Sunday, April 29, 2007

అందాల ముద్దుగుమ్మ

[slideshow id=216172782120970766&w=400&h=300]

కిన్నెరసాని వొచ్చిందమ్మ వెన్నెల పైటేసి
కిన్నెరసాని వొచ్చిందమ్మ వెన్నెల పైటేసి
విశ్వనాధ పలుకై అది విరుల తేన చినుకై
కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై
పచ్చనిచేల పావడ కట్టి
పచ్చనిచేల పావడ కట్టి
కొండమల్లెలే కొప్పున పెట్టి
వచ్చె దొరసాని మా వన్నెల కిన్నెరసాని

Saturday, April 28, 2007

వివాహ మహోత్సవ శుభాకాంక్షలు

marriage2.jpg

 మిత్రుడు రవి వైజాసత్య, అనితలకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు...

29.4.2007 ...

Saturday, April 14, 2007

చిత్ర విచిత్రమైన చీరల సింగారాలు





             kanchi-saree.jpg 

సీ. పాద పంకజములకు పారాణి యద్దేటి సరిగంచు నిగనిగల చక్కదనము
నెన్నడుము చుట్టుకొని నెమలి వన్నెలు జిల్కు రంగైన నడికట్టు రాచ ఠీవి
అవనికేతెంచు గంగా ఝరీ తరగలై కురిసేటి కుచ్చిళ్ళ కులుకు పలుకు
కాంతుని మదిగెల్చు కందర్ప కేతువై పైరగాలుల రేపు పైట జిలుగు



ఆ.వె. చీర కట్టు లలన చిలిపి వన్నెల భరిణ
చీర కట్టు పడతి సిరుల ప్రోవు
చీర కట్టు లేమ సింగారముల సీమ
చీర సొగసు బొగడ శివుని తరమ?






saree-with-50000-colors.jpgచెన్నైలోని ఒక ప్రముఖ చీరల వ్యాపారస్థులు ఈ చీరను తయారు చేసారు. ఇందులో సరిగ్గా 5౦,౦౦౦

ఉన్నాయి. దీని ధర కూడా 5౦,౦౦౦ రూపాయలు.

 reversible-saree.jpg

ఈ చీర నాలుగు అంచులు, రెండు కొంగులతో రెండువైపులా విభిన్నమైన రంగులు,

డిజైన్లతో తయారుచేయబడింది. ఈ చీరను రెండు వైపులా కట్టుకోవచ్చు.

matchbox.gif

కరీంనగర్‍లోని నల్ల పరంధాములు అనే నేతకారుడు అగ్గిపెట్టెలో పట్టేటంతటి చీరను

తయారు చేసాడు.

maya.jpg 

 ఈ రంగులు మార్చే చీర చూసారా? ఇది ధరించి ఎండలో వెళ్ళగానే దాని రంగు

మారిపోతుంది. మళ్ళీ నీడలోకి రాగానే పాత రంగుకు వచ్చేస్తుంది. దీనిని మాయ

చీర అంటారు.

 longest-saree.jpg

 ప్రపంచంలోనే అతి పొడవైన కంచిపట్టు చీర ఇది. 214 m పొడవు, 139 cm  వెడల్పుకలది.

ఇందులో వివిధరకాల జంతువులు, మందిరాలు, ప్రాచీన శిల్పాలు మొదలగునవి

ఎన్నో నేయబడ్డాయి.

j.jpg

 ఇది ఒక వినూత్నమైన చీర. దీనికి ఒక ప్రక్కన చీర రంగులోనే చిన్న సంచీ కుట్టారు.

అందులో సెల్‍ఫోన్ పెట్టుకోవచ్చు.

6.jpg

జీన్స్ ధరించే ఆధునిక యువతులకు ఈ డెనిమ్ సిల్క్ చీర తయారుచేయబడింది. డెనిమ్ బ్లూలోని అన్ని షేడ్స్ లో ఈ చీరలు దొరుకుతాయి..

