Thursday, December 9, 2010

మబ్బుల ఆకాశంలో ఆకాశ వీధులన్ని దాటిస్తూ
సన్నజాజుల వింజామరలూపి
ఎంచక్కని పూతేనెల విందులిచ్చి
నన్నెక్కడికి ప్రభూ పంపిస్తున్నావు?

ఇంతకన్నా అందమైన చల్లనైన ఒడికి
మమతల మురిపాల లోగిలికి...
తన యెదనే అమృతభాండాన్ని చేసుకుని
నీ చిన్నారి బొజ్జ నింపే
ఒక చక్కని దేవత చెంతకు పంపుతున్నా చిన్నారి.


ఎందుకు ప్రభూ? నీకంటే ప్రేమయినదా. ఆమె?

అవును నిన్ను లాలిస్తుంది. పాలిస్తుంది.
చేతులనే కోటగా చేసి అడుగడుగునా నిన్ను రక్షించుకుంటుంది
తీగకు పందిరిలా మొక్కకు నీరులా మారుతుంది.
ఎండకన్ను తెలియనీయని వృక్షమవుతుంది.
నువ్వు పూజించకున్నా నీ పాలిటి దేవతవుతుంది.
నీకోసం ప్రాణాలిస్తుంది.

ఆమె పూలజోలల లాలనలో, ఒడిన ఊగు వూయలలో
నీకు ఈ దేవుడు కూడా గుర్తుండడు.
అన్ని చోట్లా అన్ని వేళలా నేను అందుబాటులో ఉండను
అందుకే ఆమెను నీకిస్తున్నాను

అవునా ప్రభూ! ఆమె పేరేంటి? నేనేమని పిలవాలి?

అమ్మ! అమ్మా అని పిలవాలి చిన్నారి"........

Sunday, November 4, 2007

తెలుగు కవుల హృదయాలలో పెల్లుబికిన గోదావరి...1

పుష్కరాల సమయంలో ఆంధ్రభూమి పత్రికలో వచ్చిన వ్యాసం ఇది. రచన : సన్నిధానం నరసింహ శర్మ.

గోదావరి వంటి పరమ ప్రాకృతికమైన రస వస్తువుకంటే కవితా రచనకు మరొకటి తగి ఉంటుందా !.. గోదావరి గంగ కన్నా ప్రాచీనమైనది. అంతటి పవిత్రమైనది.


 


సుదీర్ఘ ప్రవాహ ప్రయాణాలు, కొండల స్నేహపరిమళాలు సంతరించుకోవడం , కలుపుగోలుతనంతో ఉపనదుల్ని విలీనం చేసుకోవడం, అటనట అటవీ ప్రాంతవిహారాలు బహుబాషల్ని ప్రతిధ్వనించడం, ఇలా  గోదావరి దర్శనీయ కోణాలు ఎన్నో. బహు సంస్కృతుల అనుపానుల పరిణామాల ప్రత్యక్ష సాక్షి గోదావరి.


 


చినుకులు, వానలు, కాలువలు, వాగులు, వరదలు, పచ్చపచ్చని పంటలు వీటన్నిటితో భాషలు గోదావరి తల్లికి తెలుసు. విరగబండిన వరిచేను కంకుల గాలి మొదలికల్లో గోదారి కనబడుతుంది. నిటారుగా  హుషారుగా పెరిగే చెరకు గడల్లోని గోదారి మాధుర్యం తినబడుతుంది. ఫ్యాక్టరీల్లోని పంచదారకు దారులు చూపుతుంది. ఎర్ర ఎర్రని మిరప పళ్ళల్లో గోదారి - సూర్యోదయ అస్తమయ సౌందర్య విన్యాసాలను సూక్ష్మ స్వరూప విలాసాలుగా అందిగిస్తుంది.


 


శ్రామికులను, నాగరికులను సమభావంతో బ్రతుకుదారుల్లో సేదదీరుస్తుంది. నాశికాత్ర్యంబకంనుండి, కడలిలో కలిసేవరకు ఒక విస్తృతమైన నడక విలాసమైన నడక.  ఒక చోట చల్లగా ,, ఒక చోట వేడిగా, ఒకచోట లోతుగా, ఒక చోట ఇసుకమేటలపై తట్టులోతులు. ఇటువంటి మహానదిని గురించి సంస్కృత కవులు అనేక స్తుతులతో కవితలతో సుశ్లోకలయ్యారు.


