Monday, March 19, 2007

వసంతాగమ శుభవేళ






ఉగాది అంటే యుగ+ఆది అంటే యుగాదికి ఆది అయిన రోజు అని అర్ధం. బ్రహ్మదేవుడు చైత్ర



శుద్ధ పాడ్యమినాడు ఈ సృష్టిని ఆరంభించడం వల్ల ఉగాది అయ్యింది. పద్నాలుగేళ్ళ వనవాసం



పూర్తిచేసుకున్న రాముడు సీతాదేవితో కలిసి తిరిగి అయోధ్యలో అడుగుపెట్టిన శుభదినం కూడా



 ఇదే. ద్వాపర యుగాన శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిన రోజు కూడా ఈ చైత్ర శుద్ధ



పాడ్యమినాడే అని పురాణాలు చెబుతున్నాయి. ఇన్ని శుభాలు చోటు చేసుకున్న ఈ శుభ



దినాన్ని చైత్ర శుద్ధ ప్రతిపద" అని కూడా చెబుతారు.



వాతావరణంలో, సంధ్యాసమయంలో ఆహ్లాదకరంగా వుంటుంది. సంవత్సరంలో వచ్చే 

మొదటి  ఋతువుగా వసంతాన్ని అభివర్ణించారు. కాలకొలమానంలో మాసం, తిథి

ప్రధాన పాత్రలు వహిస్తాయి.



 

కాబట్టి, చైత్ర శుద్ధ పాడ్యమి నూతన సంవత్సర తొలిశుభ దినంగా ప్రాచుర్యంలోకి

వచ్చింది. ఉగాది రోజున మంగళప్రదమైన మామిడి తోరణాలతో గడపలని అలంకరిస్తారు.

 కారణం ఏమంటే శివపార్వతుల ఇష్టపుత్రులయిన కుమారస్వామి, గణపతులకు

మామిడి ఫలాలంటే చాలా ప్రియం. అందుకని మామిడి పంట బాగా పండాలంటే

మామిడాకుల తోరణం కట్టాలంటారు.

పుడమితల్లికి  ప్రకృతి చేసే పుట్టినరోజు సంరంభం.. ఈ పులకింతల వసంతం !


చెట్లన్నీ ఎర్ర చివుళ్ళు తొడుక్కుని కొత్త ఆశల పందిళ్ళేసుకున్న చందాన అగుపిస్తాయి.




మొక్కలన్నీ సరిక్కొత్త జీవంతో కళకళలాడుతుంటాయి.కాలమంతా రమనీయ దృశ్య




కావ్యంలాకళ్ళ ముందు కదలాడే ఒకే ఒక   ఋతువు ..వసంతఋతువు.







 


ఉగాది పచ్చడి ఆరగించడంవల్ల ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఇందులో తీపి, పులుపు, చేదు




వగరు,కారం. అన్ని రుచులు కలగలిసి ఉంటాయి.ఈ ఉగాది పచ్చడిని కొందరు గట్టి




లేపనంగా చేసుకుంటే మరి కొందరు పలుచని ద్రవంలా చేసుకుని కొత్తకుండలో నింపి,




పూజానంతరం గ్లాసులో పోసుకుని సేవిస్తారు.


 


ఉగాది పండగతో మొదలయ్యే కొత్త సంవత్సరం ఏడాదంతా శోభాయమానంగా గడవాలని,




చేసే వ్యాపారాలన్నీ అభివృద్ధి చెందాలని, ధనాదాయాలు పుష్కలంగా లభించాలని




ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాభివృద్ధి కలగాలని పూజలు, హోమాలు నిర్వహిస్తారు. రైతులు




కూడా ఈ పండగ రోజునే ఏరువాక సాగిస్తారు..వసంతం వస్తూనే తన వెంట సంతోషాలను




 మోసుకొస్తుంది.




 


ఈ పండగకు బొబ్బట్లు , పూర్ణాలు, పులిహోర, ప్రత్యేక మైన కూరలు మొదలగునవి




చేసుకుంటారుసంతోషంగా పూజలు చేసుకుని, సుష్టిగా పంచ భక్ష పరమాన్నాలతొ



భోజనం చేస్తారు

ఇక పంచాంగ శ్రవణం లేకుండా పండుగ పూర్తికాదు.

