Sunday, October 28, 2007
వామ్మో!! ఏం దోపిడి!!!
ఇలా ఎక్కువ ధరలు పెట్టడమెందుకో, అలా ఖాళీగా కూర్చోడమెందుకో. కనీసం అద్దె, జీతాలైనా మిగులుతాయో లేదో నా అనుమానం. ఈ ఆర్గానిక్ ఆహారం ఏమిటో అని ఇంటికొచ్చి పుస్తకాలు వెతికితే తెలిసింది. ఎరువులు, రసాయనాలు లేకుండా స్వచ్చంగా పండీంచినవి అని. అసలు వాతావరణం కాలుష్యం, మనుష్యుల మనసులే కాలుష్యం ఆవరించి ఉంటే ఈ స్వచ్చమైన ఆహారాన్ని నాలుగింతల ధరలు పెట్టి తమని తాము రక్షించుకుందామనుకుంటున్నారా ఇవి తినే పెద్దమనుషులు.
కొన్ని ధరలు చూడండి. మనం ఇంటి దగ్గర దుకాణంలోగాని, సూపర్ మార్కెట్‌లో గాని దీని ధరలు ఎలా ఉన్నాయి,తేడా చూడండీ.
దాల్చిన కప్ కేకులు - 5 - 65 - 00
హెర్బల్ సబ్బు 75 gm - 55 - 00
నల్ల కారం పొడి 100gm - 30 - 00
బాదాం 100gm - 84 - 00
మిక్స్‌డ్ ఫ్రూట్ జాం 200gm - 119 - 00
జీడిపప్పు 100gm - 110 - 00
అల్లం వెల్లుల్లి 200gm - 44 - 00
పిస్తా 100gm - 89 - 00
Saturday, October 27, 2007
తెలుగులో కామిక్స్
Tuesday, October 16, 2007
పేద్ద తప్పు!!!!!!!!!
పేద్ద తప్పు!!!!!!!!!
Monday, October 15, 2007
Sunday, October 14, 2007
తద్దినం - అవసరమా???
అందరికీ తెలిసిన విషయమే. చనిపోయిన పెద్దలకు మర్చిపోకుండా తద్దినం పెట్టాలి అని పెడుతున్నాం కూడా. కాని ఈ విషయంలో నాకు ఎన్నో సందేహాలు. చనిపోయినవారి స్మ్త్యత్యర్ధం అలా చేయడం మంచిదే. కాని మనం అది సక్రమంగా నిర్వహిస్తున్నామా. ప్రతి సంవత్సరం తద్దినం పెట్టకుంటే ఏమవుతుంది. ఎంతమంది మనస్పూర్తిగా చేస్తున్నారు. నిజంగా మన పెద్దలు సంతోషిస్తున్నారా? మేము చనిపోయాక కూడా మా పిల్లలు మమ్మల్ని గుర్తుంచుకున్నారు అని.
తద్దినం అంటే ఏమిటి? ఎందుకు చేయాలి?చేయకపోతే ఏమవుతుంది??