 


తెలుగుకవుల స్పందనల విందారగిద్దాం మరి. నన్నయగారు ఆదిపర్వంలో "దక్షిణ గంగ నావద్దయు నొప్పిన" అని ప్రసక్తి మాత్రమే చేసినప్పటికి దక్షిణ గంగ అని ప్రశస్తి తెలిపారు. రాజమహేంద్రవరం వద్ద గోదావరి విస్తృతమైనట్లు శ్రీనాధుని కాలానికి వచ్చేటప్పటికి గోదావరి విస్తృత రచనావస్తువయింది. "త్ర్యంలుకాచల శిఖరాగ్రంబునందుండి" సముద్ర పర్యంతమూ ప్రవహించిన గోదావరిని శ్రీనాథుడు రసవత్తర పద్యాలలో ప్రతిబింబింపజేస్తూ "గౌతమీగంగ లవణాబ్దిగౌగలించే"  అంటూ ఆద్యంతం మనోహరంగా వర్ణిస్తాడు.


 


"కాశింజచ్చిన యంత వయంగారాని కైవల్యమ


క్లేశంబై నమవేద్యనాయకుని చే లీలాగతింజేరు రా


రో శీఘ్రంబున మర్తుయలారా! యను నారూపంబు


నమ్మోయునా కాశాస్పాలన గౌతమీజలధికీల్లోల స్థానముల్"


 


అంటూ శ్రీనాధమహాకవి తనన్పుకంఠంతొ మనుష్యులందర్నీ పాత్రోచితంగా ఆహ్వానించాడు. ఇందులో గోదారి పిలుపు తనకంఠంలో ప్రతిధ్వనించాడు.


 


"గోదావరి గోదావరి


గోదావరియంచు పల్కు గుణవంతులమేన్


గోదావరి తల్లి న


పాదింతు గదమ్మ భవ్య శుభంబుల్"


 


అంటూ నదీ మహాత్మ్యాన్ని తెలుపుతూ  గోదావరి నామోచ్చారణతో  పొంగి పులకించి పోయినవాడు శ్రీనాధుడు. తన కవితా మాధుర్యంతో "సప్తగోదావరీ జలముతేనె" అని రూఢిపరిచాడు. వార్ధులేడింటికిన్ వలపువనిత" అని గోదావరి మరో కోణంలోనూ చూపాడు. ఆ నకతశ్రేష్టుడైన శృంగారకవి "నేటివ్ స్పిరిట్" తో " సన్నాఫ్ ది సాయిల్"గా తన వివిధ గ్రంధాలలో శ్రీనాధుడు గౌతముని ఆబగా వర్ణించాడు.


 


"తెలుగుల పుణ్యపేటి" పోతన్న ఆంధ్రమహాభాగవతంలో రామాయణ కథా సంధర్భంలో దండకారుణ్యం గురించి తన శైలీ సౌందర్యంతో ఇలా వ్రాశాడు.


 


"పుణ్యుడు రామచంద్రుడటబోయి ముదంబున గాంచె దండకా


రణ్యము తాపసోత్తమ శరణ్యము నుద్ధత బర్హి బర్హలా


వణ్యము గౌతమీ విదులావఃకణ పర్యటన ప్రభూత


ద్గుణ్యము ఉల్లసత్తురుని కుంజవరేణ్యము నగ్రగణ్యమున్ "


 


గోదావరి విమల జలకణాల పర్యటనలవల్ల దండకారణ్యం సద్గుణ గణ్యమైందనడం ఒక పవిత్ర కథా సందర్భ రస స్పందన!


 