త్రిదోషహరమైన ఉగాది పచ్చడి

  
                                           


ఆయుర్వేద వైద్య శాస్త్రం ప్రకారం వాతం , పిత్తం, కఫం అనే త్రిదోషాలు సమస్తితిలో ఉన్నప్పుడే


మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఈ మూడు దోషాలు ప్రకోపించకుండా తెలుగువారి నూతన


సంవత్సర ఉగాది పచ్చడి కాపాడుతుంది. శరీరంలోని ప్రతి జీవకణాన్ని ఉత్తేజపరుస్తుంది.


ఈ పండగలోని గమనించదగిన విశేషం ఏమిటంటే ఉగాది పచ్చడి తయారీకి హానికర కృత్రిమ


రసాయనిక పదార్థాలు సరుకులు అవసరం లేదు.


 


 


చింతపండు


 


చింతపండులో కాల్షియం, భాస్వరం, ఇనుము, కెరోటిన్, రిబోఫ్లెవిన్, నియాసిన్, విటమిన్ సి


పుష్కలంగా ఉన్నాయి. దీనిలో ' ఇన్‍వర్ట్అనే పంచదార, పెక్టిన్ అనే రసాయనం, టార్టారిక్


 ఆమ్లం వున్నాయి.


చింతపండు పచ్చిపులుసు జీర్ణశక్తిని పెంచుతుంది. కడుపుబ్బరం తగ్గిస్తుంది. చల్ల


దనాన్నిస్తుంది. యాంటిసెప్టిక్‍గా పని చేస్తుంది.


ఒక కప్పు నీళ్ళలో కొద్దిగా చింతపండు వేసి , బాగా మరగనిచ్చి,  కొద్దిగా నెయ్యి, అర


చెంచాడు మిరియాలపొడి వేసి తాగితే జలుబు త్వరగా  తగ్గిపోతుంది.


 


 


వేపాకులు


 


 


వేపచెట్టుని ఎయిర్ ప్యూరిఫయ్యర్గా శాస్త్రవేత్తలు చెబుతారు. వేపాకులలో ఉండే


నింబిడిన్‍లో ప్రధానంగా సల్ఫర్ (గంధకం) ఉంటుంది. శ్వాస కోశాలలో పేరుకు


పోయిన కఫాన్ని తొలగిస్తుంది


వేపాకు మూత్రం సాఫిఇగా జారీ అయేట్టు చేస్తుంది. క్రిమికీటక సంహారక గుణం ఉంది.


ఒక గుప్పెడు వేపాకులు రెండు కప్పుల నీళ్ళలో వేసి మరిగించి ఆ డికాక్షన్ (కషాయం)


 తాగితే మలేరియా జ్వరం తగ్గుతుంది.


 వేపాకులు మెత్తగా నూరి ఆ ముద్దను శరీరానికి పూసుకుంటే చర్మవ్యాధులు,


పొక్కులు, దద్దుర్లు తగ్గుతాయి. గాయాలు త్వరగా మానుతాయి. అమ్మవారు వచ్చిన


వారి పక్కలమీద వేపాకులు వేయటంలో గల అంతరార్థం ఇదే!


వేపాకు కషాయం తలకు తాస్తే పేలు చచ్చిపోతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది.


 


వేపపూలు


 


వేపపువ్వుల రుచి చేదుగా ఉంటుంది. వీటిల్లో ఉండే నూనె పదార్థానికి నాలికకు


కాస్తంత దురద పుట్టించే గుణం వుంటుంది. వేపపువ్వు మొగ్గలలో నింబోస్టెరాల్


అనే గ్లూకోసైడ్, నింబో స్టెరాల్ సింటెసెటిన్ అనే ఆవిరయ్యే నూనె , కాస్తంత కొవ్వు


పదార్థాలు వుంటాయి. వేపపూలకు వేపాకులకున్నన్ని ఔషధగుణాలన్నీ ఉన్నాయి.


 


మామిడికాయ


 


పచ్చిమామిడికాయలో పిండిపదార్థాలు ఎక్కువ. టెంకపట్టని మామిడి పిందెలలో


పెక్టిన్" అనే రసాయనం పుష్కలంగా ఉంటుంది. మామిడికాయలలో కాల్షియం,


భాస్వరం, ఇనుము, విటమిన్ సి, విటమిన్ బి 1, విటమిన్ బి 2, నియాసిస్


ఉంటాయి. టార్టారిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లం స్వల్పంగా సిట్రిక్ ఆమ్లం ఉంటాయి.


పచ్చి మామిడికయ ముక్కలు, ఉప్పులో అద్దుకుని తింటం వల్ల దాహం తీరుతుంది.