Wednesday, April 4, 2007

రాముకు--పుట్టినరోజు శుభాకాంక్షలు

    

 వీరబల్లి వీరుడు, రాముడు మంచి బాలుడు టైప్ మన రానారెకు పుట్టినరోజు శుభాకాంక్షలు..

పెళ్ళి కళ కొట్టొచ్చినట్టుగా ఉంది కదా ?

   

Monday, March 19, 2007

వసంతాగమ శుభవేళ






ఉగాది అంటే యుగ+ఆది అంటే యుగాదికి ఆది అయిన రోజు అని అర్ధం. బ్రహ్మదేవుడు చైత్ర



శుద్ధ పాడ్యమినాడు ఈ సృష్టిని ఆరంభించడం వల్ల ఉగాది అయ్యింది. పద్నాలుగేళ్ళ వనవాసం



పూర్తిచేసుకున్న రాముడు సీతాదేవితో కలిసి తిరిగి అయోధ్యలో అడుగుపెట్టిన శుభదినం కూడా



 ఇదే. ద్వాపర యుగాన శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిన రోజు కూడా ఈ చైత్ర శుద్ధ



పాడ్యమినాడే అని పురాణాలు చెబుతున్నాయి. ఇన్ని శుభాలు చోటు చేసుకున్న ఈ శుభ



దినాన్ని చైత్ర శుద్ధ ప్రతిపద" అని కూడా చెబుతారు.



వాతావరణంలో, సంధ్యాసమయంలో ఆహ్లాదకరంగా వుంటుంది. సంవత్సరంలో వచ్చే 

మొదటి  ఋతువుగా వసంతాన్ని అభివర్ణించారు. కాలకొలమానంలో మాసం, తిథి

ప్రధాన పాత్రలు వహిస్తాయి.



 

కాబట్టి, చైత్ర శుద్ధ పాడ్యమి నూతన సంవత్సర తొలిశుభ దినంగా ప్రాచుర్యంలోకి

వచ్చింది. ఉగాది రోజున మంగళప్రదమైన మామిడి తోరణాలతో గడపలని అలంకరిస్తారు.

 కారణం ఏమంటే శివపార్వతుల ఇష్టపుత్రులయిన కుమారస్వామి, గణపతులకు

మామిడి ఫలాలంటే చాలా ప్రియం. అందుకని మామిడి పంట బాగా పండాలంటే

మామిడాకుల తోరణం కట్టాలంటారు.

పుడమితల్లికి  ప్రకృతి చేసే పుట్టినరోజు సంరంభం.. ఈ పులకింతల వసంతం !


చెట్లన్నీ ఎర్ర చివుళ్ళు తొడుక్కుని కొత్త ఆశల పందిళ్ళేసుకున్న చందాన అగుపిస్తాయి.




మొక్కలన్నీ సరిక్కొత్త జీవంతో కళకళలాడుతుంటాయి.కాలమంతా రమనీయ దృశ్య




కావ్యంలాకళ్ళ ముందు కదలాడే ఒకే ఒక   ఋతువు ..వసంతఋతువు.







 


ఉగాది పచ్చడి ఆరగించడంవల్ల ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఇందులో తీపి, పులుపు, చేదు




వగరు,కారం. అన్ని రుచులు కలగలిసి ఉంటాయి.ఈ ఉగాది పచ్చడిని కొందరు గట్టి




లేపనంగా చేసుకుంటే మరి కొందరు పలుచని ద్రవంలా చేసుకుని కొత్తకుండలో నింపి,




పూజానంతరం గ్లాసులో పోసుకుని సేవిస్తారు.


 


ఉగాది పండగతో మొదలయ్యే కొత్త సంవత్సరం ఏడాదంతా శోభాయమానంగా గడవాలని,




చేసే వ్యాపారాలన్నీ అభివృద్ధి చెందాలని, ధనాదాయాలు పుష్కలంగా లభించాలని




ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాభివృద్ధి కలగాలని పూజలు, హోమాలు నిర్వహిస్తారు. రైతులు




కూడా ఈ పండగ రోజునే ఏరువాక సాగిస్తారు..వసంతం వస్తూనే తన వెంట సంతోషాలను




 మోసుకొస్తుంది.




