Monday, February 5, 2007
అల్లరి విడ్డూరాలు
* మర్యాదగా నా పుట్తిన రోజుకి పట్టుచీర కొనిపెడతారా లేకపోతే గృహహింస చట్టం కింద కేసు పెట్టమంటారా అని భర్తను బెదిరించడం.
* ఎల్.కె.జి చదువుతున్న తమ అబ్బాయికి ఫస్ట్ ర్యాంకు వచ్చిందని స్వీట్లు పంచిపెట్టడం.
* పెళ్ళాం మాటకు ఎదురుచేప్పే ధైర్యం లేకపోయినా అదే పెళ్ళాముతో నూరేళ్ళు కాపురం చేసే దమ్ముండటం
* "ఐస్ క్రీం " పార్లర్ " కి వెళ్ళి లావెక్కి, "బ్యూటీ పార్లర్" కెళ్ళి లావు తగ్గడానికి ప్రయత్నించడం.
* భర్తను బార్య కట్టేస్తే, భార్యను టి.వి కట్టేయడం.
* గన్మెన్ రక్షణలో జీవిస్తున్న మంత్రులు దేశ రక్షణ గురించి మాట్లాడటం.
* జీతం-జీవితం రెండూ ఎంత పెరిగినా, ఇంకా పెరగాలని మనిషి ఆశించడం.
* "చీ ! పాడు సీరియల్ ఎంత సాగదీస్తున్నారో " అని తిట్టుకుంటూనే మిస్సవకుండా చూస్తూనే ఉండడం.
* పెళ్ళికాక ముందు బావిలోని ' కప్ప 'లాగా వుండే అమ్మాయి, పెళ్ళయ్యాక భర్త నోటికి 'తాళం కప్ప ' కావడం.
Subscribe to:
Post Comments (Atom)
test
Loading...
No comments:
Post a Comment