 వేసవిలో చెమట ద్వారా పోయిన సోడియం క్లోరైడ్, తిరిగి శరీరంలోకి చేరుతుంది.


పచ్చిమామిడికాయల రసం తాగటం వలన వేసవికాలంలో వచ్చే నీళ్ళ విరోచనాలు,


 మూలశంక వ్యాధి, ఉదయంపూట కడుపులో వికారం, ఆకలి లేకపోవటం, మల


బద్దకం వంటి అస్వస్థతలు తగ్గుతాయి.


రెండు మూడు పచ్చి మామిడికాయ ముక్కలు తినడం వలన రక్తనాళాలు వ్యాకోచ


శక్తిని పొందుతాయి.క్షయ, పాండురోగం వంటి రుగ్మతలు దరికి రావు.


 


 


కొత్త బెల్లం


 


కొత్త బెల్లం (ఇక్షుసార) జఠరదీప్తినిస్తుంది. అంటే ఆకలి బాగా వేస్తుంది. నీరసం తగ్గిస్తుంది.


దీనిలో కాల్షియం, భాస్వరం, ఇనుము పుష్కలంగా వుంటాయి.


 


 


మంగళప్రదమైన మామిడి ఆకులు


 


 


అన్ని శుభకార్యాలకు మామిడి ఆకులతో మంగళతోరణాలు కడతాం. మామిడి ఆకులకు


కూడా ఔషధ గుణాలు వున్నాయి.


గుప్పెడు లేతమామిడి ఆకులు రాత్రిపూట ఒక గ్లాసు నీళ్ళలో నానేసి ఉదయాన్నే నీళ్ళలో


ఆకుల్ని బాగా పిసికి, ఆ రసాన్ని తాగడం వలన తొలి దశలో ఉన్న చక్కెర వ్యాధిని


నియంత్రించవచ్చు.


లేత మామిడాకుల్ని నీడలో ఎండబెట్టుకుని పొడి చేసి,  ప్రతిరోజు ఉదయం, సాయంత్రం


ఒక చెంచాడు పొడి, మంచినీళ్ళతో సేవిస్తే చక్కెరవ్యాధి అదుపులో ఉంటుంది.


మామిడాకుల కషాయం పుక్కిటపడితే దంతరోగాలు, చిగుళ్ళవాపు, నొప్పులు, నోటి


పూత తగ్గుతాయి.


మామిడి పుల్లతో పళ్ళు తోముకుంటే  శుభ్రంగా ఉంటుంది. దుర్గంధం పోతుంది.

Sunday, March 18, 2007

తుల

 

     (చిత్త 3,4 స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


 


అదాయం-5 వ్యయం-8 రాజపూజ్యం-7 అవమానం-1


 


 


రాశివారికి గురుడు నవంబరు 21 వరకు రెండింట సువర్ణమూర్తి. తదుపరి సంవత్సరమంతా


 మూడింట తామ్రమూర్తి. శని జులై 15 వరకు పదింట, తదుపరి పదకొండింట రజితమూర్తులు.


  రాశివారికి నవంబరు వరకు యోగప్రదం. ఉత్సాహప్రదం. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది.


ఆరోగ్యం పెంపొందుతుంది. సంకల్పం ఫలిస్తుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. బంధు


మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. కొంతకాలంగా వృత్తి వ్యాపారాలలో ఉన్న స్తబ్దత తొలగి


పోతుంది. నూతన వ్యాపారాలు లాభిస్తాయి. సమయోచితమైన ఆలోచనలు స్పురిస్తాయి.


స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.





దశమ శని అంతగా శుభప్రదం కాకపోయినప్పటికీ రాశిరీత్యా పూర్ణయోగప్రదుడు కాబట్టి


 శుభఫలితాలు కనిపిస్తాయి. వాక్చాతుర్యంతో,నాయకత్వ లక్షణాల్తో ముందంజ వేస్తారు.


సంఘంలో గౌరవం పెరుగుతుంది. హుందాగా వ్యవహరించి సత్ఫలితాలు సాధిస్తారు.


 విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. జులై తరువాత లాభమందు శని పూర్తి


యోగప్రదుడు అవుతాడు. ఫలితంగా అన్ని రంగాల్లో పురోభివృద్ధి కనిపిస్తుంది. గౌరవ


పురస్కారాలు లభిస్తాయి. పాత బాకిలు వసూలవుతాయి. ఆర్ధిక వ్యవహారాలు ఫలిస్తాయి.


