Monday, February 26, 2007

రజతోత్సవ సంవత్సరం



అందరికీ నమస్కారం. ఈ రోజు మా 24 వ పెళ్ళి రోజు. రజతోత్సవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాను. అందరిలాగా పాతికేళ్ళు పూర్తయ్యాక ఒక్క రోజు సంబరాలు చేసుకునే బదులు  సంవత్సరం మొత్తం చేసుకుంటే ఎలా ఉంటుందని నాకు కలిగిన ఒక తిక్క ఆలోచన. కాని నేను చెప్పినవన్నీ నిజాలేనండి. గ్యాస్ కాదు.

Friday, February 16, 2007

శుభాకాంక్షలు

mysorepak-1.jpgjaangri.jpgariselu.jpgladdu.jpgkaju-sweet.jpgjilebi4.jpggulab.jpgbobbatlu.jpg
బ్లాగరుల పోటీలో నామినేట్ చేయబడిన మన తెలుగు బ్లాగరులందరికి

శుభాకాంక్షలు.ఇందులో ఎవరు గెలవకుండా అందరికీ కలిపి బహుమతి

 పంచేస్తే బావుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే వీరందరు బ్లాగుల

 పరంగా మహారథులే.ఎవరూ ఎక్కువ కాదు ఎవరూ తక్కువ కాదు.

అందరూ సమానమే. ఈ శుభసంధర్భంలో వీరందరికి తియ్యని తాయిలం ............

            

Monday, February 5, 2007

అదే మరి మండుద్ది.


ఎదో బొమ్మ బావుంది కదా అని చూడమని చెప్తే పెళ్ళాల మీద అన్ని జోకులా.పెళ్ళాలేమో తమ మొగుళ్ళకోసం ఉపవాసాలు,నోములు,వ్రతాలు చేస్తుంటే మీ మొగుళ్ళేమో తమ పెళ్ళాల వల్ల కష్టపడిపోతున్నట్టు బిల్డప్పులు.తన వాళ్ళందరిని వదలి మీ దగ్గరకొస్తుందే. పెళ్ళాలేమో తమ పుట్టింటి వారితో,ఇరుగుపొరుగు,ఊర్లో వాళ్ళతో మొగుడు  ఎలాంటివాడైనా(చాలా విశేషణాలు ఉన్నాయి) అవి చెప్పకుండా అన్ని గొప్పలు చెప్పి మా ఆయన బంగారం అని చెప్పుకుంటారు. మీరేమో మా ఆవిడా ఇంతే మీ ఆవిడా ఇంతేనా అని ఓ తెగ బాధపడిపోతుంటారు.ఇది న్యాయమా.మొగుళ్ళు చేసేది ఆఫీసు పని మాత్రమే. కాని పెళ్ళాలు మొగుళ్ళని పిల్లలను ఇల్లుని అన్నింటినీ చూసుకోవాలి కదా మీరు సాయం చేస్తే ఏంటంటా.ఎప్పుడన్న చేస్తే ఘనకార్యం చేసినట్టు ఫీలింగు.పైగా పెళ్ళి చేసుకున్న వాళ్ళూ ఎదో కష్టాలు పడిపోతున్నట్టు పెళ్ళి కాని బ్రహ్మచారులను హెచ్చరించడం. మొగుళ్ళందరు ఇలా పెళ్ళాల మీద చాడీలు చెప్ప్పుకుంటారే. మీ పెళ్ళాలు ఎప్పుడన్న మీ గురించి ఇల చెప్పుకుంటారా కనుక్కోండి. అసలైతే లేనివి కూడా చెప్పి మా ఆయన చాల గొప్ప వాడు అని గర్వపడతారు.చివరిగా అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళి కాక ముందు ఒకేలా పెరుగుతారు కదా చదువు, పెంపకం,స్నేహితులు,సరదాలు అన్నీ.మరి మీ మగాళ్ళె తమ స్వాతంత్ర్యం ఎదో పోయినట్టు చెప్పుకుంటారు. ఆడాళ్ళు పెళ్ళి కాగానే మీ పేరుతో కలిపి తమ పేరుని పిల్చుకోడం గర్వంగా ఫీల్ అవుతారు కదా. మరి మగాళ్ళు కూడా అలా చేయగలరా. ఒకవేళ ఎవరైన ఫలాన ఆవిడ మొగుడంటే మాత్రం ఉడుక్కుంటారు.
ప్రేమికుల రోజు సంధర్భంగా ఈ విధంగా సరదాగా చెప్పాను. ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దు.

చెప్పుకోండి చూద్దాం

noname.jpg

ఈ చిత్రంలో పది మంది జాతీయ నాయకుల చిత్రాలున్నాయి . కనుక్కోండి ఎవరెవరో?

అల్లరి విడ్డూరాలు


* మర్యాదగా నా పుట్తిన రోజుకి పట్టుచీర కొనిపెడతారా లేకపోతే గృహహింస చట్టం కింద కేసు పెట్టమంటారా అని భర్తను బెదిరించడం.