 


ఈ పండగకు బొబ్బట్లు , పూర్ణాలు, పులిహోర, ప్రత్యేక మైన కూరలు మొదలగునవి




చేసుకుంటారుసంతోషంగా పూజలు చేసుకుని, సుష్టిగా పంచ భక్ష పరమాన్నాలతొ



భోజనం చేస్తారు

ఇక పంచాంగ శ్రవణం లేకుండా పండుగ పూర్తికాదు.

త్రిదోషహరమైన ఉగాది పచ్చడి

  
                                           


ఆయుర్వేద వైద్య శాస్త్రం ప్రకారం వాతం , పిత్తం, కఫం అనే త్రిదోషాలు సమస్తితిలో ఉన్నప్పుడే


మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఈ మూడు దోషాలు ప్రకోపించకుండా తెలుగువారి నూతన


సంవత్సర ఉగాది పచ్చడి కాపాడుతుంది. శరీరంలోని ప్రతి జీవకణాన్ని ఉత్తేజపరుస్తుంది.


ఈ పండగలోని గమనించదగిన విశేషం ఏమిటంటే ఉగాది పచ్చడి తయారీకి హానికర కృత్రిమ


రసాయనిక పదార్థాలు సరుకులు అవసరం లేదు.


 


 


చింతపండు


 


చింతపండులో కాల్షియం, భాస్వరం, ఇనుము, కెరోటిన్, రిబోఫ్లెవిన్, నియాసిన్, విటమిన్ సి


పుష్కలంగా ఉన్నాయి. దీనిలో ' ఇన్‍వర్ట్అనే పంచదార, పెక్టిన్ అనే రసాయనం, టార్టారిక్


 ఆమ్లం వున్నాయి.


చింతపండు పచ్చిపులుసు జీర్ణశక్తిని పెంచుతుంది. కడుపుబ్బరం తగ్గిస్తుంది. చల్ల


దనాన్నిస్తుంది. యాంటిసెప్టిక్‍గా పని చేస్తుంది.


ఒక కప్పు నీళ్ళలో కొద్దిగా చింతపండు వేసి , బాగా మరగనిచ్చి,  కొద్దిగా నెయ్యి, అర


చెంచాడు మిరియాలపొడి వేసి తాగితే జలుబు త్వరగా  తగ్గిపోతుంది.


 


 


వేపాకులు


 


 


వేపచెట్టుని ఎయిర్ ప్యూరిఫయ్యర్గా శాస్త్రవేత్తలు చెబుతారు. వేపాకులలో ఉండే


నింబిడిన్‍లో ప్రధానంగా సల్ఫర్ (గంధకం) ఉంటుంది. శ్వాస కోశాలలో పేరుకు


పోయిన కఫాన్ని తొలగిస్తుంది


వేపాకు మూత్రం సాఫిఇగా జారీ అయేట్టు చేస్తుంది. క్రిమికీటక సంహారక గుణం ఉంది.


ఒక గుప్పెడు వేపాకులు రెండు కప్పుల నీళ్ళలో వేసి మరిగించి ఆ డికాక్షన్ (కషాయం)


 తాగితే మలేరియా జ్వరం తగ్గుతుంది.


 వేపాకులు మెత్తగా నూరి ఆ ముద్దను శరీరానికి పూసుకుంటే చర్మవ్యాధులు,


పొక్కులు, దద్దుర్లు తగ్గుతాయి. గాయాలు త్వరగా మానుతాయి. అమ్మవారు వచ్చిన


వారి పక్కలమీద వేపాకులు వేయటంలో గల అంతరార్థం ఇదే!


వేపాకు కషాయం తలకు తాస్తే పేలు చచ్చిపోతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది.


 


వేపపూలు


 


వేపపువ్వుల రుచి చేదుగా ఉంటుంది. వీటిల్లో ఉండే నూనె పదార్థానికి నాలికకు


కాస్తంత దురద పుట్టించే గుణం వుంటుంది. వేపపువ్వు మొగ్గలలో నింబోస్టెరాల్


అనే గ్లూకోసైడ్, నింబో స్టెరాల్ సింటెసెటిన్ అనే ఆవిరయ్యే నూనె , కాస్తంత కొవ్వు


పదార్థాలు వుంటాయి. వేపపూలకు వేపాకులకున్నన్ని ఔషధగుణాలన్నీ ఉన్నాయి.