నేను గమనించినదేమంటే పెద్దవాళ్ళ తద్దినం రోజు చనిపోయినవారి ఫోటో తుడిచి(అదీ ఏడాదికొక్కసారే) పూలదండ వేసి బొట్టు పెట్టి, నైవేద్యం పెట్టి, మిగతావాళ్ళూ తినడం, తాగడం. ఇదేనా వారి ఆత్మశాంతి. చనిపోయినవారి పేరు చెప్పుకుని మనం సుష్టిగా తినడం, తాగడం. రోజు వండుకోకపోయినా ఆ రోజు మాత్రం మాంసాహారం(తినేవాళ్ళు) , పూరీలు, గారెలు, చేయాల్సిందే. లేకుంటే చుట్టాలు విసుక్కుంటారు. ఏం తిండి పెట్టారు అని. మందు కూడా తప్పనిసరి. అసలు అది ఒక పార్టీలా చేసుకుంటారు. .ఇక ఒకరికంటే ఎక్కువ కొడుకులుంటే సంవత్సరానికొక్కడు ఈ తద్దినం తనింట్లో పెడతానని వంతులు వేసుకుంటారు. ఇంట్లో కోడళ్ళు ఉంటే మీ అత్తమామకి మీరు చేసుకోండి మేమెందుకు చేయాలి పని అంటారు. మరి వాళ్ళ మొగుళ్ళు ఎక్కడినుండి ఊడిపడ్డారో (తాత, బామ్మలు లేకుండా).. ఇది ఒక బలవంతపు తంతులా చేసుకుంటారు.. ఆర్ధిక ఇబ్బంది ఉన్నా చేయక తప్పదు అన్ని రకాల వంటకాలు. ఇదంతా ఎవరి కోసం.ఎవరి పేరు చెప్పి ఎవరు తింటున్నారు. ఇది సమంజసమేనా??
ఐనా ఆ పెద్దలు కాని, ఏ దేవుడు కాని చెప్పాడా నాయనల్లారా! నేను పోయాక ఇలా చేయండి అని. అలా చేస్తే నేను సంతోషిస్తాను అని (బ్రతికున్నపుడు ఏం చూసుకున్నారో ఆ తల్లితండ్రులని ఈ పుత్ర రత్నాలు). చనిపోయాక చచ్చినరోజని తద్దినం పెడతారుగా మరి బ్రతికున్నపుడు ఆ మనిషి పుట్టినరోజు చేసారా. కనీసం వారికి పాదాభివందనం చేసి అభినందనలు చెప్పారా ఎవరైనా?? మరి మనిషి బ్రతికున్నాడన్న నిదర్శనానికి పుట్టినరోజు చేయనివాళ్ళు, ఆ మనిషి చనిపోయాక చచ్చినరోజు అని తద్దినం పెట్టి ఈ తినడాలు, తాగడాలు ఏంటో???
Friday, September 14, 2007
HAPPY BIRTHDAY JYOTHI
ఈ రోజుకి నేను బ్లాగు మొదలుపెట్టి సరిగ్గా సంవత్సరమవుతుంది. నా ఈ బ్లాగ్ప్రయాణంలో అన్నీ శుభాలు, విజయాలే దక్కాయి నాకు. అది జరగడానికి నాకు సహకరించి, ప్రోత్సహించిన అందరు బ్లాగర్లకు హృదయపూర్వక ధన్యవాదములు.
ఊరికే టైంపాసుకు నెట్‌కొచ్చిన నాకు దొరికిన అమూల్యమైన వరం ఈ తెలుగు బ్లాగు గ్రూపు. మొదట్లో సరదాగా గడిచిపోయింది గుంపులో కాని అందరు కలిసి నన్ను బ్లాగు మొదలెట్టించారు. బ్లాగు మొదలెట్టిన సమయంలో అంతా అయోమయంగా ఉండేది. అస్సలేమీ తెలీదు. ఎలా చేయాలో తెలీదు. ఊరికే టైప్ చెయ్యడం మాత్రం వచ్చేది. కాని నేనడిగిన సందేహలన్నింటికి గుంపులో ఓపిగ్గా సమాధానమిచ్చేవారు ఎవరో ఒకరు.
