ్వు మొగ్గలలో నింబోస్టెరాల్


అనే గ్లూకోసైడ్, నింబో స్టెరాల్ సింటెసెటిన్ అనే ఆవిరయ్యే నూనె , కాస్తంత కొవ్వు


పదార్థాలు వుంటాయి. వేపపూలకు వేపాకులకున్నన్ని ఔషధగుణాలన్నీ ఉన్నాయి.


 


మామిడికాయ


 


పచ్చిమామిడికాయలో పిండిపదార్థాలు ఎక్కువ. టెంకపట్టని మామిడి పిందెలలో


పెక్టిన్" అనే రసాయనం పుష్కలంగా ఉంటుంది. మామిడికాయలలో కాల్షియం,


భాస్వరం, ఇనుము, విటమిన్ సి, విటమిన్ బి 1, విటమిన్ బి 2, నియాసిస్


ఉంటాయి. టార్టారిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లం స్వల్పంగా సిట్రిక్ ఆమ్లం ఉంటాయి.


పచ్చి మామిడికయ ముక్కలు, ఉప్పులో అద్దుకుని తింటం వల్ల దాహం తీరుతుంది.


 వేసవిలో చెమట ద్వారా పోయిన సోడియం క్లోరైడ్, తిరిగి శరీరంలోకి చేరుతుంది.


పచ్చిమామిడికాయల రసం తాగటం వలన వేసవికాలంలో వచ్చే నీళ్ళ విరోచనాలు,


 మూలశంక వ్యాధి, ఉదయంపూట కడుపులో వికారం, ఆకలి లేకపోవటం, మల


బద్దకం వంటి అస్వస్థతలు తగ్గుతాయి.


రెండు మూడు పచ్చి మామిడికాయ ముక్కలు తినడం వలన రక్తనాళాలు వ్యాకోచ


శక్తిని పొందుతాయి.క్షయ, పాండురోగం వంటి రుగ్మతలు దరికి రావు.


 


 


కొత్త బెల్లం


 


కొత్త బెల్లం (ఇక్షుసార) జఠరదీప్తినిస్తుంది. అంటే ఆకలి బాగా వేస్తుంది. నీరసం తగ్గిస్తుంది.


దీనిలో కాల్షియం, భాస్వరం, ఇనుము పుష్కలంగా వుంటాయి.


 


 


మంగళప్రదమైన మామిడి ఆకులు


 


 


అన్ని శుభకార్యాలకు మామిడి ఆకులతో మంగళతోరణాలు కడతాం. మామిడి ఆకులకు


కూడా ఔషధ గుణాలు వున్నాయి.


గుప్పెడు లేతమామిడి ఆకులు రాత్రిపూట ఒక గ్లాసు నీళ్ళలో నానేసి ఉదయాన్నే నీళ్ళలో


ఆకుల్ని బాగా పిసికి, ఆ రసాన్ని తాగడం వలన తొలి దశలో ఉన్న చక్కెర వ్యాధిని


నియంత్రించవచ్చు.


లేత మామిడాకుల్ని నీడలో ఎండబెట్టుకుని పొడి చేసి,  ప్రతిరోజు ఉదయం, సాయంత్రం


ఒక చెంచాడు పొడి, మంచినీళ్ళతో సేవిస్తే చక్కెరవ్యాధి అదుపులో ఉంటుంది.


మామిడాకుల కషాయం పుక్కిటపడితే దంతరోగాలు, చిగుళ్ళవాపు, నొప్పులు, నోటి


పూత తగ్గుతాయి.


మామిడి పుల్లతో పళ్ళు తోముకుంటే  శుభ్రంగా ఉంటుంది. దుర్గంధం పోతుంది.

No comments:

Post a Comment

test

Loading...