15 వ శతాబ్దికే చెందిన ప్రగ్గడపల్లి పోతయ్య "గోదావరి" మకుటంతో ఒక శతకమే వ్రాసినట్ట్లు కవి చరిత్రకారుల వలన తెలుస్తున్నా ఆ శతక పద్యం ఒకటే ప్రసిద్ధికి వచ్చింది.. ప్రగ్గడపల్లి " .. సురుచిరక్షోణీ పురంధ్రీ యశోధర ధమ్మిల్ల లతాంత మాలికో,  భతన్వీకుచశ్రీ, హరసువ్యాసమొనాగునీదగు ప్రవాహంబొప్పు గోదావరీ ! " అనే తన పద్యంలో భూమికి గోదావరి ఒక దండగాను, ఆ భూమికి కునంపదకు విస్తృతమైన సొగసుగాను ఉగ్గడించాడు. "హంసనింశతి" లో అయ్యలరాజు నారాయణామాత్యుడు నదులు జలపాతాలపై ఏకంగా ఇరవై నాలుగు పాదాల సీసమాలికను వ్రాశాడు. అందులో "గౌతమి" ని పేర్కొన్నాడు. టేకుమళ్ళ రంగశాయి కవి  తన "వాణీ విలాస వనమాలిక " గ్రంధంలో గౌతముడు, గోవుల కథను ప్రస్తావిస్తూ నాశిహిత్ర్యంబకునుండీ అంతర్వేది వరకూ ఉండే గోదావరిని దేవతలు, మునులు ప్రస్తుతిస్తూంటారన్నాడు.


 


ఒకానొక కాలంలో తెలుగులో నోబెల్ బహుమానం వస్తుందని ఆశించబడిన గ్రంధం భక్త చింతామణి. ఒకానొక కాలం నాటి సాహిత్యవేదికలు భక్త చింతామణి పద్యాలతో పులకరించిపోయాయి.  ఆ గ్రంధకర్త, వేణీసంహార ఆ నాటక ఆంధ్రీకరణకర్త వడ్డాది సుబ్బారాయుడు భక్త చింతామణి మకుటంతోనే 1932 లో ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికలో అంగీరస గౌతమీ పుష్కరం శీర్శికతో వ్రాసిన పద్యాల్లో చరిత్ర నిక్షిప్తం చేశారు.


 


"భువన క్షేమ విధాయి పుష్కర జనంబుల్ వేనవేల్ గౌతమీ.


సవనంబాదిగ రాణ్మహేంద్రనగరిన్ సర్వాశలందుండి తీ


ర్తవిధుల్ సల్పి కొనంగ మూగెదరు : చోరవ్యాధి బాధాది వి


ప్లవ మాంగీరస నొందనీకు ప్రజ దేవా భక్త చింతామణీ "


 


అనడంలో  యాత్రికులకు దొంగలబాధలు వంటివి లేకుండా చూడవలసిందిగా భగవంతుణ్ణి ప్రార్ధించారు. పుష్కర దినాల్లో విమానాల్లో విహరించే జనం దేవతల్లా ఉన్నారని అందులోని వేరే పద్యాల్లో అంటారు. అంగీరస పుష్కరంలో బండ్లకు నిండ్లకు బాడుగ తగ్గెనని వ్రాశారు. అది విశేషమే. గోదావరి ప్రాంతాంలో నూతులలో నీళ్ళు, గోదావరి బాగా వచ్చేటప్పటికి పైకి వస్తుండడం వుంది. వసురాయకవి అందుకే దానిని ఎలా పోల్చాడో!


"తల్లియొఱదాక నూతులు


కల్లోలవతీమ తల్లి గౌతమి రాకన్ "


గోదావరిలో లాంచీ ప్రయాణాన్ని"గౌతమీ ధూమ నౌక విహారం" అని వ్రాసిన రోజులు చిత్రమైనవి!  వసురాయకవి గోదావరి సంబంధంకంగా జలమాహత్మ్యంపైన వేరుగానూ ఎన్నో వ్రాసారు. స్థానిక ముద్ర రచనలపై ఎక్కువగా ఉంటుంది.


 


 


 


 

Thursday, November 1, 2007

టైమ్ మెషిన్....

time_machine.jpg

ఈ కథ మొత్తం చదివి చివరలో అడిగిన ప్రశ్నకు జవాబివ్వగలరేమో ప్రయత్నించండి….

1975 జనవరి 1

ఉదయం ఐదు గంటలైంది. ఇంకా సూర్యుడు నిద్ర లేవలేదు. చీకటిగానే ఉంది.అది బాపూ అనాథాశ్రమం. దాని నిర్వాహకుడు ప్రకాశం అప్పుడే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆ అనాథాశ్రమాన్ని ప్రారంభించి చాలా ఏళ్ళయింది. దానికి ప్రకాశమే వ్యవస్థాపక నిర్వాహకుడు. ఇంతలో బయటనుండి కలకలం వినిపించింది. ప్రకాశం ఏంటా అని బయటకెళ్ళి చూసాడు.