గత సంవత్సరం అందరి ఆడాళ్ళలాగే ఇంటిపని కాగానే నిద్రపోవడం, టీవీలో వచ్చే చెత్త సీరియళ్ళన్నీ చూడడం( అప్పుడవి మహాద్భుతాలు) వాటిగురించే చర్చించడం, మరునాటి కోసం ఎదురుచూడ్డం చేసేదాన్ని. వేరే వినోదం అంటూ లేదు మరి. ఐనా నాలో ఎదో అసంతృప్తి. నాకు నచ్చిన పాటలు, వంటలు, జోకులు, కథలు,పురాణగాథలు. వీటన్నింటి గురించి మాట్లాడుకోటానికి స్నేహితులు లేరు.నాలో నేనే అనుకోవడం. మొదటినుండి తెలుగు అంటే ప్రాణం. పుస్తకాలంటే మరీను. మరి ఏదైనా విషయం గురించి చర్చించాలి, సందేహం తీర్చుకోవాలి అంటే ఎవరూ లేరు. అందుకే గూగుల్‌లో కనపడ్డ తెలుగు గుంపులన్నీ చేరిపోయా. అప్పటికి గ్రూపులంటే తెలీదు. తర్వాత ఒక్కటొక్కటిగా తెలుసుకుని బ్లాగు గుంపులో స్థిరపడిపోయా. ఆ సమయంలో నన్ను అడుగడుగునా ప్రోత్సహించిన వీవెన్, చావాకిరణ్, సుధాకర్, శిరీష్‌గారు, సిబిరావుగారు, రమణ, త్రివిక్రం, ప్రసాద్, రవి వైజాసత్య అందరికీ ఎంతో ఋణపడి ఉన్నాను. ఈ బ్లాగుల మూలంగానే నాకే తెలియకుండా నాలో దాగి ఉన్న అభిరుచులన్నీ బయటపడ్డాయి. నాకు ఇష్టమైనవన్నీ బ్లాగుల రూపంలో భద్రపరుచుకుంటున్నాను. ఇప్పుడు ఎంతో తృప్తిగా ఉంది. ఎలాంటి అశాంతి అసహనం లేదు.నాకిష్టమైన వంటలు, సరదా కథలు,జోకులు,పాటలు అన్నీ తెలుగులో రాయగలుగుతున్నాను, నాలా ఆలోచించే, అర్ధం చేసుకోగలిగే మిత్రులతో పంచుకోగలుగుతున్నాను అని. ఈ బ్లాగుల వల్ల నా ఆలోచన, అవగాహనా శక్తి పెరిగింది.నిజం. ఎప్పుడైనా ఏ విషయమైనా నచ్చిందైనా , నచ్చనిదైనా, నా స్వంత విషయమైనా వెంటనే బ్లాగులో రాసుకుని అందరితో పంచుకోవడం అలవాటైపోయింది. అందరూ కుటుంబ సభ్యులు, పాత మిత్రులలా అనిపిస్తుంది. ఈ ప్రయాణంలో నేను ఎవ్వరితోను పోటీ అనుకోలేదు. నాకు నేనే పోటీ పెట్టుకుని రాసుకుంటూ పోయా. మొదటినుండి నాదో అలవాటు మంచిదో కాదో తెలీదు. నాకు తెలిసింది పదిమందికి చెప్పడం, తెలీంది పదిమందిని అడగడం. అదే పాటిస్తూ వస్తున్నా ..
