Thursday, November 9, 2006

అదేంటో గాని

అదేంటో గాని తెలుగు సినిమాలలో దర్శకుని పేరు ఆఖరున వేస్తారు.

 అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో సర్వసాధరణంగా విలన్ కూతుర్నే ప్రేమిస్తాడు.

అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరోయిన్ ప్రమాదంలో ఉండగా ఎక్కడినుంచి

 ఊడిపడతాడో తెలీదు కాని హీరో వచ్చేస్తాడు, ఫైట్స్ చేసేస్తాడు.

అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో చెల్లెలే రేప్ కు గురవుతుంది.

అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో మారు వేషం వేస్తే మనకందరికి

తెలుస్తుంది కాని సిన్మాలో విలన్ గ్యాంగు వాళ్ళకు అస్సలు తెలీదు.

 అదేంటో గాని తెలుగు సినిమాలలో బాల నటులు అన్నీ ముదురు మాటలే మాట్లాదతారు.

అదేంటో గాని తెలుగు సినిమాలలో లెక్చరర్లు, ప్రిన్సిపాల్, పంతుళ్ళు మరీ జోకర్లలాగా

 ప్రవర్తిస్తుంటారు. పిల్లలకు భయపడుతుంటారు.

 అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో రిక్షావాడైనా రీబోక్ షూస్ మాత్రమే వేసుకుంటాడు.

 అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో హీరోయిన్లు ఎంత పేదవారైనా టక్కున

అమెరికా, ఆస్టేలియా వెళ్ళి పాటలు పాడేసుకుంటారు.

 అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో కాని హీరోయిన్ తల్లి ఇంట్లో  మందులకు

కూడా డబ్బులుండవు కాని రెండువేలకు తక్కువ కాని జరీ చీర మాత్రమే కట్టుకుంటారు.

No comments:

Post a Comment

test

Loading...