అనాథాశ్రమం మెట్లపైన చీరలో చుట్టిన ఒక పసిపాప. ఆడపిల్ల. అంతటి చలిలో రోజుల పాపను అలా వదిలేసి వెళ్ళిన వాళ్ళపై ప్రకాశంకు చాలా కోపం వచ్చింది. ముద్దులొలికే ఆ పసిపాపను తానే పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు.

17 ఏళ్ళ తరవాత..

ఆ పసిపాప (పద్మ) పెరిగి పెద్దదై ఇప్పుడు హాస్టల్లో ఉండి చదువుకుంటోంది. పద్మ వాళ్ళ క్లాస్‍మేట్ ఒకతనిని ప్రేమించింది. ఇద్దరొకటై గర్భవతైంది. అది తెలిసి హాస్టల్ నుండి గెంటేసారు. ప్రకాశం అది తెలుసుకుని వచ్చి పద్మను తిరిగి అనాథాశ్రమానికి తీసికెళ్తాడు. ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది, కాని ఆ పాపను ఎవరో ఎత్తుకెళ్తారు. అది విని తట్టుకోలేక ప్రకాశం ఆత్మహత్య చేసుకుంటాడు.

ప్రసవ సమయంలో కలిగిన కొన్ని ఆరోగ్య సమస్యలవల్ల పద్మ డాక్టరును కలిసింది. అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఆ డాక్టరు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు: ఆమెకు Adrenalo Sytosis అని, ఇది ఒక సీరియస్ జబ్బు .. దీనివల్ల శరీరంలో హార్మోనుల అవకతవకలు జరుగుతాయి. ఆపరేషన్ చేయాలి అని. కొద్ది రోజుల తర్వాత పద్మకు ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్ ఫలితంగా ఆమె మగవాడిగా (ప్రభు) మారిపోయింది.

ప్రభు చాలా బాధపడుతూ ఉండేవాడు, తన కన్నబిడ్డను పోగొట్టుకున్నందుకు, తనను పెంచిన ప్రకాశంగారు చనిపోయినందుకు, తన ప్రేమికుడు మోసగించినందుకు, మగవాడిగా మారవలసి వచ్చినందుకు… ఇది తలుచుకుంటూ తాగుడుకు అలవాటు పడ్డాడు.

ఒకరోజు ప్రభు తమ కాలనీలో ఒక కొత్త బార్ తెరవడం చూసాడు. దాని పేరు “అమృతా బార్”. లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద మనిషి కనపడ్డాడు. ఆ వ్యక్తి ప్రభును పిలిచి తాను కనుగొన్న “టైం మెషీన్” చూపించాడు. ప్రభు ఆ వ్యక్తిని బ్రతిమిలాడి అది ఇంటికి తెచ్చుకుని తాను గతం లోకి వెళ్ళాడు. 1992 సంవత్సరంలోకి….

1992 సంవత్సరం…

ప్రభు తన టైం మెషీన్తో పాటు 1992 సంవత్సరంలోకి అడుగెడతాడు. అక్కడ ఒక అందమైన అమ్మాయిని చూస్తాడు( అదే మగవాడిగా మారక ముందు ఉన్న అమ్మాయి). ఆమెని ప్రేమించి, కలిసి తిరిగి, ఒకానొక గడియలో ఒకటవుతారు. ఆ అమ్మాయి గర్భవతైంది. ప్రభు ఆమెను పెళ్ళాడటానికి నిరాకరించి, ఆ ఊరినే వదిలి వెళ్ళి పోతాడు. అలా ఇంకో ఊరికెళ్ళి కొంత డబ్బు సంపాదించి తిరిగి తను ప్రేమించిన అమ్మాయి ఉన్న ఊరికొస్తాడు.

కాని తనను గుర్తుపట్టకుండా ఉండాలని బారెడు గడ్డం పెంచుకుంటాడు.ఒక బార్ మొదలెడతాడు. “అమృతా బార్ “అని. ఒక రోజు అతను బార్లో కూర్చుని ఉండగా ఒక వ్యక్తి వస్తాడు( అదే వ్యక్తి ఇంతకు ముందు అమ్మాయిగా ఉన్నవాడు). గడ్డపు వ్యక్తి తన దగ్గరున్న టైమ్ మెషిన్ను ఆ వ్యక్తికి ఇస్తాడు. ఆ వ్యక్తి దాని సాయంతో గతంలోకి వెళ్ళిపోతాడు. ఇంతలో ఒక ముసుగు దొంగ వచ్చి కత్తి చూపించి ఆ టైమ్ మెషిన్ తన దగ్గర్నుంచి లాక్కుని ఆ గడ్డపు వ్యక్తిని తీసుకుని గతంలోకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళాక ఆ ముసుగు దొంగ ఆ మెషిన్ తిరిగిచ్చేసి గడ్డపు వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోతాడు.