ఇన్నేళ్ళుగా మావారు, పిల్లలకిష్టమైనవి చేయడమే నా బాధ్యత, కర్తవ్యం అంటూ బ్రతికేసాను. నాకంటూ ఇష్టాలు ఏమున్నాయి అని ఆలోచించలేదు. ఫలానా ఆయన భార్య, ఫలానా ఆయన కూతురు అని మాత్రమే నాకు గుర్తింపు ఉండేది. నాకంటు ఒక గుర్తింపు ఉంటుంది, ఉండాలని ఎప్పుడు ఆలోచించలేదు. కాని బ్లాగులలో రాసుకుంటూ పోతుంటే మీ అందరి ప్రోత్సాహం, అభినందనలు,గౌరవం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది.నేను కూడా ఎదో చేయగలను, సాధించగలను అనుకుంటూ మరింత ఉత్సాహంతో సాగిపోయాను. ఈ ప్రయాణంలో ఎక్కడా అపశృతులు కలుగలేదు.ఇప్పుడు నేను మా ఇంట్లోవాళ్ళకి , మా పుట్టింట్లో గర్వంగా చెప్పుకుంటాను ఇంటర్‌నెట్‌లో దేశవిదేశాల్లో నాకెంత పేరుందో తెలుసా అని.. ఇది నేను ఇంట్లోనే ఉండి చేయగలిగాను అని. అందరూ ఊరికే అనేవారు మరి ఎప్పుడూ కంప్యూటర్లో ఏం చేస్తుంటావు అని. నేను ఎన్ని బ్లాగులు రాసినా అది నా కుటుంబ బాధ్యతల తర్వాతే తీరిక సమయాలలో చేస్తున్నాను. టీవీ అంటే చిరాగ్గా ఉందిప్పుడు. బయటికెళ్ళిగాని, ఫోన్లోగానీ సొల్లు కబుర్లు బంద్. తెలిసినవాళ్ళందరు అడుగుతుంటారు ఏంటిది అస్సలు కనపడటంలేదు, మాట్లాడటంలేదు. ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు అని.నవ్వి ఊరుకుంటాను. నేను చేసే పని చెప్పినా వేస్ట్ కాబట్టి. వాళ్ళకి అర్ధం కాదు.
ఈ ఏడాది ప్రయాణంలో నాకు ఎప్పుడు అలసటకాని, కష్టం కాని అనిపించలేదు. ఎందుకంటే నాకిష్టమైన తెలుగులో పని కదా.ఇష్టమైతే ఎదీ కష్టం కాదు.ఈ ఏడాది కాలంలో తెలిసి ఎవ్వరినీ నొప్పించలేదు. తెలియక నొప్పించితే క్షమించండి.మీకు తెలుసుగా నేను ఎప్పుడు సరదాగానే ఉంటాను అని.
ఇవి నా ప్రయాణంలో అంచెలంచలుగా నా ఎదుగుదల.
మొదటి నెలలో రెండో బ్లాగు - షడ్రుచులు
మూడు నెలలలో - షడ్రుచులలో 100 టపాలు, మూడో బ్లాగు గీతలహరి
ఆరునెలలలో - 500 టపాలు , 4 బ్లాగులు
తొమ్మిది నెలలలో -1000 టపాలు , 5 బ్లాగులు
సంవత్సరానికి - తెలుగు వెలుగులు వ్యాసం.
ఇంకా ఏమన్నా ఉందా నేను చేయగలిగేది. లేదనుకుంటా. కాని ఇంకా ఎంతో సాధించాల్సింది ముందుంది అనిపిస్తుంది. ఆపై ఆ దేవుడి దయ. నాకు ఒక్కటే లోటుగా ఉంది. తెవికీలో రాయడానికి సమయం చిక్కడంలేదు.
ఒక కొత్త శీర్షిక : నా స్నేహితురాలు స్వరూప చెప్పే ముచ్చట్లు అప్పుడప్పుడు రాస్తుంటాను. అది తెలంగాణ శకుంతల టైపు. పాతబస్తీలో ఉంటుంది.
ఈ సంవత్సరంగా నాకు నచ్చిన నా ఆలోచనలు, భావాలు, చర్చలు ....
ఆడవాళ్ళలో జీనియస్సులు ఎందుకు లేరు
ఏడాది క్రితం నేను ఏమి తెలీదు అంటూ గుంపులో కొచ్చా. కాని ఇప్పుడు అందరికంటే నేనే గొప్ప. నాకున్న బిరుదు, గౌరవం ఎవరికన్నా ఉందా… అదేంటా… జ్యోతక్క.. అనే పేరు. హ… హ … హ… మరి అన్నా అని ఎవరన్నా పిలిపించుకున్నారా? విహారి ఏమంటావ్? నువ్వేనా మరి.
ఇప్పటికే కోతలు ఎక్కువయ్యాయి గాని….ఉంటా మరి..