[slideshow id=216172782120970766&w=400&h=300]
కిన్నెరసాని వొచ్చిందమ్మ వెన్నెల పైటేసి
కిన్నెరసాని వొచ్చిందమ్మ వెన్నెల పైటేసి
విశ్వనాధ పలుకై అది విరుల తేన చినుకై
కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై
పచ్చనిచేల పావడ కట్టి
పచ్చనిచేల పావడ కట్టి
కొండమల్లెలే కొప్పున పెట్టి
వచ్చె దొరసాని మా వన్నెల కిన్నెరసాని
Sunday, April 29, 2007
Saturday, April 28, 2007
Saturday, April 14, 2007
చిత్ర విచిత్రమైన చీరల సింగారాలు

సీ. పాద పంకజములకు పారాణి యద్దేటి సరిగంచు నిగనిగల చక్కదనము
నెన్నడుము చుట్టుకొని నెమలి వన్నెలు జిల్కు రంగైన నడికట్టు రాచ ఠీవి
అవనికేతెంచు గంగా ఝరీ తరగలై కురిసేటి కుచ్చిళ్ళ కులుకు పలుకు
కాంతుని మదిగెల్చు కందర్ప కేతువై పైరగాలుల రేపు పైట జిలుగు
ఆ.వె. చీర కట్టు లలన చిలిపి వన్నెల భరిణ
చీర కట్టు పడతి సిరుల ప్రోవు
చీర కట్టు లేమ సింగారముల సీమ
చీర సొగసు బొగడ శివుని తరమ?

ఉన్నాయి. దీని ధర కూడా 5౦,౦౦౦ రూపాయలు.

ఈ చీర నాలుగు అంచులు, రెండు కొంగులతో రెండువైపులా విభిన్నమైన రంగులు,
డిజైన్లతో తయారుచేయబడింది. ఈ చీరను రెండు వైపులా కట్టుకోవచ్చు.

కరీంనగర్‍లోని నల్ల పరంధాములు అనే నేతకారుడు అగ్గిపెట్టెలో పట్టేటంతటి చీరను
తయారు చేసాడు.

ఈ రంగులు మార్చే చీర చూసారా? ఇది ధరించి ఎండలో వెళ్ళగానే దాని రంగు
మారిపోతుంది. మళ్ళీ నీడలోకి రాగానే పాత రంగుకు వచ్చేస్తుంది. దీనిని మాయ
చీర అంటారు.

ప్రపంచంలోనే అతి పొడవైన కంచిపట్టు చీర ఇది. 214 m పొడవు, 139 cm వెడల్పుకలది.
ఇందులో వివిధరకాల జంతువులు, మందిరాలు, ప్రాచీన శిల్పాలు మొదలగునవి
ఎన్నో నేయబడ్డాయి.

ఇది ఒక వినూత్నమైన చీర. దీనికి ఒక ప్రక్కన చీర రంగులోనే చిన్న సంచీ కుట్టారు.
అందులో సెల్‍ఫోన్ పెట్టుకోవచ్చు.

జీన్స్ ధరించే ఆధునిక యువతులకు ఈ డెనిమ్ సిల్క్ చీర తయారుచేయబడింది. డెనిమ్ బ్లూలోని అన్ని షేడ్స్ లో ఈ చీరలు దొరుకుతాయి..
Wednesday, April 4, 2007
రాముకు--పుట్టినరోజు శుభాకాంక్షలు
Subscribe to:
Posts (Atom)
test
Loading...