గడ్డపు వ్యక్తి అలా అలా తిరుగుతూ బాపూ అనాథాశ్రమానికి వస్తాడు. లోపలికెళ్ళి చూస్తే అక్కడొక అమ్మాయి (తర్వాత అబ్బాయిగా మారిన అమ్మాయే), పక్కన అప్పుడే పుట్టిన ఆడపిల్లను చూస్తాడు. ఆ పసిగుడ్డును తీసుకుని టైమ్ మెషిన్ మొదలెట్టి ఆ పాపతో సహా గతం (1975) లోకి వెళతాడు.

1975 జనవరి 1

ఉదయం సుమారు నాలుగున్నర అయింది. గడ్డపు వ్యక్తి ఆడపిల్లతో బాపూ అనాథాశ్రమానికి వస్తాడు. ఆ పాపను ఆశ్రమ గుమ్మంలో వదిలి వెళ్ళిపోతాడు. కాలేజీలో చేరి బాగా కష్టపడి చదివి డాక్టరవుతాడు. ఒక రోజు ఒక స్త్రీ అతని ఆసుపత్రికి వస్తుంది. ఆమెను పరీక్షించి, ఆమెకు Adrenalo Sytosis అనే ప్రమాదకరమైన జబ్బు ఉన్నట్టు కనుగొని ఆపరేషన్ చేసి ఆ స్త్రీని మగవాడుగా మారుస్తాడు. ఆ తర్వాత టైమ్ మెషిన్ సహాయంతో గతంలోకి వెళతాడు. ఆప్పుడు అతను జనాలు పడుతున్న కష్టాలు చూసి మనసు ద్రవించి ఒక అనాథాశ్రమాన్ని ప్రారంభిస్తాడు. దానికి బాపూ అనాథాశ్రమం అనే పేరు పెట్టి అనాథ పిల్లలకు ఆసరా ఇస్తాడు.

ఒక రోజు అతని ఆశ్రమం ముందు ఎవరో ఒక పసికందును వదిలి వెళతారు. అతను ఆ బిడ్డను తన కన్న బిడ్డలా పెంచి పెద్ద చేస్తాడు. ఆ పాప పెరిగి పెద్దదై చదువుకుంటూ ఒక హాస్టల్లో ఉంటుంది. ఒకరోజు అతనికి ఒక విషయం తెలుస్తుంది: ఆ ఆడపిల్ల ఒక వ్యక్తి వల్ల మోసపోయి గర్భవతైందని, హాస్టల్ వాళ్ళు గెంటేసారని. జాలితో ఆ అమ్మాయిని తమ ఆశ్రమానికి తీసుకొస్తాడు. ఆ అమ్మాయి ఒక ఆడపిల్లని కంటుంది.

ఆ వ్యక్తి…అదే ప్రకాశం భవిష్యత్తులోకి వెళ్ళాలని అనుకుంటాడు. ముసుగు ధరించి, ఒక తుపాకి తీసుకుని టైమ్ మెషిన్ తీసుకుని అమృతా బార్ కి వెళతాడు. బార్ లోపలికి వెళ్ళి ఆ గడ్డపు వ్యక్తిని బెదిరించి తనతో పాటూ గతంలోకి తీసికెళ్తాడు. కాని గతంలోకి వెళ్ళాక పశ్చాత్తాప పడి ఆ గడ్డపు వ్యక్తికి టైమ్ మెషిన్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అలా తిరిగి మళ్ళీ తన ఆశ్రమానికి వచ్చాక తెలిసిందేమంటే పుట్టిన పసిబిడ్డను ఎవరో ఎత్తుకెళ్ళారని. అది విని తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకుంటాడు.

ఇంతకూ ఆ పసిబిడ్డను ఎత్తుకెళ్ళింది ఎవరూ????

తొలి ప్రచురణ పొద్దులో..

Sunday, October 28, 2007

వామ్మో!! ఏం దోపిడి!!!