* ఎల్.కె.జి చదువుతున్న తమ అబ్బాయికి ఫస్ట్ ర్యాంకు వచ్చిందని స్వీట్లు పంచిపెట్టడం.

* పెళ్ళాం మాటకు ఎదురుచేప్పే ధైర్యం లేకపోయినా అదే పెళ్ళాముతో నూరేళ్ళు కాపురం చేసే దమ్ముండటం

* "ఐస్ క్రీం " పార్లర్ " కి వెళ్ళి లావెక్కి, "బ్యూటీ పార్లర్" కెళ్ళి  లావు తగ్గడానికి ప్రయత్నించడం.

* భర్తను బార్య కట్టేస్తే, భార్యను టి.వి కట్టేయడం.

* గన్మెన్ రక్షణలో జీవిస్తున్న మంత్రులు దేశ రక్షణ గురించి మాట్లాడటం.

* జీతం-జీవితం రెండూ ఎంత పెరిగినా, ఇంకా పెరగాలని మనిషి ఆశించడం.

* "చీ ! పాడు సీరియల్ ఎంత సాగదీస్తున్నారో " అని తిట్టుకుంటూనే మిస్సవకుండా చూస్తూనే ఉండడం.

* పెళ్ళికాక ముందు బావిలోని ' కప్ప 'లాగా వుండే అమ్మాయి, పెళ్ళయ్యాక భర్త నోటికి 'తాళం కప్ప ' కావడం.
 

Sunday, February 4, 2007

అనుబంధం

candle-roses.jpg

 ముందుగా.....

ఫిబ్రవరి ఐదున ఎనిమిదవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న డా.ఇస్మాయిల్ గారికి

ఫిబ్రవరి ఎనిమిదిన మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న వీవెన్ గారికి

ఫిబ్రవరి ఇరవై ఐదున వివాహం చేసుకోబోతున్న అనిల్ చీమలమర్రికి

ప్రత్యేక శుభాకాంక్షలు

--------------------------------------------------------------------------

పెళ్ళి ఉంగరం మన చేతి నాలుగో వేలికే ఎందుకు తొడుగుతారు.

తెలుసుకుందామా.ఇది పెళ్ళయినవాళ్ళకి,పెళ్ళికాబోయేవాళ్ళకి

ఉపయోగకరము.చూద్దామా సంగతేంటో.

బొటనవేలు-తల్లితండ్రులకు ప్రతినిధి
చూపుడువేలు-తోబుట్టువులకు ప్రతినిధి
మధ్యవేలు-మనకోసం
ఉంగరంవేలు-జీవితభాగస్వామికి ప్రతినిధి
చిటికెనవేలు-పిల్లలకు ప్రతినిధి

ఆసక్తిగా ఉందికదా........

marraige-ring.jpg

ఈ  విధంగా చేయండి.రెండు అర చేతులను తెరచి,మధ్య వేళ్లు

రెండూ మడిచి వెనకవైపునుండి దగ్గరగా పెట్టండి.ఇప్పుడు

మిగతా వేళ్లన్ని చివరలు కలిపి ఉంచండి.

మొదట బొటన వేళ్లు విడదీసి చూడండి.అవి విడిపోతాయి.

అంటే మానవులందరూ ఎదో ఒక రోజు చనిపోతారు.అలాగే

మన తల్లితండ్రులు కూడా మనల్ని వదలి వెళతారు.
ఇప్పుడు బొటన వేళ్లు కలిపి రెండో వేళ్లు విడదీయండి. అవి

కూడా విడిపోతాయి. అంటే మన తోబుట్టువులు కూడా వాళ్ల

 సంసారాలలో తలమునకలై ఉండి మనతో ఉండరు.
ఇప్పుడు రెండో వేళ్లు కూడా కలిపి చిటికెన వేళ్లు విడదీయండి.

అవి విడిపోతాయి. అంటే మన పిల్లలు కూడా తమ స్వంత

జీవితాలకోసం మనల్ని వదలి వెళతారు.

ఇక చిటికెన వేళ్లు కూడా కలిపి నాలుగో వేళ్లు విడదీయండి.

 ఆశ్చర్యం! ఇది నిజం అవి విడిపోవు.ప్రయత్నించినా మిగతా

వేళ్లు కలిసే ఉండాలి. ఎందుకంటే ఆ నాలుగో వేళ్లు భార్యా

 భర్తల బంధానికి,ప్రేమకు ప్రతినిధులు. జీవితాంతం కలిసే

 వుండాలని పెళ్లి ఉంగరాలను ఆ నాలుగో వేలికి తొడుగుతారు.

 అందుకే నాలుగో వేలిని ఉంగరపువేలు అని అంటారు.

ప్రయత్నించి చూడండి.
 

test

Loading...