 కాంట్రాక్టరులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మొదట కొన్ని చిక్కులు ఎదురైన చివరకు


లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయ రంగంలోని వారికి పదోన్నతి లభిస్తుంది. వ్యాపార


రంగంలోని వారు రాణిస్తారు. వ్యవసాయ ఉత్పత్తుల  స్టాకిస్టులకు,కోళ్ళు, మత్స్య


వ్యాపారులకు స్వల్ప లాభం, షేర్ల లావాదేవీలు అంతగా లాభించకపోవచ్చు. సోదర,


బంధువర్గం నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది.


 


వస్త్రాలు, ఫైనాన్స్, రసాయనిక వ్యాపారులకు 1,2,3,5,6,7,10 మాసాలు యోగప్రదం.


మెట్ట వ్యవసాయం వారికి లాభదాయకం.  మాసాల్లో విద్యార్థులకు పురోభివృద్ధి.


నూతన విద్యా ఉద్యోగాలకు అనుకూలం. సంవత్సరం పూర్వార్ధంలో భాషా పండితులు,


కళా శాస్త్రకోవిదులకు ఆటంకాలు ఎదురైనా చివరకు పురోగతి సాధిస్తారు. సైన్సు, అర్ధ


శాస్త్ర విద్యార్ధులు, రంగాల ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు, ఉద్యోగులకు బదిలీల


బెడద తప్పకపోవచ్చు. ఉన్నతాధికారుల సహకారంతో ప్రమోషన్లు సాధిస్తారు. సినీ,


 వైద్య, వ్యాపార రంగాల వారికి సంవత్సరంలోని మొదటి ఆరు మాసాలు ప్రోత్సాహకరంగా


 ఉంటుంది.


 


చిత్తవారు పగడం, స్వాతివారు గోమేధికం,కెంపు  విశాఖవారు పగడం,పుష్యరాగాభరణాలు


ధరించిన యోగప్రదం. రాశివారికి అదృష్ట సంఖ్యలు 2,6,7,9. సోమ శుక్ర, శనివారములు


యోగదాయకం. మొత్తం మీద వీరు కుజ, రాహు గ్రహాలకు జపశాంతులు, మంగళవార


నియమాలు, లక్ష్మీ, గణేశ, విష్ణు సహస్ర, సాయి శివ ఆరాధనలు యోగప్రదాలు. స్త్రీలు


మంగళ, శుక్ర శనివారాలు నవగ్రహ స్తోత్ర, శివ, ఆంజనేయ పూజలు జరుపుకుంటే ఇష్ట 


కార్యసిద్ధి, కుటుంబ సభ్యులకు సౌఖ్యం కలుగుతుంది.

వృశ్చికం


              (విశాఖ 4, అనూరాధ, జ్యేష్టా)


 


ఆదాయం-11 వ్యయం-14 రాజపూజ్యం-3 అవమానం-1


 


 


రాశివారికి గురువు నవంబరు 21 వరకు జన్మమందు, తదుపరి సంవత్సరమంతా రెండింట


 రజితమూర్తి. శని జులై 15 వరకు తొమ్మిదింట తదుపరి సంవత్సరమంతా పదింట రజితమూర్తి.


రాహువు నాలుగింట, కేతువు పదింట లోహమూర్తులు. రాశివారు వ్యవహారదక్షులు.


స్వలాభం, సంఘసేవాతత్పరత రెండూ వీరిలో కనిపిస్తాయి. నిదానంగా, నిగూఢంగా


వ్యవహరిస్తారు. వీరికి నవంబరు వరకూ గురుడు జన్మరాశిలో ఉన్నాడు. చతుర్ధ మందు


రాహువు, పదింట కేతువు మిశ్రమ యోగకారకులు కాబట్టి తరచు ప్రయాణం, ఇబ్బందులు,


 అనారోగ్యం, వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశాం ఉంది. పిక్కలు, నడుము,


కంఠానికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది జులై నుంచి సంవత్సరాంతం


వరకు కుజదోషం వల రుణబాధ అధికంగా ఉంటుంది. కోరికలు అదుపులో ఉంచుకోవాలి.


కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఊహించని సమస్యలు


ఎదురయ్యే సూచనలున్నాయి. చేపట్టిన ప్రతిపనిలో ఆటంకాలు తలెత్తడం వల్ల కార్యభారం


పెరుగుతుంది. శ్రమాధిక్యం స్వల్పలాభం కారణంగా నిరుత్సాహంగా ఉంటుంది. వ్యాపార


భాగస్వామ్యుల మధ్య కలతలు తలెత్తే సూచనలున్నాయి. అయినప్పటికీ నూతన


వ్యాపారాభివృద్ధికి అవకాశం ఉంది దీర్ఘకాలిక ప్రణాళికలు భవిష్యత్తులో సత్ఫలితానిచ్చేందుకు


తోడ్పడుతాయి. భూగృహాదులలో మార్పులు చేర్పులు చేస్తారు. అక్రమ వ్యాపారంలో


 కష్టాలు తప్పవు. స్టాకిస్టులు, షేర్ల వ్యాపారులకు విశేషంగా కలిసి వస్తుంది. సినిమా, చిరు


వ్యాపార రంగంలోని వారికి కష్టం మీద పురోభివృద్ధి కనిపిస్తుంది.


 


రసాయనాలు,కలప, అపరాలు, వస్త్రములు, రసాయనాల  వ్యాపారులకు 1,2,4,6,11


మాసములు విశేషలాభములు తెచ్చిపెడతాయి. వ్యవసాయం, కాంట్రాక్టులు, కలప, అపరాలు


ఫ్యాన్సీ రంగాలవారికి మిశ్రమ ఫలితాలుంటాయి. రాజకీయ రంగాల వారికి అంత అనుకూల


సమయం కాదు. కుజదోషం అధికంగా ఉన్నా, గురుసంచార ప్రభావంతో ప్రమాదాలు కొంత


వరకు నివృత్తి అవుతాయి. విద్యార్థులు సత్ఫలితాల కోసం అధికంగా శ్రమించాలి. సినీ


కళాకారులు, వృత్తి విద్యా నిపుణులకు ఊహించని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.


పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, షేర్ల వ్యాపారులకు ఆర్ధిక ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. 


 


విశాఖవారు పగడం, పుష్యరాగం, అనూరాధవారు కనక పుష్యరాగం, కెంపు ధరించుట


అదృష్టప్రదం. నవగ్రజపశాంతులు, దుర్గా, చండీ పారాయణం, రుద్రాభిషేకం, శివదర్శనం చేస్తే


విశేష శాంతి, మంగళ, గురువార నియమాలు యోగదాయకం.  రాశివారికి అదృష్ట 


సంఖ్యలు 1,2,3,9 ఆది, సోమ, గురువారాలు యోగప్రదం.

ధనుస్సు


 


(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదము)


 


ఆదాయం-8 వ్యయం-5 రాజపూజ్యం-6 అవమానం-1


 


 


రాశివారికి గురుడు నవంబరు 21 వరకు పన్నెండింట  సువర్ణమూర్తి తదుపరి జన్మమందు


 లోహమూర్తి. జులై 15 వరకు శని, ఎనిమిదింట సువర్ణమూర్తి, తదుపరి తొమ్మిదింట 


లోహమూర్తి. రాహువు మూడింట, కేతువు తొమ్మిదింట తామ్ర మూర్తులు. పదిమందికి


ఉపయోగపడే పనులు చేపట్టడం,నాయకత్వం, దార్శనికత, సత్ప్రవర్తన రాశివారికి శ్రీరామరక్ష.


  ఏడాది వీరి గౌరవానికి సిరిసంపదలకు లోటురాదు. రాశివారికి గురుడు వ్యయంలో


ఉన్నాడు. అయితే మూర్తిమంతం ఫలితంగా చెడుచేయకుండా తటస్థంగా ఉంటాడు. మూడింట


 రాహు సంచారం లాభప్రదం. అయితే శని, కేతువుల సంచారం వల్ల అశాంతికి లోనవుతారు.


ఖర్చులు అధికం పెద్దలనుండి అసౌకర్యం కలుగుతుంది. అయినప్పటికి పట్టుదలతో లక్ష్యాలు


సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్ధిక రంగంలో పురోభివృద్ధి సాధిస్తారు


విద్యార్థులకు శుభప్రదం.


 


దీర్ఘకాలిక, భారీ పెట్టుబడుల విషయంలో ఆచితూచి ముందడుగు వేయాలి. ధాన్యం, పరిశ్రమలు,


అపరాల వ్యాపారులకు సంవత్సర ప్రారంభంలో కలిసి వస్తుంది. వ్యవసాయం, షేర్లు, ఉమ్మడి


 వ్యాపారాలకు అంతగా అనుకూలించదు. కాంట్రాక్టులు, షేర్ల లావాదేవీల వారికి లాభదాయకం.