 


మామిడికాయ


 


పచ్చిమామిడికాయలో పిండిపదార్థాలు ఎక్కువ. టెంకపట్టని మామిడి పిందెలలో


పెక్టిన్" అనే రసాయనం పుష్కలంగా ఉంటుంది. మామిడికాయలలో కాల్షియం,


భాస్వరం, ఇనుము, విటమిన్ సి, విటమిన్ బి 1, విటమిన్ బి 2, నియాసిస్


ఉంటాయి. టార్టారిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లం స్వల్పంగా సిట్రిక్ ఆమ్లం ఉంటాయి.


పచ్చి మామిడికయ ముక్కలు, ఉప్పులో అద్దుకుని తింటం వల్ల దాహం తీరుతుంది.


 వేసవిలో చెమట ద్వారా పోయిన సోడియం క్లోరైడ్, తిరిగి శరీరంలోకి చేరుతుంది.


పచ్చిమామిడికాయల రసం తాగటం వలన వేసవికాలంలో వచ్చే నీళ్ళ విరోచనాలు,


 మూలశంక వ్యాధి, ఉదయంపూట కడుపులో వికారం, ఆకలి లేకపోవటం, మల


బద్దకం వంటి అస్వస్థతలు తగ్గుతాయి.


రెండు మూడు పచ్చి మామిడికాయ ముక్కలు తినడం వలన రక్తనాళాలు వ్యాకోచ


శక్తిని పొందుతాయి.క్షయ, పాండురోగం వంటి రుగ్మతలు దరికి రావు.


 


 


కొత్త బెల్లం


 


కొత్త బెల్లం (ఇక్షుసార) జఠరదీప్తినిస్తుంది. అంటే ఆకలి బాగా వేస్తుంది. నీరసం తగ్గిస్తుంది.


దీనిలో కాల్షియం, భాస్వరం, ఇనుము పుష్కలంగా వుంటాయి.


 


 


మంగళప్రదమైన మామిడి ఆకులు


 


 


అన్ని శుభకార్యాలకు మామిడి ఆకులతో మంగళతోరణాలు కడతాం. మామిడి ఆకులకు


కూడా ఔషధ గుణాలు వున్నాయి.


గుప్పెడు లేతమామిడి ఆకులు రాత్రిపూట ఒక గ్లాసు నీళ్ళలో నానేసి ఉదయాన్నే నీళ్ళలో


ఆకుల్ని బాగా పిసికి, ఆ రసాన్ని తాగడం వలన తొలి దశలో ఉన్న చక్కెర వ్యాధిని


నియంత్రించవచ్చు.


లేత మామిడాకుల్ని నీడలో ఎండబెట్టుకుని పొడి చేసి,  ప్రతిరోజు ఉదయం, సాయంత్రం


ఒక చెంచాడు పొడి, మంచినీళ్ళతో సేవిస్తే చక్కెరవ్యాధి అదుపులో ఉంటుంది.


మామిడాకుల కషాయం పుక్కిటపడితే దంతరోగాలు, చిగుళ్ళవాపు, నొప్పులు, నోటి


పూత తగ్గుతాయి.


మామిడి పుల్లతో పళ్ళు తోముకుంటే  శుభ్రంగా ఉంటుంది. దుర్గంధం పోతుంది.

Sunday, March 18, 2007

తుల

 

     (చిత్త 3,4 స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


 


అదాయం-5 వ్యయం-8 రాజపూజ్యం-7 అవమానం-1


 


 


రాశివారికి గురుడు నవంబరు 21 వరకు రెండింట సువర్ణమూర్తి. తదుపరి సంవత్సరమంతా


 మూడింట తామ్రమూర్తి. శని జులై 15 వరకు పదింట, తదుపరి పదకొండింట రజితమూర్తులు.


