Thursday, December 9, 2010

మబ్బుల ఆకాశంలో ఆకాశ వీధులన్ని దాటిస్తూ
సన్నజాజుల వింజామరలూపి
ఎంచక్కని పూతేనెల విందులిచ్చి
నన్నెక్కడికి ప్రభూ పంపిస్తున్నావు?

ఇంతకన్నా అందమైన చల్లనైన ఒడికి
మమతల మురిపాల లోగిలికి...
తన యెదనే అమృతభాండాన్ని చేసుకుని
నీ చిన్నారి బొజ్జ నింపే
ఒక చక్కని దేవత చెంతకు పంపుతున్నా చిన్నారి.


ఎందుకు ప్రభూ? నీకంటే ప్రేమయినదా. ఆమె?

అవును నిన్ను లాలిస్తుంది. పాలిస్తుంది.
చేతులనే కోటగా చేసి అడుగడుగునా నిన్ను రక్షించుకుంటుంది
తీగకు పందిరిలా మొక్కకు నీరులా మారుతుంది.
ఎండకన్ను తెలియనీయని వృక్షమవుతుంది.
నువ్వు పూజించకున్నా నీ పాలిటి దేవతవుతుంది.
నీకోసం ప్రాణాలిస్తుంది.

ఆమె పూలజోలల లాలనలో, ఒడిన ఊగు వూయలలో
నీకు ఈ దేవుడు కూడా గుర్తుండడు.
అన్ని చోట్లా అన్ని వేళలా నేను అందుబాటులో ఉండను
అందుకే ఆమెను నీకిస్తున్నాను

అవునా ప్రభూ! ఆమె పేరేంటి? నేనేమని పిలవాలి?

అమ్మ! అమ్మా అని పిలవాలి చిన్నారి"........

test

Loading...