కిరాణా, ఫైనాన్స్ తదితర వ్యాపారులకు 5,7,8,11,12 నెలలు విశేషంగా లాభిస్తాయి. స్వయం


వృత్తిదార్లకు, సినీ నటగాయకులకు, శాస్త్రకోవిదులకు లబ్దికన్నా గుర్తింపు మిన్న. సంఘ సేవకు


సమయం వెచ్చిస్తారు. విద్యార్థులకు ఆటంకాలు ఎదురైనా శ్రమతో సత్ఫలితాలు సాధిస్తారు.


మూల, పూర్వాషాఢవారు పచ్చ, ఉత్తరాషాఢవారు కెంపు ధరించుట మేలు. వీరికి అదృష్ట


సంఖ్యలు 1,2,3,4,5. ఆది, బుధ, గురువారాలు కలిసి వచ్చును రాశివారికి నిర్మాణములు


భవిష్యత్తులో యోగప్రదములు. శుభకార్యాలలో నిదానం పాటించాలి. సేవారంగంలో రాణిస్తారు.


ఇతరులకు అదర్శంగా నిలుస్తారు.


 


చంద్ర, కుజ, గురు,కేతువులకు శాంతులు, సోమ, మంగళవార  నియమాలు, శివాలయ


సందర్శనం, సాయి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం అత్యంత యోగదాయకం. మంగళ,


గురువారం నియమాలు పాటించడం ద్వారా కుటుంబం నందు ఆరోగ్య సౌఖ్యం వృద్ధి


చెందుతుంది. వ్యవహార నియమం పాటించాలి. శుభ కార్య నిర్వహణలు కలిసి వస్తాయి.


మానసిక శాంతి కలుగుతుంది. 

Friday, March 9, 2007

S.M.S గోల

కొన్ని నెలలుగా టివీలలో, రేడియోలో ఆకర్షణీయమైన బహుమతులు చూపించి వాటి

అసలు ధరకంటే తక్కువ ధరకు వేలం పాడి గెలుచుకోవాలంటున్నారు. బానే ఉంది.

మామూలుగా 1 - 2 పైసలు పలికే sms దీనికి మాత్రం ఏకంగా 10రూపాయలు బొక్క. 

 దీని కిటుకు కొంచెం కొంచెం అర్ధమయ్యింది. మనలను వెధవలను చేస్తున్నారని.

లక్షలుగా వచ్చే sms ల డబ్బుతోనే ఆ బహుమతులు ఇస్తున్నారు. ప్రకటనలు,

అందులో నటించిన ప్రముఖులకు ఇచ్చే పారితోషికాలు అన్నీ మనమే ఇస్తున్నాము. 

మనకు కుచ్చుటోపి పెట్టి మనకెంతిస్తునారు వాళ్ళెంత మెక్కుతున్నారు. కాస్త

వివరిస్తారా ఎవరైనా!.

Monday, March 5, 2007

5 0 0

నేను మొట్టమొదటగా ఈ బ్లాగును ప్రారంభించింది 14.7.06 రోజు.ఈ రోజుతో నా బ్లాగులన్నింటి

టపాలన్నీ కలిపి 500 అయ్యింది.ఆరు నెలల క్రింద సరదాగా ప్రారంభించిన ఈ బ్లాగులో ఈ రోజు

 100 టపాలు పూర్తి చేసుకుంది.అలాగే షడ్రుచులులో 200 టపాలు,అన్నపూర్ణలో 100 టపాలు,

గీతలహరిలో 100 టపాలు ఒకేసారి ఈరోజు పూర్తి చేసుకున్నాయి. ఇదంతా మీ సహకారముతో

సాధ్యమైంది.ఈ సంతోషంలో ఎం చెప్పాలో తెలియటంలేదు.అందరు బ్లాగు మిత్రులకు మనఃపూర్వక

కృతజ్ఞతలు. ఈ ప్రయాణం ఇలాగే సాగిపోవాలని ఆశిస్తున్నాను.

*
*
*
*
*
జ్యోతి ...  http://vjyothi.wordpress.com.....100

షడ్రుచులు ...  http://shadruchulu.blogspot.com.....200

అన్నపూర్ణ ....  http://annapoorna-jyothi.blogspot.com...100

గీతలహరి. .. http://geetalahari.blogspot.com.....100  

*
*
*
*









              జ్యోతి

test

Loading...