Monday, February 5, 2007
అదే మరి మండుద్ది.
ఎదో బొమ్మ బావుంది కదా అని చూడమని చెప్తే పెళ్ళాల మీద అన్ని జోకులా.పెళ్ళాలేమో తమ మొగుళ్ళకోసం ఉపవాసాలు,నోములు,వ్రతాలు చేస్తుంటే మీ మొగుళ్ళేమో తమ పెళ్ళాల వల్ల కష్టపడిపోతున్నట్టు బిల్డప్పులు.తన వాళ్ళందరిని వదలి మీ దగ్గరకొస్తుందే. పెళ్ళాలేమో తమ పుట్టింటి వారితో,ఇరుగుపొరుగు,ఊర్లో వాళ్ళతో మొగుడు ఎలాంటివాడైనా(చాలా విశేషణాలు ఉన్నాయి) అవి చెప్పకుండా అన్ని గొప్పలు చెప్పి మా ఆయన బంగారం అని చెప్పుకుంటారు. మీరేమో మా ఆవిడా ఇంతే మీ ఆవిడా ఇంతేనా అని ఓ తెగ బాధపడిపోతుంటారు.ఇది న్యాయమా.మొగుళ్ళు చేసేది ఆఫీసు పని మాత్రమే. కాని పెళ్ళాలు మొగుళ్ళని పిల్లలను ఇల్లుని అన్నింటినీ చూసుకోవాలి కదా మీరు సాయం చేస్తే ఏంటంటా.ఎప్పుడన్న చేస్తే ఘనకార్యం చేసినట్టు ఫీలింగు.పైగా పెళ్ళి చేసుకున్న వాళ్ళూ ఎదో కష్టాలు పడిపోతున్నట్టు పెళ్ళి కాని బ్రహ్మచారులను హెచ్చరించడం. మొగుళ్ళందరు ఇలా పెళ్ళాల మీద చాడీలు చెప్ప్పుకుంటారే. మీ పెళ్ళాలు ఎప్పుడన్న మీ గురించి ఇల చెప్పుకుంటారా కనుక్కోండి. అసలైతే లేనివి కూడా చెప్పి మా ఆయన చాల గొప్ప వాడు అని గర్వపడతారు.చివరిగా అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళి కాక ముందు ఒకేలా పెరుగుతారు కదా చదువు, పెంపకం,స్నేహితులు,సరదాలు అన్నీ.మరి మీ మగాళ్ళె తమ స్వాతంత్ర్యం ఎదో పోయినట్టు చెప్పుకుంటారు. ఆడాళ్ళు పెళ్ళి కాగానే మీ పేరుతో కలిపి తమ పేరుని పిల్చుకోడం గర్వంగా ఫీల్ అవుతారు కదా. మరి మగాళ్ళు కూడా అలా చేయగలరా. ఒకవేళ ఎవరైన ఫలాన ఆవిడ మొగుడంటే మాత్రం ఉడుక్కుంటారు.
ప్రేమికుల రోజు సంధర్భంగా ఈ విధంగా సరదాగా చెప్పాను. ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దు.
Subscribe to:
Post Comments (Atom)
test
Loading...
No comments:
Post a Comment