  రాశివారికి నవంబరు వరకు యోగప్రదం. ఉత్సాహప్రదం. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది.


ఆరోగ్యం పెంపొందుతుంది. సంకల్పం ఫలిస్తుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. బంధు


మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. కొంతకాలంగా వృత్తి వ్యాపారాలలో ఉన్న స్తబ్దత తొలగి


పోతుంది. నూతన వ్యాపారాలు లాభిస్తాయి. సమయోచితమైన ఆలోచనలు స్పురిస్తాయి.


స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.





దశమ శని అంతగా శుభప్రదం కాకపోయినప్పటికీ రాశిరీత్యా పూర్ణయోగప్రదుడు కాబట్టి


 శుభఫలితాలు కనిపిస్తాయి. వాక్చాతుర్యంతో,నాయకత్వ లక్షణాల్తో ముందంజ వేస్తారు.


సంఘంలో గౌరవం పెరుగుతుంది. హుందాగా వ్యవహరించి సత్ఫలితాలు సాధిస్తారు.


 విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. జులై తరువాత లాభమందు శని పూర్తి


యోగప్రదుడు అవుతాడు. ఫలితంగా అన్ని రంగాల్లో పురోభివృద్ధి కనిపిస్తుంది. గౌరవ


పురస్కారాలు లభిస్తాయి. పాత బాకిలు వసూలవుతాయి. ఆర్ధిక వ్యవహారాలు ఫలిస్తాయి.


 కాంట్రాక్టరులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మొదట కొన్ని చిక్కులు ఎదురైన చివరకు


లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయ రంగంలోని వారికి పదోన్నతి లభిస్తుంది. వ్యాపార


రంగంలోని వారు రాణిస్తారు. వ్యవసాయ ఉత్పత్తుల  స్టాకిస్టులకు,కోళ్ళు, మత్స్య


వ్యాపారులకు స్వల్ప లాభం, షేర్ల లావాదేవీలు అంతగా లాభించకపోవచ్చు. సోదర,


బంధువర్గం నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది.


 


వస్త్రాలు, ఫైనాన్స్, రసాయనిక వ్యాపారులకు 1,2,3,5,6,7,10 మాసాలు యోగప్రదం.


మెట్ట వ్యవసాయం వారికి లాభదాయకం.  మాసాల్లో విద్యార్థులకు పురోభివృద్ధి.


నూతన విద్యా ఉద్యోగాలకు అనుకూలం. సంవత్సరం పూర్వార్ధంలో భాషా పండితులు,


కళా శాస్త్రకోవిదులకు ఆటంకాలు ఎదురైనా చివరకు పురోగతి సాధిస్తారు. సైన్సు, అర్ధ


శాస్త్ర విద్యార్ధులు, రంగాల ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు, ఉద్యోగులకు బదిలీల


బెడద తప్పకపోవచ్చు. ఉన్నతాధికారుల సహకారంతో ప్రమోషన్లు సాధిస్తారు. సినీ,


 వైద్య, వ్యాపార రంగాల వారికి సంవత్సరంలోని మొదటి ఆరు మాసాలు ప్రోత్సాహకరంగా


 ఉంటుంది.


 


చిత్తవారు పగడం, స్వాతివారు గోమేధికం,కెంపు  విశాఖవారు పగడం,పుష్యరాగాభరణాలు


ధరించిన యోగప్రదం. రాశివారికి అదృష్ట సంఖ్యలు 2,6,7,9. సోమ శుక్ర, శనివారములు


యోగదాయకం. మొత్తం మీద వీరు కుజ, రాహు గ్రహాలకు జపశాంతులు, మంగళవార


నియమాలు, లక్ష్మీ, గణేశ, విష్ణు సహస్ర, సాయి శివ ఆరాధనలు యోగప్రదాలు. స్త్రీలు


మంగళ, శుక్ర శనివారాలు నవగ్రహ స్తోత్ర, శివ, ఆంజనేయ పూజలు జరుపుకుంటే ఇష్ట 


కార్యసిద్ధి, కుటుంబ సభ్యులకు సౌఖ్యం కలుగుతుంది.

test

Loading...