నాకు రెండు నెలల క్రిందట హిందూ పేపర్లో వంటలపోటీలో  బహుమతి వచ్చిందిగా వెయ్యి రూపాయలది. అది తెచ్చుకుందామని 24 Letter Mantra ఆర్గానిక్ షాపుకి వెళ్ళాను మా అమ్మాయితో కలిసి. పెద్ద సూపర్ మార్కెట్. అందులో పనిచేసేవాళ్ళు తప్ప ఎవరూ లేరు. సరే ఎమేమున్నాయో చూసుకుంటూ వెళితే. నా గుండె లయ పెరిగిపోయింది. అలా ఉన్నాయి ధరలు. మనం వాడే ప్రతి సరుకు అర్గానిక్ అని పేరు పెట్టి నాలుగింతల ధర.అమ్మబాబోయ్!! ఇదేం దోపిడిరా అని ఇప్పటికీ అనుకుంటూనే ఉన్నాను. ఎలాగూ మనది ఉచిత కొనుగోలు కదా అని ధైర్యం చేసాం. వెయ్యి రూపాయలు చాలా సరుకులు తీసుకోవాలని కొన్ని తీసుకుంటే అవే 1500 అయ్యాయి. మొత్తం కలిపి పదిహేను ఐటమ్స్ లేవు. సరే అని కొన్ని తీసేసి బిల్లు వెయ్యికి దించేసి చిన్న క్యారీ బాగులో తెచ్చుకున్నాం ఆ సరుకులు. పట్టుమని పది వస్తువులు లేవు.

ఇలా ఎక్కువ ధరలు పెట్టడమెందుకో, అలా ఖాళీగా కూర్చోడమెందుకో. కనీసం అద్దె, జీతాలైనా మిగులుతాయో లేదో నా అనుమానం. ఈ ఆర్గానిక్ ఆహారం ఏమిటో అని ఇంటికొచ్చి పుస్తకాలు వెతికితే తెలిసింది. ఎరువులు, రసాయనాలు లేకుండా స్వచ్చంగా పండీంచినవి అని. అసలు వాతావరణం కాలుష్యం, మనుష్యుల  మనసులే కాలుష్యం ఆవరించి ఉంటే ఈ స్వచ్చమైన ఆహారాన్ని నాలుగింతల ధరలు పెట్టి తమని తాము రక్షించుకుందామనుకుంటున్నారా ఇవి తినే పెద్దమనుషులు.

కొన్ని ధరలు చూడండి. మనం ఇంటి దగ్గర దుకాణంలోగాని, సూపర్ మార్కెట్‌లో గాని దీని ధరలు ఎలా ఉన్నాయి,తేడా చూడండీ.  

దాల్చిన కప్ కేకులు - 5  -    65 - 00
హెర్బల్ సబ్బు         75 gm  - 55 - 00
నల్ల కారం పొడి        100gm   - 30 - 00
బాదాం                  100gm  - 84 - 00
మిక్స్‌డ్ ఫ్రూట్ జాం     200gm  - 119 - 00
జీడిపప్పు                100gm  - 110 - 00 
అల్లం వెల్లుల్లి            200gm  - 44 - 00
పిస్తా                      100gm  - 89 - 00                  

Saturday, October 27, 2007

తెలుగులో కామిక్స్



 ఇది కిడ్స్ ఖుషి వారి అనుమతితో నా బ్లాగులో పెడుతున్న. ఇది వారి

మొదటి ప్రయత్నం కాబట్టి తప్పులున్నాయి. చెప్పాను వారికి. సరైన

అనువాదకుడు లేక ఇలా జరిగింది అన్నారు. కాని వారి ప్రయత్నాన్ని

అభినందించాలి. వారి వెబ్‌సైట్‌నుండి డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు.

khushi-bear012.gifkhushi-bear023.gif

khushi-bear031.gif

khushi-bear051.gif 

khushi-bear041.gif

61.gif

Tuesday, October 16, 2007

పేద్ద తప్పు!!!!!!!!!

ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్ లోని బ్రౌజర్లో airtel అని టైప్ చేసి  Ctrl+Enter నొక్కండి. చూడండి తమాషా..

పేద్ద తప్పు!!!!!!!!!

ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్ లోని బ్రౌజర్లో airtel అని టైప్ చేసి  Ctrl+Enter నొక్కండి. చూడండి తమాషా..

test

Loading...